రెక్కల గుఱ్ఱం...
- సుజాత తిమ్మన.

నీలాకాశంలో ..వెండి అంచుల పరదాలు
 అలా సాగిపోతూ ఉంటె...
అనుకునే దాన్ని...పసితనంలో....
ఆ పరదాలతో దోబుచులాటలు ఆడుకోవాలని....
చదువుకునే రోజుల్లో...
విజ్ఞానం నేర్పిన పాఠాలలొ ..
ఆ కలలు నిజం చేసుకోవచ్చని తెలుసుకొని...
ఆ గమ్యం వైపే...అడుగులు వేస్తున్నాను..
మేఘాలను దాటి....అంతరిక్షంలోకి పయనించాలనే..
అంతర్లీనమయిన కోరిక...ఎదలో సుడులు తిరుగుతుంటే..
కల్పనా చావ్లాని ...ఆదర్శంగా తీసుకొని ....ఆమె స్పూర్తి తో...
ఎగురుతాను ఎప్పటి కైనా...రెక్కల గుఱ్ఱం (రాకెట్) ఎక్కి..
నేడు ఆశగా గగనాన్ని చూస్తున్నా...
ఒకనాడు...ఉంటాను నేనూ..శ్వాస ఉన్న మెరిసే తారగా..
నింగిలో మెరుస్తూ....!!!
+++++++++++++++++++++++++++

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top