గోరంత దీపం - అచ్చంగా తెలుగు

గోరంత దీపం

Share This
గోరంత దీపం 
 - రాజవరం ఉష 

నమస్కారం ! చీకటిని నిందిస్తూ కూర్చునేకంటే, గోరంత దీపాన్ని వెలిగిస్తే, అది కొండంత వెలుగుల్ని పంచుతుందని అంటారు. నేను తెలుగు భాష కోసం చేసే చిన్ని ప్రయత్నం గురించి మీకు వివరంగా చెప్తాను... మా అటవీ శాఖ కార్యాలయం లో పదవీ విరమణ పొందిన అధికారుల కొరకు చాలా కాలం నుండి ప్రతి నెల వన ప్రేమి అనే సంచిక ( వారి చేతనే) నిర్వహింప బడుతున్నది అది నేను మొట్ట మొదట చదివినప్పుడు అందులోని ప్రతి శీర్షిక కూడా ఆంగ్లములో ఉండేది నేను తెలుగు భాష పై మక్కువ తో కవితలు, కధలు వ్రాసినా ఆ పత్రిక లో అచ్చయ్యే అవకాశం లేదు అప్పుడు నేను మా అధికారులతో మాట్లాడి తెలుగు లో మన అటవీ పరిరక్షణ కు పనికొచ్చే శీర్షికలు, కవితలు కూడా అచ్చు వేయమని తద్వారా ఎందఱో తెలుగు వారికి సులభతరముగా అర్ధమయ్యే సందేశాలు ఉండొచ్చునని చెప్పాను అలాగే పంపండి అచ్చు వేద్దాము అన్నారు అలా నేను మొక్కలకు, జంతువులకు, అటవీ సంరక్షణ లో తమ అసువులు బాసిన అమర వీరులకు సంబంధించి, నా కవితలు, వివిధ వ్యాసాలూ అన్నీ కేవలం తెలుగు లోనే వ్రాసి పంపటం, వారు సహృదయత తో వాటిని అచ్చు వేయటం జరుగుతూ ఉంది ఇది నాకు చాల ఆనందకరమైన విషయము అందుకని నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను, ఈ విధంగా నేను తెలుగు సాహిత్యమునకు చిన్న సేవ చేస్తున్నట్లు నాలో నాకే ఎంతో ఉత్సాహం కలుగుతున్నది. మీకు కూడా అనిపిస్తే చాల సంతోషం .. ఆ వన ప్రేమి లో అచ్చయిన కవితను ఒక దాన్ని మీకు పంపుతున్నాను. వనప్రేమి జనవరి 2015 సంచిక ... @@@@ - చెట్టు - @@@@ -- ఉషా వినోద్ రాజవరం జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువ ఎంతటిదో .. అర్ధ రాత్రైనా కంటి మీద కునుకు రానప్పుడు తెలుస్తుంది నిద్ర లోని మాధుర్యం ఏమిటో ధరలు ఆకాశాన్నంటి నప్పుడు తెలుస్తుంది , కూరలు, పళ్ళ విలువ ఎంతనో ... వ్రాసి చూస్తేనే తెలుస్తుంది ఒక కవిత వ్రాయాలంటే పడే తపన ఎంతటిదో.. మరి చిమ్మ చీకటి లోనే తెలుస్తుంది సూర్యుని వెలుగు రేఖల విలువ ఎంతటిదో .. సూర్య కిరణాలు కూడా విద్యుత్ కాంతులై వెలగాలంటే మనిషి సాంకేతికం గా ఎదగక తప్పదు .. భవిష్యత్తు లో కరువు రాకుండా నివారణ చర్యలు ఎంత ముఖ్యమో .. అలాగే మరి ఎండల్లో .. మధ్యాహ్నపు వేళ రహదారిపై నడిచినప్పుడే తెలుస్తుంది చల్లని నీడనిచ్చే చెట్టు విలువ తమ ఫ్లాట్లో అలారం మోత తో నిద్ర లేచే వాడికే తెలుస్తుంది పక్షుల కువ కువల విలువ.... చేతిలో చిల్లి గవ్వ లేక పోయినా , నీవు ఎప్పుడో నాటిన మొక్క ఉంది కదా ! నేడు చెట్టై.. నీ ఆకలి బాధ చూసి, తన కొమ్మ నుంచి పండును రాల్చి నిన్ను కన్న తల్లి లా కాపాడుతుంది .. నీడనిచ్చి తన చల్లని ఒడిలో సేద తీరుస్తుంది కదూ ! అందుకే ఇక ఆలస్యం చేయకుండా .. నీ పుట్టిన రోజునే కాదు నీ స్నేహితుల పుట్టిన రోజు కి కూడా మొక్క నాటే ప్రయత్నం చేస్తే .. అదే నీ భావి తరాల వారికి నీవిచ్చే విలువైన కానుక !! ఏమంటావు మరి?

No comments:

Post a Comment

Pages