శిలాశాసనాలు...!! - అచ్చంగా తెలుగు

శిలాశాసనాలు...!!

Share This
శిలాశాసనాలు...!!
 - సుజాత తిమ్మన

 శ్వాసల కలయిక ఏకమైన వేళ
అనుకున్నాము మనం  " నాతిచరామి " అని

రెండు ఎదల కలయికలో
ఏర్పడిన హరివిల్లె...
మన జీవితానికి పొదరిల్లు...

యుగాలయినా.... క్షణాలుగా...
కాలాన్ని జయించుదాం...
అని ఎన్నెన్ని అనుకున్నాము...మనం...

విధి ఆడుకునే ఆట లో...మనమే..పావులమా...
ఒరుసు కున్న మేఘాలు ..చేసిన ప్రళయ గర్జనలో..
కురిసిన వర్షం ..తుఫానై..భీభత్సం సృష్టించి..
తన ఉక్కు పిడికిట నిను బందించిందే...
ఉక్కిరి బిక్కిరవుతూ...నీవు చూసిన ఆఖరి చూపులలో..
కనిపించే భావాలు ..నన్ను ప్రశ్నిస్తున్నాయి...
తాజ్ మహల్ వద్దు కానీ....
మనసు మందిరం ఎప్పటికీ నాదే కదూ....! అని..

నిన్ను గెలుచుకున్న నేను..

నీవు లేకుండా..ఎలా ఉండగలను..చెలీ!
మబ్బులు కమ్మేసినా జాబిల్లి
వెన్నెల నివ్వడం మానుతుందా...
నీవు కనుల ముందు కనిపించకున్నా...
నా అణువుఅణువు ..నీవే...నా సమస్థం నీదే...
నీకు తెలియనిదా...ప్రియభాంధవి..!

రెండక్షరాల ప్రేమ ..శాసించే జీవితాలను...
యుగాల చరితం తిరగేసినా...
దురాలయిన ప్రేమలు...అమరమైన శిలాశాశనాలు...!!
***
 .

No comments:

Post a Comment

Pages