"అనుభవం"

  - ప్రతాప వెంకట సుబ్బారాయుడు


జీవితాన్ని కాచి వడపోశారని

తల పండిందని

అనుభవసారానికి కొలమానంగా

ఉపమానాలు చెబుతాం.

 

నిజానికి

జీవితంలో ఎన్నో ఆటుపోట్లనుభవించి

ఎదురుదెబ్బలు తిని

ప్రతి మనిషి రాటుదేలుతాడు.

 

అవి ప్రతివాళ్ళకీ

ఒకేవిధంగా వుండడానికి,

బళ్ళో చెప్పే నిత్యపాఠాలు కాదు,

పరీక్షలూ వాటి ననుసరించి రావు.

 

ఎవరి అనుభవం వారిది...

అది మరొకరికి మార్గదర్శకమవుతుందేమో కాని,

ఖచ్చితంగా సోపానమయితే కాదు.

 

లక్ష్య సాధనకి

కేవలం అనుభవం మాత్రమే సరిపోదు.

జిజ్ఞాస, నిపుణత, సమయస్ఫూర్తి, తెలివి లాంటివెన్నో

నిత్యనూతన సంక్లిష్ట సమస్యలనుండి

బయటపడేస్తాయి

అనుభవమే అన్ని సమస్యలకీ పరిష్కారమనుకోవడం

భ్రమే!

 

                                    

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top