అమ్మంటే..!

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు అష్టోత్తరాలు..శతనామాలు అక్కర్లేదు

పూజలూ పునస్కారాలు అవసరంలేదు

హుండీలో భూరికానుకలు వేయనక్కర్లేదు

మొక్కులు తీర్చుకోనక్కర్లేదు..

ముడుపులు కట్టనక్కర్లేదు..

నోములు వ్రతాల అవసరం లేదు

ఉపవాసాలు చెయ్యనక్కర్లేదు

దక్షిణలు ఇయ్యనక్కర్లెదు..

దానాలు చేయనవసరంలేదు

భజనలూ..సత్సంగాలు వద్దేవద్దు

అయినా అనంతమైన పుణ్యమొస్తుంది

అమ్మను సేవిస్తే!

కటాక్షించడంలో కరుణామయి

సేవలు చేయడంలో మదర్ థెరిసా

కడుపునింపడంలో అమృతమయి

సదా మన మంచి కోరుకునే నిస్వార్ధజీవి

అడక్కపోయినా వరాలిస్తుంది

‘చిరంజీవా’ అని దీవిస్తుంది

సృష్టిలో అమ్మకి సాటిలేదు

పిల్లలుగా పుట్టి అమ్మప్రేమ పొందడమే

గొప్ప భగవదనుగ్రహం

ఈ మర్మం తెలుసుకోవడమే

మానవ జన్మకి చరితార్థం!

 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top