పరవస్తు పద్య పీఠంతో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

పరవస్తు పద్య పీఠంతో ముఖాముఖి

Share This
పరవస్తు పద్య పీఠంతో ముఖాముఖి 
- భావరాజు పద్మిని. 

 ' స్వంత లాభం కొంత మానుకుని' , తాను సాధారణ మధ్యతరగతికి చెందినవారైనా, ఉదారతతో ముందడుగు వేసి, మన పద్యాన్ని, భాషను, వ్యాకరణాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో తనే ఒక సైన్యంగా మారి భాషా పరిరక్షణకు 'పరవస్తు పద్య పీఠం' స్థాపించి, అహర్నిశలూ కృషి చేస్తున్నారు... పరవస్తు ఫణి శయన సూరి గారు. వారితో ముఖాముఖి చదివి , మీరూ స్పూర్తి పొందండి... 
అ.తె : నమస్కారమండీ... పరవస్తు :అమ్మ నమస్కారం. అ.తె : మీ బాల్యం ఎక్కడ సాగిదో చెబుతారా ? 
పరవస్తు :అమ్మ మాది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రక్కన రామగోపాల పురం అనే పల్లెటూరు. నాన్నగారు, జేజినాయనగారూ సాహిత్య కృషి అంటూ ఏమీ చేయలేదు. కొంచెం పేదరికం కావచ్చూ, కుటుంబకారణాలు కావచ్చూ, సాహిత్యం మీద వారు దృష్టి పెట్టలేదు.మొదటినుండీ కూడ పౌరోహిత్యం మా జీవనాధారం. కొంచెం మా బాబాయి గారు కొంత సాహిత్యాభిలాష ఉండి .. చందో భద్దమైన పద్యాలు రాయకున్నా కవిత్వం మీద వారికి మంచి పట్టుంది. మేము ఎవరూ అంత స్థాయిలో సాహిత్యం మీద కృషిచేసిన వాళ్లెవరూ లేరండీ.! 
అతె : పరవస్తు చిన్నయసూరి గారి వంశీయులు కదా మీరు .. వారు మీకు ఏమౌతారండీ? 
పరవస్తు : ఆయన మాకు ముత్తత అవుతారు. మాది ఐదవతరమండీ. పరవస్తు వెంకయ సూరి గారని ఉన్నరు వారు సాహిత్యంలో బాగా కృషి చేశారని చెప్పొచ్చు. వారు ఆయన చిన్నయసూరి గారి జీవిత చరిత్రమీద పద్యకావ్యం వ్రాశారాయన. వాళ్లమ్మగారూ మానానమ్మ గారు అప్పచెల్లెళ్ళు. తరువాత శక్తిదేవి అని కంబంచెరువు మీద పెద్ద నవల వ్రాశారు. సాహిత్య ప్రసంగాలు చేయడం గానీ చేశారు,పరవస్తు వంశానికి చెంది కాస్తో కూస్తో ఇంచుమింఛు మా ఇలాకాలో సాహిత్యాభిలాష, స్సాహిత్య కృషి చేసిన వారు మాత్రం మా పెద్దనాన్న గారైన వెంకయ్య సూరి గారేనండీ. మా నాన్న గారి గురించి చెప్పలంతే సాహిత్య కృషి చేయలేదనే నిర్మొహమాటంగా చెప్పాలి 
అ.తె : మీకు పద్యాల మీదాసక్తి చిన్నప్పటి నుండే ఉండేదా? 
పరవస్తు : చిన్నప్పటి నుండే వుండేదండీ.. నాటకాలవ్వి వెయ్యడం, ఇంట్లో సాహిత్య పరమైన కృషి లేకపోయినా, స్నిత పాండిత్యం ఉంటుందికదండీ..నాటకాలేసినప్పుడు, కీర్తనలు విన్నప్పుడు సాహిత్యం మీద అభిలాషేర్పడిందని చెప్పవచ్చు. చదువుకునేటప్పుడు నేనుకూడా నాటకాలవి వేస్తుండేవాడిని. కుటుంబనేపథ్యం గురించి గమనిస్తే కొంచెం పేదరికంలో వుండటం, మా ఇంట్లో ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి.. వీరిలో నేను పెద్దవాణ్ణవ్వటం వల్ల కొంచెం ఇంటి బాధ్యత తీసుకోవాలనేది నా ఉద్దేశ్యంగా ఉండేది. ఆ క్రమంలో నాకు ఆర్.టి.సి లో ఉద్యోగం రావటం జరిగింది. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేశాము. వ్యాపారంలో నష్టపోయాం రియలెస్టేట్ వ్యాపారం చేశాము.. తొలిలో వ్యాపారం బాగా జరిగింది. 94 లో వచ్చిన తుఫాను దెబ్బకి రైతులు నష్టపోయారు వారితో పాటూ మేము నష్టపోతాము. మంచి పొలాలు వేసిన రైతులు కూడా దెబ్బతిన్నారు. గోటి చుట్టు మీద రోకటి పోటులా ఆర్ధికంగా దెబ్బతినడం జరిగింది. ప్రస్తుతం పూలవ్యాపారం మొదలెట్టి కాస్త అప్పుల ఊబి నుంచి కోరుకున్నాం. అయితే చిన్నయసూరి వంశీయులమవ్వడమో ఏమో సాహిత్యం కి కాస్త ఏదైనా చేయాలనేది నా ఆశక్తి. చిన్నయసూరి గారి పేరుమీద ఏదైన సంస్థను స్థాపించి సాహిత్యానికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించా.! అంతే గాక ఇక్కడ గొప్ప గొప్ప కళాకారులున్నారు, వారి సాన్నిహిత్యంలో మరింత ఆసక్తి ఏర్పడింది.. కళ్ళు చిదంబరం గారు కానీ, గొల్లపూడి మారుతీరావు గారు కానీ, వంకాయల సత్యనారాయణగారు కానీ,సినిమా వ్యక్తులు కూడా పరిచయమవడం, వాళ్ళు నిర్వహించే సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం, సకల కళా సమాఖ్య అని పెట్టరు . అందులో ణేను కూడా వారితో కలిసి కార్యక్రమాలు చెయ్యడం వంటి వన్నీ సంస్థ స్థాపించాలనే కోరిక పెరిగింది. అయితే ఆలోచన బాగున్న ఏంచేయాలనే విషయం పై తర్జనభర్జన పడి పిల్లలకు పద్యాలు నేర్పిస్తే, భాషాపరంగా సేవ చేసినట్లు ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన సంస్థ "పరవస్తు పబ్లికేషన్స్". ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యం ఏమిటంటే.. తెలుగు పద్య మాధుర్యాన్ని చిన్నారులకు అందించడమే.! 
అనుకోకుండా పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థాపించిన మూడేళ్ళలో రెండు వేల మంది కి పైగా విద్యార్ధులు పద్యాలు నేర్చుకున్నారు. పద్యానికి పది రూపాయలు బహుమతి కూడా పెట్టడం మరోవిశేషం. దీంతో పోటీ తత్వం పెరిగి , పద్యాలు నేర్చుకోవడం చాలాగొప్ప విశేషం. దాదాపు ఇప్పటి వరకూ మూడు లక్షల రూపాయల బహుమతి పిల్లలకి అందించడం జరిగిందండీ.. 
అ.తె: అంతమొత్తం బహుమతిగా అందించడమనేది గొప్ప విషయం. కానీ మీకు ఆర్ధికంగా ఇది చాలా పెద్దమొత్తము కదా.. ఎలా ఎదుర్కున్నారు ఈ పరిస్థితిని?? 
పరవస్తు : ఈ కార్యక్రమం మొదలెట్టే నాటికే ఈ మంచి పనికోసం నేను కొంత మొత్తాన్ని దాచి ఉంచడం జరిగింది. ఈవెంత్ మేనేజర్ గా కొంతకాలం వ్యాపారం చేసి ఉండటం వల్ల ఈ వెసులుబాటు కలిగింది. ఈ కార్యక్రమానికి ఎవరినీ చందాలు అడగకూడదు అనేది మా ఉద్దేశ్యం. ఎవరైనా వారికి వారు సహకరిస్తే తప్ప చందా అడగకూడదనే నియమం పెట్టుకొని ముందే అయిదు లక్షల రూపాయల మూలనిధిని ఏర్పాటు చేసుకుని ఈ పరవస్తు పద్యపీఠం ఏర్పాటు చేయడం జరిగింది.. అనుకోకుండా ఈ ప్రసారమాధ్యమాలు కూడా పరవస్తు పద్య పీఠం కార్యక్రమాలకు విస్తృతప్రచారం కల్పించడంతో..పిల్లలు కాని, పిల్లల తల్లిదండ్రులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువగ ఆసక్తి చూపారన్నమాట. దాంతోపాటూ దాతలు కూడా ముందుకొచ్చారు. డా. సూరపనేని విజయ్ కుమార్ గారు ఋషి ప్రియుడు..సాదాసీదా గా కనిపించే కోటీశ్వరుడు.. అయన ముందుకొచ్చి ఈ ఏడాది జరిగిన కార్యక్రమంలో అయిన ప్రతి పైసా ఆయనే భరించడం గొప్పవిషయం. అయితే ఇప్పుడు కొత్తగా తెలుగు బడి అని ఒకటి ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ వారం వారం పద్య విహారం అని ప్రతి ఆది వారం నడిపేవాళ్ళం ఏదో ఒక ప్రాంతం ఎంచుకుని అక్కడి విద్యార్ధులకు 'పద్యము ఫలము " అనే పుస్తకం వారికందించి , నాలుగు వారాల పాటు నేర్పడం అనంతం ప్రావీణ్యత ప్రదర్శించిన వారికి బహుమతులివ్వడం జరుగుతుండి.. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన తెలుగు బడి ద్వారా..పద్యం తోపాటూ , వ్యాకరణము చంధస్సు నేర్పాలి అనేది ఉద్దేశ్యం .ఈ రోజు పదవ తరగతి పిల్ల వాడికి కూడా పిల్లలకు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం కూడా తెలియని పరిస్థితి. మిగతా సబ్జెక్ట్ ల మీద పెట్టే శ్రద్ధ తెలుగు మీద పెట్టడం లేకపోవడం అందరికీ తెలిసిందే..! 
అ.తె : పిల్లలు వారి బిజీ షెడ్యూల్ కూడా హడావుడి గా ఉంటుంది కదా. మరి వారి కి ఇవి ఎప్పుడు నేర్పుతారు. 
పరవస్తు : వారం వారం పద్య విహారం ప్రతి ఆది వారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పెడుతున్నము. తెలుగు బడి మాత్రం సాయంత్రం పూట పెడుతున్నాం. 5 గంటల నుండి 7 గంటల వరకు. రెండు బృందాలకు తర్ఫీదిస్తున్నాం 
అ.తె : ఈ శిక్షణ మీరొక్కరే ఇస్తున్నారా?? మీరు గాక అధ్యాపకులెవరన్నా వున్నారా?? 
పరవస్తు: అధ్యాపకులెవరూ లేరమ్మా!.. నేనొక్కడినే చెబుతున్నాను. ఈ నెలలో మరొక ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటున్నాం. యువకులను చేర్చుకుంటే వారికీ పోటీ పరీక్షలకు ఉపయోగపడాలన్నది నా ఉద్దేశ్యం. పైగా పద్యంలో, భాషలో ,వాచకంలో స్పష్టత ఎక్కువగా కనిపించడం లేదు.. అందుకే కాస్త వారిని వెదకటం కష్టతరమౌతుంది.. ఏదేమైనా మర్చిలోపు మరో ఇద్దరు శిక్షకులు తీసుకోవడం జరుగుతుందండీ. 
అ.తె : తెలుగు బడిలో తరగతులు ఏ సమయం లో నిర్వహిస్తున్నారు?
పరవస్తు :సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తున్నామండీ.! 
అ.తె : శిక్షణ కోసం పుస్తకాలేమన్నా రూపొందించారా?
పరవస్తు : పద్య విభాగానికైతే "పద్యాలు - ఫలాలు" అనే పుస్తకం రూపొందించుకున్నాము . అందులో 116 పద్యాలు అవన్నీ ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలుంటాయి . రెండవ భాగాన్నీ మార్చిలో ముద్రించుకోనున్నాం .. అందులో సీసం, చంపకమాల, ఉత్పలమాల వంటి పద్యాలుంటాయి.. వ్యాకరణము , చందస్సు, పుస్తాకాలు ముద్రించలేదుకానీ , కొంత మెటీరియల్ సిద్దం చేసుకుని వారికి నేర్పించడం జరుగుతుంది.. వీలైనంత వరకూ తెలుగు బడి కోసం ప్రత్యేక పుస్తకం ఒకటి చేయాలని ఉన్నది మార్చి , ఏప్రియల్ లో ఆ పుస్తకమూ విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాము. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీషు మీడియం విద్యార్ధులు కూడా విరివిగా పద్యం నేర్చుకోవడానికి వస్తున్నారు.. వారికి అ.ఆ లు కూడా రావు వారికి. వారుకూడా ఇంగ్లీషులో వ్రాసుకుని నేర్చుకుని అప్పజెప్పుతున్నారు.. అది గొప్ప విషయం అంతే తెలుగు పద్యం పై ఆశక్తి తగ్గలేదు అనేది సత్యం. మనం ఏదైతే భాష పట్ల పోగొట్టూకున్నామని మదన్ పడుతున్నామో మన పిల్లలు ఆ భర్తీ పూర్తి చేయడం తథ్యం. 
అ.తె : మీ వృత్తి, ప్రవృత్తి కి సంతులనం ఎలా చేయగలుగుతున్నారు. 
పరవస్తు : వృత్తి పరంగా కాస్త తగ్గినట్లే.. గతంలో నాలుగు కార్యక్రమాలు చేసే వాడిని ,, ఇప్పుడు రెండు కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతున్నా.. కాబట్టి వ్యాపారపరంగా, ఆర్ధికంగా నష్టం జరుగుతున్నాట్లే.. కానీ ఈ తృప్తి ముందు అవి చాలా తక్కువేమో అనిపిస్తుంటుంది. 
అ.తె : ఎవరైనే స్వచ్చందంగా ముందుకు వచ్చి మీకు సాయమందిస్తామటే మీరు అంగీకరిస్తారా? విదేశాల్లో అయితే స్వచ్చందంగా వచ్చి పాఠాలు బోధించే వారధికంగా ఉంటుంటారు. అలా ఎవరైనా ముందుకొస్తే వారితో కలిసి పనిచేస్తారా? 
పరవస్తు : ఓ.. తప్పకుండా .. అంతకన్నా అదృష్టం మరోటుంటుందా.. అలాంటి మహానుభావులు ఎప్పుడైనా రావచ్చు.. 
అ.తె : రానురాను తెలుగు భాష ఆధునికంగా మారిపోతుండి కదా?? వ్యాకరణం ఎంతవరకూ అవసరమంటారు?? 
పరవస్తు : వ్యాకరణ అవసరం పై ఓ శ్లోకం ప్రాచుర్యంలో వుండేది.. ఒక తండ్రి తన పుత్రుడికి వ్యాకరణం నేర్చుకోరా అని చెప్పే పద్యం.. నువ్వు పెద్ద పెద్ద శాస్త్రాలు చదివి పండితుడివి కాక పోయినా ఫర్వాలేదు కాని వ్యాకరణం మాత్రం వంటబట్టించుకో అనే అర్ధం లో ఉంటుందన్నమాట. 
యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం 
 స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్ 
అంతే ఎందుకంటే.. శబ్ధాల యొక్క అర్ధాలు మారి పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యాకరణాం మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉండి.. ఈ పద్యాన్ని గమనిస్తే .. స్వజనం మన బంధువర్గం అని అర్ధం రాగా.. రెండవ శ్వజనం అనగా కుక్కల గుంపు అని అర్ధం స్ఫురిస్తుంది. సకలం అంటే అన్నీ అని, శకలం అంతే ఖండము (ముక్క) అని అర్ధం వస్తుంది. సకృత్ అంటే అరుదుగా అని అర్ధం.. శకృత్ అంటే మాత్రం పేడ అని అర్దం వస్తుంది. కాబట్టి ఈ పదాల యొక్క అర్ధాలు మారిపోకుండా వుండాలంటే..దానికోసమైనా వ్యాకరణం నేర్చుకోవాలి మరి. పత్రికలలో కూడా అనేక పదాలు తప్పుగా వ్రాస్తుండటం కనిపిస్తోంది.. అసలు పాత్రకేయుడు అని వ్రాయకూడదు.. పాత్రికీయులు అనాలి, షష్టి పూర్తి అనాల్సింది షష్ఠిపూర్తి అంటున్నారు.. అది తప్పు.. ఇంకా " గోదావరికి వరదలోచ్చాయ్ అని వ్రాస్తుంటారు.. అది తప్పు వరద అంతే మంచి అని అర్ధం.. ఇవి పెద్దప్రమాదాలైన తప్పులుకాక పోయినా అవి అలా స్థిరపడటం ఆలోచించాల్సిన విషయం. ఇంకా చెప్పలంటే ప్రశ్నాపత్రం అని సంధి కూడదు.. ప్రశ్నపత్రం అనే వ్రాయాలి. భానోదయం అని వ్రాస్తుంటాము ఇది ఎలా వచ్చిందంటే.. చంద్రోదయము లాగా వచ్చింది.. కానీ అది తప్పు ప్రయోగం భానూ+ ఉదయం భానూదయం అవుతుంది. కానీ ప్రస్తుతం వ్యవహారికంలో భానోదయం అయిపోయింది.. ఇలాంటి చిన్నచిన్న లోపాలు, ఆ మార్పులు చేర్పులు అనేవి కూడా మనవాళ్లకి తెలిస్తే పత్రికల్లో అవికుడా మార్పుకి నోచుకుంటే ఎంతో ఉపయోగం ఎందుకంటే పర్తికలు నేరుగా పిల్లల మీద ప్రభావం చూపుతాయి. 
అ.తె : ప్రస్తుతం మన కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయండి ? 
పరవస్తు : బానే జరుగుతున్నాయమ్మా . పిల్లలు వస్తున్నారు . నేర్చుకుంటున్నారు . అందులో మనం కూడా ఏంచేస్తున్నామంటే , ఈ పద్య విహారంకు వచ్చినటువంటి పిల్లలకు పద్యం చెప్తూ, ఓ కార్యక్రమం చేసి బహుమతి ప్రదానం చేస్తున్నాం . ఆ బహుమతి ప్రదానం అప్పుడు ఓ పది మంది పిల్లలను ఎంపిక చేసి వారి చేత ఓ ఐదుగురు ప్రాచీన కవుల , ఓ ఐదుగురు ఆధునిక కవుల వేష ధారణ వేయిస్తున్నామన్నమాట . వారు పద్యాలు చదువుతుంటే , గరికపాటి నరసింహారావు గారి లాంటి పండితులను , కవులను , అవధానులను తీసుకు వచ్చి వాళ్ళు తెలుగు పద్యం , వ్యక్తిత్వ వికాసం అనే అంశం మీద వాఖ్యానం చేస్తారు . ఆ కార్యక్రమం అలా చేస్తూ ఆ కార్యక్రమంలోనే పిల్లలకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది . మనం కొన్ని చూస్తే .. ప్రధానానికి , ప్రదానానికి కూడా అర్ధం తెలీకుండా రాసేస్తాము . ప్రధానము అంతే నృత్యము . ప్రదానము అంతే ఇవ్వటము అని . మనం పొట్టలో మేకు అన్నిటికి పెట్టేస్తూ ఉంటాము . ఇవి ప్రమాదకరమైన విషయాలు కాదు కాని భాషా వైభోగం అంతా అందులోనే వుంది కదా .. ! మనం తరగతుల్లో , తెలుగు బడిలో కొన్ని సూచనలు చేస్తూ వస్తున్నాము . వాళ్లకు సరదాగా కధల రూపంలో కాస్త భాష మీద ఇష్టం కలిగేటట్లు మనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది . మీరన్నట్లు ఇది మంచి ఆలోచన అమ్మా . మనం పేస్ బుక్ లో పెడదాము(చేద్దాము ). నాకు ప్రధానమైన లోపం ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జి లేదు . కంప్యూటర్ మీద సరైన అవగాహన లేక పోవడం వలన కూడా ఇది వెనుక బడుతుంది . తరువాత నాకు స్కైప్ మీద కూడా ఓ ఆలోచన వుంది . ఎవరైనా , ఎక్కడినుండైనా తెలుగు పద్యాలు నేర్చుకోవాలంటే ఉదయం , సాయంత్రం ఒక గంట వారి కోసం కేటాయించి ఆ స్కైప్ లోనే పద్యం చెప్పుకునేటట్లు ఆలోచన వుంది . కాని అది ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు . అవాంతరాలు ఏమి లేవు కాని కాస్త బద్దకమనుకోండి నాక్కూడా . 
అ.తె : చక్కగా పది పది పద్యాలు వీడియో చేసి యుట్యూబ్ లో పెట్టేస్తే ఒకటి , రెండు , మూడు , నాలుగు వాల్యూమ్స్ ... అలా కూడా చూస్తూ నేర్చుకుంటారండి . ప్రతి రోజు ఉదయం అని కాకుండా చక్కగా ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు నేర్చుకునే అవకాశం వుంది . 
పరవస్తు : తరువాత మనం ఒక సిడి కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం . ఆ సిడి లో శైలి ఒకటి పెట్టుకున్నాం పిల్లల కోసం . వాస్తవంగా పెద్దల మాట ప్రకారం పద్యాన్ని పాడకూడదు చదవాలి . కాకపోతే వచనానికి , పద్యానికి తేడా తెలియాలంటే పద్యాన్ని ఏదో ఒక శైలిలో చదవగలిగితే వినే వాళ్లకు , నేర్చుకునే వాళ్లకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సులభంగా ఉండే ఒక శైలి పెట్టుకున్నాం . ఆ శైలి నే పిల్లల చేత ధారణ చేయిస్తున్నాము . 
అ.తె : మా అచ్చంగా తెలుగు పాఠకుల కోసం ఓ రెండు పద్యాలు పాడి వినిపిస్తారా ? 
పరవస్తు : ఓ, తప్పకుండా అమ్మ . పద్యం కోసం ఓ శైలి పెట్టుకున్నాం అన్నాంగదా... ఆ శైలి ఒకసారి మీకు వినిపిస్తాను కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ ఇలాగ మనం ఒక శైలి ఏర్పాటు చేసుకున్నాం పద్యానికి . ఇందులో ఏ రాగం వుంది అనేది నాకైతే తెలీదు . వాస్తవంగా రాగాన్ని దృష్టిలో పెట్టుకునైతే ఈ శైలి పెట్టుకోలేదు . 
అ.తె : బావుందండి . 
పరవస్తు : ఇలా ప్రతి పద్యాన్ని ఈ శైలి లో చదువుకున్నట్లై యితే , పిల్లలు త్వరగా అలవాటు పడి ఆ శైలి పట్టుకుంటున్నారు . 
అ.తె : శైలి బావుందండి . వినూత్నంగా వుంది . శ్రావ్యంగా వుంది . 
పరవస్తు : సందర్భాన్ని బట్టి పదములోని భావాన్ని కూడా మనం ఈ శైలి లో ఒదిగించు కోవచ్చు . అలుపెరగదు జలపాతము అలుపెరుగదు గుండె జీవితాంతము వరకున్‌ అలుపెరుగదెపుడు గాడుపు అలుపెరుగని జనులె విజయమందెదరిలో ఇలాగ మనం ఏ పద్యాన్ని ఐనా ఈ శైలి లో ఇముడ్చుకోవచ్చు . 
అ.తె : బావుందండి . నిజంగా చాలా మంచి మంచి పద్యాలు వున్నాయి మీ దగ్గర చక్కగా . 
పరవస్తు : మనం 116 పద్యాలు చేశాం . అవన్నీ కుడా పురాణం , శతకం , నాటకం , చాటువు , ప్రభందం మొదలగు వాటి నుండి ఎంపిక చేసి పిల్లల చేత ధారణ చేయిస్తున్నాము . నాటక రూపంలో ధారణ చేయిస్తున్నం కదా ... పిల్లలు కూడా ఇంకేదో కొంత రాగాలాపన ఉంటే బావుండనే సూచనలు కూడా చేస్తున్నారు. కాబట్టి శ్రావ్యంగా పాడగలము అని అనుకున్న పిల్లలకు రాగయుక్తంగా నేర్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఉదాహరణకు భాషా వైభవం మీద ఒక పద్యం ఉందమ్మ రాయప్రోలు వారి పద్యం అది. మాల్కోస్ రాగం లో అమర్చుకున్నాము, పాల క్రొమ్మీగడల్ పచ్చి వెన్నయు నిచ్చి –తీయని నును పూసా లాయెనేమో కమ్మని మకరంద కణములు స్నేహించి -చిన్నారి పలుకులి చిక్కే నేమో పూల లావణ్యంబుపొంగి చక్కదనాల –పిందేలై రుచి లెక్కి పెరిగే నేమో సెల ఏటి యుయ్యాల కులుకు టోయ్యారముల్ -ముద్దు ముచ్చట లయి పాటకును ,పద్యమునకును నబ్రముగా నొదిగి -చవికి చాతుర్యమునకు ,సాజముగా సాగి పోరునకు ,పోత్తు నకు జాతి పొంది పొసగు –మా తెలుగు తల్లి మెడ కిదే మల్లె దండ . ఇలా రాగం కట్టీ కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతోందమ్మ!.. 
అ.తె : చాలా బాగుందండీ .. లాభాపేక్ష లేకుండా మీరింత కృషి చేయడం నిజంగా గొప్ప విషయమండి.. పద్యం నేర్పడమే కాకుండా వారికి ఎదురు బహుమతుల రూపంలో ఆదాయం ఇచ్చి , వారికి పద్యం పట్ల ఆసక్తిసృష్టించి, మీరు మొదలెట్టీన ఈ ఉద్యమం వైజాగ్ లోనే గాక హైద్రాబాద్ వంటి నగరాల్లో కూడ విస్తరించాలని కోఫ్రుకుంటున్నానండి. 
పరవస్తు : సంతోషం అమ్మా! ధన్యవాదాలు మీకు. ఈ సంవత్సరం కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నాం .. వారం వారం పద్యవిహారం మాత్రమే కాకుండా ప్రతి ఏటా డిసెంబర్ లో తిరురు ప్రయాణం చేయబోతున్నాం. డిసెంబర్ 20 వ తేదీ చిన్నయ సూరి గారి జయంతి. ప్రతి సంవత్సరం మూడు రోజులు అనగా 19,20, 21 లలో తెలుగు తిరుణాళ్ళు చేసుకుంటున్నాము. 20 వ తేదీ కవో పండితుడికో చిన్నయసూరి పురస్కారం ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. ఈ తిరుణాళ్ళలో ఉదయంపూట సాహిత్య కార్యక్రమం, సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు జరపడం ఆనవాయితీ.. 2014 డిసెంబర్ లో గరికపాటి వారికి చిన్నయసూరి పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నాం. అంతకు ముందు మీగడ రామలింగేశ్వరస్వామి వారికి ఇవ్వడం జరిగింది.. నటులు, కవి , గాయకులు వారు.. ఈ సంవత్సరం ఎవరికివ్వాలా అని ఆలోచిస్తున్నాం.. పండితులెందరో ఉంటారు కానీ , నేను ఒక్కొక్కరికి సన్మానాలు చేస్తూ పోతుంటే మహా ఐతే ఓ 20 మందికి మాత్రమే 20 ఏళ్ళలో సన్మానం చేయగలుగుతాను.. అందుకని ఈసారి నుంచి నాలుగు రంగాలు తీసుకుని, పద్యాం, గద్యం ,నాటకం, వంటి ప్రక్రియలలో కృషిచేసిన ఓ ఐదుగురు మహానుభావులని సన్మానించుకుంటే బావుంటుందనే ది ఒక ఆలోచన మాత్రమే..! ఇంకా కార్యరూపం దాల్చలేదండీ.. ఎందుకంటే ఆర్ధిక విషయాలతో ముడి పడ్డ కార్యక్రమాలు కాబట్టీ అవి కూడా ఏర్పాటు చేసుకుని మొదలుపెడదామనేది నా ఉద్దేశ్యం. ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే పాఠశాలలకు కూడా వెళ్ళటానికి నిర్ణయించాం. ఓ పదివేల మండి విద్యార్ధులను ఈ సంవత్సరం తయారు చేయాలి రానున్న డిసెంబర్ లో జరిగే కార్యక్రమంలో పదివేల మండి విద్యార్ధులను తయారు చేయాలనేది ఒక నిర్ణయం చేశాం. వేసవి శెలవులనంతరం పాఠశాలలు తిరిగి పాఠశాలలు ప్రారంభం చేసిన తర్వాత ఈ కార్యక్రమం కార్యరూపం దాలుస్తుందమ్మ.! ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కార్యక్రమాలపై కూడా దృష్టి పెడతాం. 
అ.తె : మీరు పాఠశాలల్లో కనుక ఈ కార్యక్రమాన్ని చేపడితే గనుక సి.బి.ఎస్.సి సిలబస్ ఉన్న పాఠశాలల్లో వాళ్లకి బదిలీ ఉద్యోగాల వాళ్ళ పిల్లలు తెలుగు నెర్పించలేకపోయాం. ఇప్పుడు మా పిల్లలికే మేం ఏమీ నేర్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సి.బి.ఎస్.సి పిల్లలకు నేర్పిస్తే కొన్ని పద్యాలైనా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉండండీ.. వేసవి తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మీ ఉద్యమం చేపడితే అప్పుడు ఇంకా ఎక్కువమంది పిల్లలు తయారైయ్యే అవకాశం ఉంటుందని నేననుకుంటున్ననండీ. 
పరవస్తు : తప్పకుండా మీ సలహా ను పాటీస్తాను.. మరొక విషయమేమిటంటే.. మనకు భాషమీద అభిమానం ఉన్నప్పటికీ మనం చేయలేనటూవంటి నిరాసక్తత, ఏర్పడుతుంది.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయమ్మా!.. 
అ.తె : మీ గురించి , చదివి, నాగశాయి సూరి ద్వారా మీగురించి తెలుసుకున్ననాటి నూండి మా పిల్లలకు కూడా ప్రతిరోజూ రాత్రిళ్ళు ఒక పద్యం నేర్పేయత్నం చేసి పదిహేను పద్యాలవరకూ నేర్పానండీ! భాషనొక్కటీ అందిస్తే సంస్కృతి పిల్లలకి అందించినట్లే అన్నది నా ఉద్దేశ్యమండీ!.. 
పరవస్తు : మీకు మరో విషయం చెప్పాలి.. బ్రిటీష్ వారి కాలంలో కూడా మినిస్టర్ ఆఫ్ ????? లార్డ్ మెకాలె అనే అతను.. మనం ఆత్మాభిమానం తక్కువెంతంటే.. తల్లి భాష మీద అభిమానం లేదంటే వాడికి ఆత్మాభిమానం ల్కేదు.. ఎవ్వరేమనుకున్నా ఫర్వాలేదు. మెకాలె మినిట్స్ లో " మా వేషభాషలకు అలవాటుపడిన భారతీయుడు మాకు శాస్వతంగా బానిసలుగా పడిఉంటారని " స్పష్టంగా చెప్పేశారు. అయినా మనకి సిగ్గులేదు. జాతీయం ఒకటుందమ్మా.. 'కుంబకోణం' అనివాడూతుంటాము.. పత్రికల్లో వస్తుందమ్మ.! మోసం అనే అర్ధం లో వాడబడుతున్న జాతీయం ఇది. అసలు మోసానికీ కుంబకోణం కి సంబంధం ఏంటీ? న్యాయంగా అయితే నిఘంటువులో కూడా అర్ధం దొరకదు. కుంబకోణం అనే జాతీయం ఎలా పుట్టిందంటే..! కుంబకోణం అనేది తమిళనాడులో ఒక ప్రదేశం. ఈ ఆంగ్లేయులు మొట్టమొదట ఆంగ్లాన్ని మనమీద రుద్దటానికి మొదలెట్టిన ప్రదేశం కుంబకోణం. అప్పుడు మిగిలిన వారు ఏమనుకుండేవారంటే ఇది ఆంగ్లేయులు వారి అవసరాలకు ఆంగ్ల భాషాబోధన మొదలు పెట్టరనే భావనలో ఇదో పెద్ద మోసం అనుకునేవారక్కడ. కాబట్టీ కుంబకోణం అంతే మోసం అనే అర్ధంలో స్థిరపడిపోయిందన్నమాట.! ఇలాగ మనకు ఎన్నో ఉన్నాయి .. భారతంలోనే మంచి పద్యం ఉందమ్మ!.. నన్నయ్య గారి పద్యం.' పట్టు సిద్ధాంతాన్ని' చెప్పే పద్యం.. పరాయి రాష్ట్రం వెళ్ళినప్పుడు మన మాతృ భాష మాట్లాడే వారు కనపడితే రోమాంచితమై తనువు పులకిస్తుంటుంది.. దీనినే పట్టు సిద్ధాంతమటారు.. దీనిపై భారతంలో నన్నయ్య గారు చక్కటి పద్యం లో చెబుతారు. శకుంతల దుష్యంతుని దగ్గరకు వస్తుది.. బిడ్డతో కలిసి రావడం, ఆ బిడ్డ దుష్యంతునిబిడ్డ అనడం..అతనేమో తన కు ఏ సంబంధం లేదనండం జరుగుతుంది..బిడ్డ తనవాడని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పటి లాగా డి.ఎన్.ఏ పరీక్షలు లేవు. అందులో ఆయన మహారాజు.. ఆయన చెప్పిందే సిద్దాంతం.. ఒక్క సారి ఈ బిడ్డను కౌగిలించుకుని చూడవయ్యా నీకే తెలుస్తుండంటారు ఆమె. శకుంతల. దీనినే పట్టు సిద్దాంతం అంటారు.. దీనిపై నన్నయ్య చెప్పిన పద్యం విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాధ! పుత్ర గా త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం ద్రపరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ బుత్రగా త్ర పరిష్వంగ మునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే ! ­­ ఒక్కసారి ఈ బిడ్డను ఎత్తుకొని చూడవయా అని ధైర్యంగా చెబుతుంది.. కాబట్టీ ఏదైత్ ఏతెలుగు పద్యం ఉందో ఆ పద్యాన్ని అంతగా ఆశక్తిగా పిల్లలు నేర్చుకుంటున్నారంటే ఈ పట్టు సిద్దాంతమేమో ననేది నాభావన. సందేహం లేదు ఇంకో పది సంవత్సరాలలో మన తెలుగు భాష తన పూర్వ వైభవాన్ని సంపూర్ణంగా ప్రపంచపటం మీద చిత్రించుకుంటుంది,సందేహం లేదు. అ.తె : చాలాసంతోషమండీ ఇంత చక్కగా మీ విలువైన సమయాన్ని కేటాయించి అమూల్యమైన మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ! నమస్కారం ఈ ముఖాముఖిని , చక్కటి పద్యాల్ని, రెండు భాగాలుగా క్రింది లింక్ లో వినవచ్చు...

No comments:

Post a Comment

Pages