ఆశలు - అచ్చంగా తెలుగు

ఆశలు

Share This

ఆశలు

- సమ్మెట ఉమాదేవి 


‘‘ఆరు నెల్లనుంచి అడుగుతున్నం చెప్పులు గావాల్నని ..ఎప్పుడు జూసినా రేపు మాపంటరు గని కొననే కొనరు. మీ తీరుగా దునియాల ఎవరుండరు.. బడిల టీచర్లయితే ఏందిరా గిట్ల చెప్పులేకుండ తిరుగుతరు అని మస్తు అడుగుతుంటరు.. మంగీ లాల్‌ ఇల్లెగిరి పోయెట్లుగా అరుస్తున్నాడు.
‘‘వాళ్ళు అట్లనే అడుగుతరుతియ్యి మనకు ఎల్లద్దా..’’
‘‘అవు ఎల్లాల..పొయ్యి మీదకు పొయ్యి కిందకే గాదు నాయన సారాకుకల్లుకు కూడా గూడా ఎల్లాలె గదా
‘‘అరె మంగీ లాల్‌ ఊరిెకే ఒర్రకుండ్రి మీ అయ్యచ్చిండంటే ఈపులు ఇమానం మోత మోసిస్తడు ఎరికేనారా..’’
‘‘ఏందుకు ఇమానమోత మోగాలే.. మీరు బోయి కొనక్కరలేదంట ఆల్లే ఫిరిగా ఇస్తమంటున్నరు..మీదేం బాయే
‘‘అరు గిది బాగుందిరో... ఫిరి అంటవు మల్ల  ఇరవయి రూపాలుకావాలంటవు.. నకరాలగున్నదా ఏందిరా..
‘‘ఏందమ్మా నిజం జెప్తున్న అమెరికోల్లు ఆళ్ళ పిల్లలు దాసుకన్న పైసలతో గీ బూడ్సలు బంపుతరంట మనసంటి లేనోల్ల పిల్లలకు పంపతరంట..’’
‘‘అబ్బా అన్నా ఆల్ల అమ్మా నాయాలు గంత ఘనం పైసలు ఇస్తరన్నమాట..’’
‘‘అవు అందరు మన తీరుంటరా..’’
‘‘అవు మరి పైసలున్న మారాజులు తిన్నంత తిని ఇదిలించినంత ఇదిలిస్తరు..’’
‘‘గది గాదు అమ్మ . ఆళ్ళు అమెరిక నుంచి షిప్పుల బంపుతరంట. చెప్పులని దుప్పట్లని చలి అంగిలని మనకు సుత బంపుతరట. ఆళ్ళు చెప్పులకు బూట్సలకు పైసల్‌ అడుగుతల్లేరు. ఖాళి అవి ఆడినుండి మన కాడికి దెచ్చినందుకు అయిన ఖర్చులకు ఒగ ఇరవై రూాపాలు దేవాల్నట మా సార్లు జెప్పిండ్రు..
‘‘ఒరె మీరు ముగ్గరు మనిషికి ఇరవయి రూపాలంటే.. మీ ముగ్గురి మీన అరవయి రూపాలు అయితున్నయి. ఇరవయి ఇంకో ఇరవయి ఏసుకుంటే కొత్తగూడెంల జబరదస్తు చెప్పులస్తయి గదారా..’’
‘‘అబ్బా గట్లనా మరయితే ఇన్నిరోజులెందుకు తేలేదో..గా జబర్తదస్తు చెప్పులు..’’ వెక్కిరిచాడు వెంకటి..
‘‘ఇదంత గాదు గాని తెలారె కల్ల అరవయి రూపాలు ఇయ్యాల .అందరు పైసల్‌ దెస్తున్నరు... మేమొక్కల్లం దేకుంటే ఇజ్జత్‌ బోతది..ఇగ్గో ఇప్పుడు మీరు పైసల్‌ ఇయ్యకుంటే నేనయితే జల్మలబడి గుమ్మం దొక్క.వెంకటి..
‘‘నేను అన్నతీరు గాదు అమ్మా అనుకన్నదిచేస్త.. మీరుగిన తెల్లరకల్ల నాకుఅన్నకు, చెల్లెకు కలిపి అరవయి రూపాలు ఇయ్యకుంటే బడి గుమ్మం కాదు ఈ ఇంటి గుమ్మమే తొక్క. యాదికుంచుకో.. మీ ఆయినచ్చనంక ఎట్ల చెప్పుకుంటవో నీ ఇష్టం మల్ల..’’
‘‘ఏంది రా బల్సిందా..? చదవుకున బడికి బోతున్నరా నాయినను ..మీ ఆయనా అంటానకి బతున్నరా బక్కంలిరగ దీస్త ఏమనుకున్నరో.. చెప్పులు గావాలన్నని అన్నరు గంత వరకేెే ఎక్కువ తక్కువ మాట్టాడితే మక్కలిరగ దీస్త.. ’’
‘‘తిట్డుడు గాదు ముందు చెప్పులకు పైసలిచ్చి మాట్లడుండ్రి.. ఫిరిగా ఇస్తనంటేకూడా మస్లు శానుజేస్తాండ్రు..’’
************************
‘‘ఏంది నాయినా రాత్రిడుగుతే పొద్దుగాలా అంటున్నవు. పొదున్న అడుగుదమంటే చేనుకు ఎల్లి పోతున్నవు. ఎట్ల్టన్నజేసి..నాకు దొరకకుంట దిరుగుతున్నవు. ఇగ్గో నాగిట్ట చేనుకు దారి తల్వదనుకున్నవా ఎట్ల.. ? సేట్యా చేనులో పొలి కేకలు పెడుతున్నాడు.
‘‘గదేమిలేదురా.. రంజాను పండగప్పుడో సమ్మక్క జాతరల్లప్పుడో.. తీరల్ల తీర్ల చెప్పులమ్ముతరు అప్పుడు అక్కడ కొందమనుకున్నా!’’’
‘‘ఆ ఆ గా రంజాను పండుగొచ్చేది మల్ల పదినెల్లకు. ఇగ సమ్మక్క జాతర ఈ ఏడాది లేనే లేదు. నీ మాయలు నాకు దెలులసుగాని, నాకు, చెల్లెకు బడిలబిచ్చే బూట్లకు నలపై నూపాయాలియ్యాల్సిందే.. నాయినా లేకుంటే నేను అన్నమే దిన..’’
‘‘ఓరే పిచ్చోడా..చెప్పులు గిప్పులు సదువుకున్నోళ్ళకు సిటిల దిరిగేటోల్లకు. మనలకెందకురా.? పొద్దుకగాల్ల లేస్తే మట్టి దిరిగేల్ల్ల్లోం ..మన్నుల బతతికెలోల్లం..’’
‘‘గట్లనకు నాయినా ఎండకాలం ఒక్కపూట బల్లప్పుడు మస్తు కాల్లు గాల్తున్నయి రెండేళ్ళనుండి చెప్పులు గోంటా కొంటా అంలవు కొనవు..’’
‘‘అరె సేట్యా..! మా చిన్నప్పుడు ఏం చేసేటోల్లమెరుకేనా..! ఏండ కాలమొచ్చిందటే మా నాయినమ్మ పెండ, మట్టి కలిపి అంచె నిండా బెట్టేది. దేని కోసరమన్నా గిట్టనే ఎండల బయటకు ఎల్లాల్నాంటే అరికాల్లకు ఆ పెండ మట్టి పట్టిచ్చెటోల్లం. కొంచెం ఆరినంక నడిచేటోల్లం. ఇగ కాల్లు కాలేదుండదు. ఏముండదు’’
‘‘అవు మల్ల గీ వుపాయం దెల్వక కంపెనీలోల్లు చెప్పులు తయారుజేస్తున్నరు గిట్ల పెండ బూసుకునుడు దెల్వక జనం చెప్పులు కొనుక్కోని ఏసుకుంటున్నరు మల్ల..’’  నాగమ్మ  కిస్కున నవ్వింది.
‘‘ ఏందే పోరగాల్లు మస్తు జోకులేసిండ్రని నవ్వుతాన్నవా.’’ కస్సున్నాడు
ఏ అయ్యాఎందకట్లా నా మీద కోపం చేస్తవు ఇవి ఎనకటి రోజులలు గావు ఎనకటి పిల్లలు గారు ఫిరిగా ఇస్తమన్నంక గూడా కొనకుంటే ఎట్ల వాళ్ళు బాధ పడారా.
అరె మల్ల గట్లంటవు ..ఫిరిగా అంటవు మల్ల పైలంటవు ..
అయ్యో నాయినా నీకు ఎట్ల జెప్తే జమజయితది. అమెరికొల్లు ప్రిగానే బూట్లు బంపిండ్రు. వాటిని మనూరు దెస్తానికి అయిన ఖర్చు కింద మనిషికి ఇరవై దెమ్మనరు. పెద్దబడికి లారిలనో మరెండ్లనో దెస్తరట. రేపు పది పన్నెండు బడులనుండి ప్లిలందరూ పెద్ద బడికి వస్తున్నరు గీ బూట్లకోసమే. నువ్వు ఏమన్నజెయ్యి నాకు చెల్లెకు ఇరవయి ఇరివయి   ఇయ్యాల్నిందే..
************************
పెద్ద బడి కళకళ లాడి పోతున్నది చుట్ట పక్కల ప్లిలంతా వచ్చి చేరారు. పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. కొత్త చెప్పులు వస్తాయన్న ఆనందపు చిరుత దరహాసాలు ముఖాన విచ్చుకున్నాయి..
మురళీధర్‌ సార్‌ జరుగుతున్న తంతా ఆశ్చర్యంగా గమనించసాగాడు. ఇంచు మించు ప్రతీ రోజూ ప్రతీ ప్రార్థనా సమావేశంలో  నిలబడ్డ పిల్లలందరివి ఎప్పుడూ బోసి పాదాలే. డబ్బులు లేవంటూ కొందరూ, అలవాటు లేదంటూ కొందరూ. గీడున్న బడకి కూడా చెప్పులు గావాల్నా అంటూ కొందరు చెప్పులు వేసుకురారు. కొందరి ఆడ పిల్లలు ఎనిమిదినుండి ఇరవై తులాల పట్ట గొలుసులు పెట్టుకుంటారు కాని చెప్పులు వేసుకోరు. కొందరబ్బాయిల తల్లిదండ్రులకుపది ఎకరలాల పత్తి చేన్లున్న వాళ్ళున్నారు. కాని వాళ్ళు కూడామాకు చెప్పులెందుకు సార్‌ ’’ అంటారు. మరి అబ్బా ఇంత ఎండలో చెప్పులు లేకుండా అసలు ఎలా నడుస్తున్నారు రా..అని టీచర్లంరూ ఆశ్చర్చపోతుంటారు.. అదే అడిగినప్పుడు
‘‘పీర్ల పండగప్పుడు మా వోళ్ళునిప్పుల్లో కూడా నడుస్తరు గదా సార్‌ గిదో లెక్కనా...’’ నవ్వుతారు పిల్ల్లలు.
‘‘అట్లా గాదు టీచర్‌ ఈడ అడెగేస్తమా.. ఎమ్మట్నే ఆడో అడుగెయ్యాలా మీ తీరు మెల్లగ నడుస్తే కాళ్ళు కాల్తయి.. కాలు కాలే టాల్లకే కాలెత్తి ఇంకో అడుగెయ్యాల..’’ ఆశ్చర్యంగా నోరు వెల్లబెట్టకుని వింటున్న మేడమ్స్‌కి చెపారు పిల్లలు.
మొత్తానికి పిల్లలందరికీ ఈవాల చెప్పులు వస్తున్నయి.. అనుకుని సంతోషపడ్డారు టీచర్లు..
చుట్టపక్కల వున్న తండాల బడులనుండీ మూడు నాలుగు మైళ్ళ నుండి పిల్లలు నడుస్తూ వచ్చి చేరుతున్నారు. కొందరు తమ పిల్లలను బండ్ల మీద దింపి వెళ్తున్నారు. ఒక తండాలో ఓ పెద్ద మనిషి తన ట్రాక్టరులో పిల్లలను దింపి వెళ్ళాడు. బూట్లు మోపుకు వచ్చే ఆ లారీనో మరేదో వాహనమో ఎక్కడ మధ్యాహ్నం వరకూ దాని జాడే లేదు. ఇదిగిదిగో వచ్చేస్తున్నది ఫలానా ఊర్లో వున్నది .. అదిగదిగో వస్తున్నది.. ’’ పక్క ఊర్లోనే వున్నది అని ఫోన్లు మాత్రం వస్తున్నాయి.
************************
‘‘ఏం చేద్దాం రాందాసు సార్‌ పిల్లలు మనిషికి ఇరవై రూపాయలు తెచ్చెసారు ..?’’
‘‘అదేనాకు అర్దం కావడం లేదు. పవన్‌సార్‌ ఆ వచ్చే వాళ్ళు ఇంత లోపలికి వున్న మన బడికి కూడా వస్తే బాగుండు కానిఎన్ని బల్లకని తిరుగుతారు ఇంత చిన్న పిల్లలను నాలుగు మైల్లు ఎలా నడిపించాలి..?’’
 ‘‘ఆటోలో తీసుకెల్లాలంటే.. ఏనబై మంది పిల్లలను కనీసం ఐదారు ట్రిప్పుల్లో తీసుకెల్లాలి. కనీసం ఐదొంందలు అడుగుతారు. మళ్ళీ ఆ డబ్బులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు  ఇమ్మంటే ఎక్కడనుండి తెస్తారు.’’
‘‘ఏం చేద్దాం పట్టండి మరి ఆ ఖర్చులేవో మనమే భరించి పిల్లలను  తీసుకెల్దాం కొత్త బూట్లు వస్తున్న సంతోషంలో వాల్లు అన్నం కూడా సరిగ్గా తినడంలేదు. ఇప్పుడు ఆటోలకు డబ్బులు లేవు కదరా అంంటే చిన్న బుచ్చుకుంటారు.’’
‘‘సరే నేను వెల్లి ఓ రెండు ఆటోలు పిలుచుకుని వస్తాను..’’
************************
‘‘పెద్ద బడిల ఏదో జాతరైతున్నట్లు ఆస్తాండ్రు బడి పోరలు..’’ ఓ పెద్దవ్వ అడిగింది..
‘‘ఇయ్యాల ఆళ్ళకు ఆమెరికోల్లు బంపినచెప్పులు ఇస్తున్నరటా..’’
‘‘ఎహే చెప్పులు కాదు బూట్లు బంచుతున్నరటా..’’
‘‘గదేనా గిప్పుడొక పెద్దబండి బోయింది.. అమెరికోని కడుపు సల్లగ ..పొల్లగాళ్ళకు బూడ్సులిన్నారు.. ’’
‘‘అవ్వా గీ మాకెలనునువ్వే మేపునేను బడిదిక్కు బోతునా..’’
‘‘ఓ హథీరాం వుండు మేము గూడొస్తున్నం..’’ ఒక్కో బడి పిల్లల పాదాలు చూడడం
************************
ఒక్కో బడి పిల్లల పాదాలు చూడడం గబా గబా  ఆ పాదాల సైజును బట్టీ ఇరవైరూరాపాలు తీసుకని బూట్ల పంపకం వేగంగా జరిగిపోతున్నది. రెండు గంటలు బూట్లు పంపిణి జరుగుతూనేవున్నది. ఒక్కో పిల్లాడు తన కాళ్ళకుబూట్టు వేసుకోవడం చూసుకుని మురిసిపోవడం. కాస్త దూరం పడడం సిగ్గు పడిపోవడం. అందరి చేతులకు బూట్లు అంది అవివాళ్ళు కాళ్ళకు ధరించగానే ఆనందం వెళ్ళివెరిసింది వాళ్ళందరి కళ్ళలో. అది చూస్తానికి వచ్చిన తల్లిదండ్రులుల్లో. ఇళ్ళకు వెళ్ళాడానికి చాలాపొద్దు పోయింది. అయినా తండా బడుల నుండి నానా పాట్ల పడుతూ తమ విధ్యార్థులను తీసుకు వచ్చిన ఉపాధ్యాయలందరి  ముఖాలో ఓ తృప్తి సంతోషం..
మర్నాడు పార్థ్రనా సమావేశంలో నల్లని కాన్వాసు బూట్లను ధరించిన  పాదాలతో చూడ ముచ్చటగా కనపడ్డారు . ఇక నుండీ ఇలాగే అందరూ తప్పకుండా వేసుకురండిరా అని టీచర్లు సలహా ఇచ్చారు. ఓ అలాగే అన్నారు పిల్లలు ..
తరగతి గదుల ముందు వరుసగా  కనపడ్డ బూట్లుచూసి ఈ రకంగా నైనా తమ బడిపిల్లలకు పాద రక్షలు అమరినందుకు సంతోషపడ్డారు టీచర్లు .
ఇంట్రవెల్లో సగం బూట్లు కనపడలేదు. ‘‘ఏమయినాయిరా.. అంటే కొందరు గబా గబా ఇళ్ళలో దాచుకుని వచ్చారని చెప్పారు. కొందరు పుస్తకాల బ్యాగుల్లో దాచుకొచ్చారు. కొందరు ఎప్పట్లా బూట్లు బయటే పెట్టి ఆడుకున్నారు తిరిగారు కాని కాళ్ళకు మాత్రం వేసుకోవడం లేదు. మర్నాడు సగం మంది పిల్లలు కూడా వేసుకురాలేదు. మూడో నాడు బూట్లు వేసుకన్న వారి సంఖ్య ఇంకా పడిపోయింది. నాలుగో రోజునుండి ఒకరో ఇద్దరో తప్ప పిల్లలు దాదాపు బూట్ల సంగతే మరిపోయారు.
మురళీధర్‌ సార్‌ ఆటల సమయంలో ‘‘ అసలెందుకురా మీరంతా బూట్లు వేసుకురావడం లేదు’’ అనునయంగా అడిగారు అందరినీ పిలిచి అడిగారు.
‘‘సార్‌ పొద్దుగాళ్ళ లేస్తె మట్టిల దిరిగే మా కాళ్ళ ఏళ్ళేమో.. భూమిలోకి ఎడల్పుగ వేర్లను దింపుకున్నట్టుంటయి. ఆళ్ళేమో ఏళ్ళను ఒక దగ్గర ముడేసినట్టున్న కాన్వాస్‌ బూట్లిచ్చిండ్రు. అవ్వేసుకోంగనే మా కాళ్ళు ఏళ్ళు అండ్ల వుండలేక బయటకు రాలేక చిరిగి పోతున్నయి. ఇప్పటికే సగం మంది బూట్ల కొసలు చిరగినయి. అవి చిరిగినయి అని జెప్తే మా అమ్మా నాయిన మా తోని లల్లి బెట్టి కొనిపించిండ్రు గదారా ఇప్పుడు ఏమాయేనో చూడుండ్రి అని అంటరేమోనని మా  భయం..’’.సేట్యా అన్నాడు
‘‘అందుకే అప్పుడప్పుడు ఏసుకుంటంలెమ్మని అవద్దం జెప్పి అటక మీద దాసుకున్నం. గిట్ల ఏసుకోంగనే అట్ల చిరిగే పత్‌లా  బూట్లిచ్చి, మా ఆశలను మసి జేసిండ్రేంది సార్‌ అని భూమికి గటు దిక్కున్నోళ్ళను అడగలేక.. గా తూరుపేడారా తండ్రీ అని ఎతికి ఒగదణ్ణం బెడుతున్నం సార్‌ గంతే ’’ మంగీ లాల్‌ తలవంచుకున్నాడు.
************************

No comments:

Post a Comment

Pages