Sunday, February 22, 2015

thumbnail

తొలిపలుకు తెలుగులో…

తొలిపలుకు తెలుగులో… 
(కవితకు చిత్రం : చిత్రకారుడు హంపి ) 
 జి.ఎస్.లక్ష్మి 

పల్లవి_
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

అనుపల్లవి_
మ్మ ఒడి నిశ్చింత దిగా మొదలై
ల్లంత నిండగా డుగా పదములూ
దయ సంధ్యల నెపుడు యలలు ఊగగా
ల్లారు రారండి కమౌదాము
కమత్యము కలిగి మనమంత కటైతె
టమే లేదండి నౌననండీ
అందలం యెక్కంగ అందరూ రండీ
అంతఃపుర మంతటా కాంతి నింపండీ

తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

దలి వచ్చిన మెరియు సంద్రంబు పగిది
ర్మలను తునిచీ, ప్రాణంబు నిలిపీ
ళములన్నియు కలసి జయగీతి పాడగ
నఘనా ఘనఘనా స్వరములే మోగగ
ఙ్ఞాపకాలన్నిటినీ కలబోసి అందరం
ప్పట్ల హోరుతో సందడులు చేసీ
త్రమొకటే ననుచు ఆ నీడ గుమిగూడ
డుపేమి లేదండి జనులార మీకు
ఝుంకార ధ్వనులతో కొత్త పదములు నేర్వ
ఙ్ఞాన దీపిక పట్టి చేరగా రండీ

తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

ముకు లేయుచు జనులు సంతసంబందగా
ఠీవిగా నిలబడీ దీటుగా తలయూచి
డోలు, సన్నాయిలే జోడుగా మోగగా
మఢమల ధ్వని మనల నుత్సాహపరుచగా
వాణి నా రాణి యన్న పెద్దలను కొలిచి
గువులాడక తరతమములే యెంచక
లుగా మార్చి మన గొప్పలే తెలుపగా
గ్గరవుదామండి దరిజేర రండీ
నము మన కేమిటికి మన జాతి కన్నా
గము కదిలిద్దాము నవ్వుతూ రండీ

తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

రదేశమేగినా పదిమంది కలిసీ
ణి మీద మణి వోలె మన భాష నిలిపీ
డులు గుడులూ కట్టి సభలెన్నొ చేసీ
యమేమిలేదు మన భాషకికనంచు
ధురవాక్కులు  పలుక మనకేమి వెరపూ

తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

శము మనదేనండి థము కదిలించండి
క్షల్లొ జనులనూ  వుద్వేగపరచండి
 మదమాదులను "ట్" యంటు తోసేసి
రిగమల లముతో దున్ని పారేసి
యేళ్ళగా గల చరిత ఊళ్ళన్ని తెలియగా
క్షీరాభిషేకమ్ము చేదాము తెలుగుకు...

తలవంచి మొక్కరా తల్లి భారతికీ

జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information