మిరపకాయ బజ్జీలు - అచ్చంగా తెలుగు

మిరపకాయ బజ్జీలు

Share This

మిరపకాయ బజ్జీలు

- లీలా సౌజన్య 


మిరపకాయ బజ్జీల పేరు చెపితేనే చాలా మందికి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అవి కారం లేకుండా  ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన పదార్ధాలు: బజ్జి మిరపకాయలు (ముదురు ఆకుపచ్చ పెద్ద మిరపకాయలు) – 10 వాము – 3 చెంచాలు సెనగపిండి – 4 గరిటెలు బియ్యపుపిండి – 1 గరిటె సోడా ఉప్పు – చిటికెడు చింతపండు – కుంకుడుకాయ అంత ఉప్పు – తగినంత చింతపండు మునిగేదాక నీళ్ళు పోసి గుజ్జు తీసుకొని, గాటుపెట్టిన మిరపకాయలు ఒక చెంచా ఉప్పు వేసి 5 నిముషాలు మిరపకాయల్ని చింతపండు నీళ్ళల్లో ఉడకనివ్వాలి. మిరపకాయలు చల్లారాక, వాము, ఉప్పు దంచిన మిశ్రమం, రెండు వేళ్ళతో కొంచెం కొంచెం మిరపకాయ లోపల వేసుకొని మిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మిరపకాయల్లో కారం పోయి మంచి రుచి వస్తుంది. సెనగ పిండి, బియ్యపు పిండి, సోడాఉప్పు, ఒక చెంచా ఉప్పు కలిపి కొంచెం జారుడుగా పిండి కలిపి మిరపకాయ ముంచి బజ్జీలు వేయాలి. వేగిన బజ్జిల మధ్యలో గాటు పెట్టి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, వేరుసెనగపప్పు పెట్టుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది.  

No comments:

Post a Comment

Pages