వాచికాభినయకర్త ‘గరిమెళ్ళ’ - అచ్చంగా తెలుగు

వాచికాభినయకర్త ‘గరిమెళ్ళ’

Share This
వాచికాభినయకర్త ‘గరిమెళ్ళ’
-      బ్ని౦.

ఈ ఫీచర్ లో –నాట్యరంగ ప్రముఖుల్ని పరిచయం చేద్దామని గడచిన నెల ‘ స్వాతీ సోమనాద్ ‘గారిని తలచుకున్నాం. ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికం ..ఈ నాలుగు అభినయ రంగస్థల కళకి నాలుగు ప్రాణాలు. మరి ‘పంచ ప్రాణాల్లో’ ఐదో ప్రాణం ? మనమేగా !! అంటే ప్రేక్షకులేగా – ఇప్పుడు నేనూ ..ఒక స్వరకర్తా ..వాచికాభినయాన్ని గురించి పోట్లాడుకోవాలనుకున్నాం ! అదే ..మాట్లాడుకోవాలి అంటే ..మాట నేను రాస్తే ..ఆయన స్వరపరచి గానం చేస్తే ..వాచికాభినయ కర్త ఎవరు ? ఈ విషయంలో మా ఇద్దరికీ పోట్లాట వస్తే ...శాస్త్ర ప్రమాణానికి పోతే ..’శబ్దం బ్రహ్మ’ ! శబ్దం అంటే ...మృదంగం ,వైలెన్, వీణ , ఇవీ శబ్దాలే . గాత్రం , నట్టువాంగం ,  ఇవీ ‘ధ్వని ‘ప్రవాహికలే . గానానికై పుట్టిన సాహిత్యం కూడా అంతే ! సాహిత్యానికి ధ్వని ఆలంబన కాకపోతే శ్రావ్యం కాదు. ఉత్తి అక్షరాలే. వాచికాభినయానికి కవి వేసే అక్షరమాలే గీతం ! ఇది కొంచెం ఎక్కువ ఉపోద్ఘాతం అనకండి. నిజం చెప్పాలంటే కాయితం మీద పడుకున్న అక్షరాలకి రెక్కలు కట్టి వాటిని మాటలుగా ,పాటలుగా  ఎగరేసేది,ఎగిరించేది,నలుగురికి ఎరిగించేది గాయకుడే . స్వరకర్తే . ఒక శబ్దరహిత ప్రదర్శన చూసామనుకోండి ,నాట్యజ్ఞులకి ముద్రలవల్ల ,ఎక్స్ ప్రెషన్స్ ( సాత్వికాభినయం) వల్ల ఆ పాత్ర చెప్పదలచుకున్నది ఖచ్చితంగా అర్ధమవుతుంది. కొంతమందికి తెలిసీ తెలియనట్టు తెలుస్తుంది. అదే వాచికాభినయ౦ వుంటే నర్తకీమణి తన ఆహార్యాన్ని మార్చవలసిన అవసరంలేకుండానే నేపధ్య గానాభినయం వల్ల అంటే ..’వాచికాభినయ౦’ వల్ల  ఆమె భావ ప్రకటనలేమిటో తెలుసుకుంటారు .అందుకే కవి తన భావం బతికించిన సంగీత దర్శకుడికి అభివాదం చేస్తుంటాడు . నీ మాటలే నా నోట పాటను చేయిన్చాయని ఆ స్వరకర్త కవికి అభినందనల౦దిస్తాదు .ఈ ఇద్దరినీ బతికించేది అభినయకారులే అనేది... అందరూ భావించే సత్యం. నా నృత్య రూపకాలకి స్వరకల్పన చేసిన సంగీత ప్రముఖుల్ని మొదట్లోనే తెలిపాను. వారిలో మాన్య మిత్రుడు గరిమెళ్ళ గోపాలకృష్ణ ఒకరు .వీరు బాల్యం నుంచి తెలియడం వలన, నేను అతనికి నువ్వు అనే చనువు ఇచ్చినందువలన ఇద్దరం పరస్పరం తిట్టుకునే స్నేహం ఉన్నందు వలనతనకి డాన్స్ ఫీల్డ్ లో పాతికేళ్ళకి పైగా అనుభవం పండి న౦దువలన ..అతన్ని ఈ ‘శింజారవా’నికి పరిచయం చేయడానికి .. అర్హుడని భావిస్తూ ..గర్వంగా నా ‘ఎనిమీ ఫ్రెండ్ ‘ని మీకు పరిచయం చేస్తా. ఆయన పేరు గరిమెళ్ళ గోపాల.తన ప౦థొమ్మిదో ఏట ( ఇప్పటికీ నాకన్నా దాదాపు పదేళ్ళు లేటుగా పుట్టిన కుర్రాడు ), 30 గంటలు నిర్విరామ వాయులీన (వైలెన్ )కచేరీ చేస్తాననీ, ఇన్విటేషన్ కార్డు డిజైన్ చేయమని నా దగ్గర కొచ్చాడు. అతనెలా పరిచయం అంటే ..వాళ్ళ అమ్మగారు శ్రీమతి గరిమెళ్ళ వరలక్ష్మి గారి దగ్గర నేను కొంతకాలం వీణ ,గాత్రం నేర్చుకోవడానికి వెళ్లాను. పిళ్ళారి గీతాలతో ‘బిజీ’అయి మానేసాను – ( బిజీ కచేరీలకు కాదండోయ్-నా ఒరిజినల్ ..వృత్తి వల్ల ), ఈ అబాయి 30 గంటలు వాయిన్చాగాలడా ..అని భయపడుతూనే ,తనకీ , నాకూ తెలిసిన మిత్రుల్ని పోగేసి భుజస్కంధాలపై ఎత్తేసుకుని ( అతన్ని కాదు కార్యక్రమాన్ని ) దేశ విదేశాల్లో పేపర్లలో ... రికార్డు స్థాయిలో నిలబడేలా ...ఎలుగెత్తి  చాటడంలో నావంతు కృషి చేస్తాను. అన్ఫార్చునేట్ల్త్లీ ..మాకు ‘గిన్నిస్’ గాళ్ళని పిలవాలన్న జ్ఞానం అప్పట్లో లేదు. (ఇప్పటికీ లేదు ఎందుకంటే నాలా 200 పై చిలుకు నృత్య రూపకాలు రాసిన వాళ్ళు ప్రపంచంలోనే లేరట. ఆ గిన్నెలో ఈ ‘కూరా’ పల్లేదు. పర్లేదు ). ఆ తరువాత గోపాలకృష్ణ గిన్నిస్ ని తన్నేసే  “ ద్వారం వెంకటస్వామినాయుడు “ అవార్డుగా ‘మద్రాసు తెలుగు అకాడమి ‘పురస్కారాన్ని..డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి చేతులమీదుగా అందుకుని ,అక్కడ మహనీయుల సమక్షంలో వైలెన్ వాద్య కచ్చేరి చేసి ..ఔరా !’ఇతడే దీనికి తగినవాడు ‘రా!అనిపించుకున్నాడు . నాలుగు సంవత్సరాలు ‘భరతనాట్యా’ధ్యయనం చేస్తూ నేర్చుకున్న త్రికాల జతి సంప్రదాయాన్ని తన సంగీతానికి కలిపి ‘కూచిపూడి’వైపు చూపు సారించి ,ఎందఱో ప్రవర్ధమాననర్తకీ నర్తకులకు ,ప్రసిద్ధులకు గాత్ర, నట్టువాంగ , వాయులీన , వేణు సహకారంతో ప్రదర్శనలకి వెళ్లి ,ప్రసిద్ధుడై ,తన తోటివారి అభివృద్ధికి ప్రేరకుడై ,కారకుడై ,అభినందనీయుడై ,సంగీత బాటసారియై , పాటసారియై , దేశ విదేశాలలో స్వర సంచారం చేసాడు.డా. శోభానాయుడు గారికి గాత్ర ,వాయులీన సహకారంతో మొదటిసారి విదేశీయానం చేసి ,ఆ తరువాత తన సోదరుడు ,అన్నమాచార్య ప్రాజెక్టు ,తిరుమల తిరుపతి దేవస్థాన గాయకుడు ‘గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్’ గారి విదేశీ సంగీత విభావరుల్లో వాద్యసహాకారం గా తన ప్రతిభ ని వేనోళ్ళ పొగిడి౦న్చుకున్నాడు. ఈ ఫీచర్ కి కావలసిన కాసిన్ని ప్రశ్నలు అతని ముందు పెడితే,కూసింత జవాబిచ్చాడు. అందుకే ఇది ప్రశ్న-జవాబు ల ధోరణిలో సాగటం లేదు .ఈపాటికి గమనించేవుంటారు . ఐనా జావాబులు ‘కొటేషన్’లో  ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కూచిపూడి నాట్యానుబంధం చెప్తూ ... “ కూచిపూడి నాట్యంపట్ల అవగాహన కలగటానికి ‘వేదాంతం రాధేశ్యాం ‘మాస్టారి ప్రభావం మొదట్లో నా మీద చాలా బలంగానే ఉండేది. వారు చూపించే ‘సాత్వికాభినయ ‘ ప్రక్రియని , స౦చారీ భావాల్లో మరింతగా ప్రతిఫలింప జేయడానికి  నా సంగీత జ్ఞానం చాలా తోడ్పడిందని నేనూ భావిస్తాను. ముఖ్యంగా భావానికి తగిన రాగాన్ని సమకూర్చుకున్నాక ..ఆరాగంలో గమకంతోసంచారం చేయటం ,పదం ఎత్తుగడలో ‘ఆదిపర్వం’ మార్చటం, అభినయ కర్తకి మరింత అవకాశాన్ని కలిగించడం ,సంచారీ భావాల్లో నేను రూపొందిస్తూ అనుసరిస్తూన్న మార్గాలు. ఇవి నాకు మంచి పేరునేతెచ్చాయి. కాస్తో కూస్తో నాట్యం తెలుసున్న సంగీత దర్శకుడు నాట్యకర్తకి ప్రత్యక్ష గానం చేస్తున్నప్పుడు ( అంటే  సి.డి ల్లో కాదు ) పరస్పరావగాహన వల్ల అప్పటికప్పుడు ,కొత్త గతులు , సంగతులు వేసినా రాణిస్తాయి. .. అని నేను ప్రగాఢ౦ గా విశ్వసించాను. ఆ ప్రయోగం నిత్యనూతనంగా ఉభాయులకి ప్రశంసలందిస్తోంది. స్వాతిసోమనాద్ , కృష్ణ కుమారి ,’ అర్ధనారీశ్వరం’ వెంకట్ గార్లకి నేను అనేక నృత్య రూపకాలు స్వరరచన చేసాను. అదృష్టవశాత్తు వాటిలో కొన్ని జాతులను కూర్చే అవకాశం కూడా నాకు లభించింది .” అంటూ గోపాల్ (గోపాలకృష్ణ లెండి –నేను అలా పిలుస్తాను ) డీప్ గా ,డెప్త్ తో మాట్లాడాడు . నేను రచించిన బ్యాలేల గురించి చెబుతూ...నాతో కూర్చుని స్వర రచన చేయటాన్ని ఇష్టపడతానని నన్ను మెచ్చుకున్నాడు , స్వాతి సోమనాద్ గారికి , కృష్ణ భారతి గారికి నేను రాసిన చాలా నృత్యరూపకాలకి తనే స్వరకర్త . అన్నిటికన్నా నేనాశ్చర్యపోయిన విషయం ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం చేసిన  నృత్యరూపకాల తాలూకు ట్యూన్స్ , లిరిక్స్ తో పాటు యథాతథం గా నేటికీ అతనికి గుర్తుండటం, ఆపాట పాడి వినిపించడం . నిజానికి నేనే రాశానా ..అన్న అనుమానం లో పడిన ఎన్నో గీతాలని అతను పాడి జ్ఞాపక చేయడం నాకు విస్మయంకాదా?! ఇటీవల తను కంపోజ్ చేసిన పదకొండు నిముషాల  థిల్లానకి  నేను ప్రేరకుడనే కాదు ..నాలుగు లైన్ల రచయితని కూడా ( థిల్లానకి లిరిక్ ఎక్కువ అక్ఖర లేదు కదా!).దీనికి నిర్మాత మా అన్నయ్య బి.యస్.శర్మ అనుకోండి –ఇపుడు ఆ థి ల్లానాని దేశ విదేశాల్లో అనేకమంది నాట్యకారులు వినియోగిస్తున్నారు.ఇంకా చాలా సాధించాలి .చిన్నప్పటినుండీ గొప్పోడని పేరొచ్చేయడం వల్ల ,ఆ పేరు దాచుకుని బతికేస్తూ౦డటం వల్ల ఆయన సినీ నేపధ్య గాయని ‘ ఎస్.జానకి ‘ అక్కయ్య కుమారుడనీ , చాలామందికి చాటుకోడు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్  తమ్ముణ్ణినీ చెప్పుకోడు . రావలసినంత పేరు ఇంకారాలేదని మనలాంటి వాళ్ళం అనుకుంటాం కానీ ...ఎన్నో మత ,మతేతర ఆడియో సి.డి.లకి స్వరకర్తగా తన ప్రతిభను చాటుకుంటున్నాడు . అన్నమయ్య కీర్తనలంటే పులకించిపోయే ఇతను ౧౦౮ అన్నమయ్య కీర్తనలకి ,దాదాపు 20 మంది (తనతో సహా )సంగీత కారులు స్వర నిర్దేశం చేసిన కీర్తనలను  ‘నోటేషన్’ రూపం లో ‘అన్నమయ్య పదామృత  వాహిని’ అనే గ్రంధాన్ని ప్రచురిచాడు. గోపాల్ ‘శింజారావా’నికి  నట్టువాంగం లాంటి వాడు. అక్షరాలా వాచికాభినయకారుడు. ఎందుక్కాడు ? మృదంగ ,గాత్ర ,విన్యాసంతో పాటు ‘వాగ్గేయకారు’లైన  బ్రహ్మశ్రీ ‘గరిమెళ్ళ నరసింహారావు ‘గారి జీన్సే కదా!- వచ్చేనెలలో మరో కళామూర్తితో...............

No comments:

Post a Comment

Pages