మన్మథనామ సంవత్సర ఉగాది.

- పెయ్యేటి రంగారావువచ్చింది వచ్చింది మళ్ళీ ఉగాది
మన్మథనామ శుభవర్ష తొలి రోజిది ||
ప్రతిదినము ప్రతి యింట సుఖశాంతులుండాలి 
పన్నెండు మాసములు సౌభాగ్యముండాలి  || 
 సరియైన సమయాన వానల్లు కురవాలి 
లోటన్నదే లేక జగమంత కులకాలి || 

 షడ్రుచుల కలబోత రుచి చూడ రండి
 అన్నింట సమభావ మలవరచుకోండి || 
పొరుగింటి శ్రేయస్సు మది కోరుకోండి 
ఈసు నసూయల దరిజేర్చకండి || 

 ముదమెక్కడుందో అది తెలుసుకోండి 
మదిలోకి కోర్కెల రానీయకండి || 
 శ్రీరస్తు శుభమస్తు సుఖప్రాప్తిరస్తు
 సర్వేజనాస్సుఖినో భవంతు || 
*************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top