రుద్రదండం-7(జానపద నవల) - అచ్చంగా తెలుగు

రుద్రదండం-7(జానపద నవల)

Share This
 రుద్రదండం-7(జానపద నవల)
-      ఫణి రాజ కార్తీక్

(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతూ,ఆమె పరధ్యానానికి కోపించిన శివుడు శక్తులను ఆపాదించిన రుద్రదండం త్రిశూలంతో విరిచేస్తాడు. ముక్కలైన రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మాంత్రికుడైన మార్తాండ కపాలుడు. ఆ దండంలోని ముక్కలు అనేక చోట్ల జంబూ ద్వీపంలో పడతాయి.   అవి దక్కించుకునివాటితో తిరిగి రుద్రదండం తయారు చేసినవాడు దైవసమానుడు అవుతాడు.తన కధను డింభకుడికి చెప్తూ ఉంటాడు మాంత్రికుడు.బీదవాడైన మాంత్రికుడి రాజ్యంలో యువరాణికి అంతుబట్టని జబ్బు చేస్తుంది. అరణ్యంలోని ముని అందించిన శక్తులతో యువరాణి జబ్బును నయం చేస్తాడు మార్తాండ కపాలుడు. అయినా రాజు అర్ధరాజ్యం, యువరాణతో వివాహం చెయ్యక అతడిని బయటకు వెళ్ళగోడతాడు.వికల మనస్సుతో ఒక గుహలోకి వెళ్ళిన అతడికి, శుద్రదేవి విగ్రహం ముందు, ఒక మొండెం, దూరంగా దాని తల కనిపిస్తుంది. ఆ కధంతావిన్న డింభకుడు కపాలుడి గుహ గురించి అడుగి తెలుసుకుంటాడు. రుద్రదండం సాధించేందుకు ఒక కారణ జన్ముడు పుట్టబోతున్నాడని చెప్తుంది శుద్ర దేవి  …)   సూర్యోదయం .. కాశీ పట్టణం .. కాశీ లోని ఒక శివాలయం. గంగ ఒడ్డు . చల్లగా ,మెల్లగా గంగా హారతి .. పుష్కరాల సమయం .. పోటెత్తిన శివ ,కేశవ భక్తులు .. “ హర హర మహాదేవ కాశీ విశ్వనాధా,రుద్రదేవా , మహేశ్వరా,శంభో, కపర్ది,రజనీషా,ఫణిరాజా,కార్తిక,శంకరా...”అని జయ ధ్వనాలు.. కాశీ విశ్వనాధుని జ్యోతిర్లింగాలయం .. జ్యోతిర్లింగ స్పర్శ దర్శనం కోసం  భక్తులు వరుసగా నిలబడి ఉన్నారు సన్నిది లోకి ,వారు రాజులైన కాని ,భగవంతుని ముందు అందరు సమానమే అని భావించే వారు .అందుకే అందరి లాగా జన సమూహం లో నిలబడ్డారు.ప్రజలందరూ తమలో నిల్చున్న మహారాజు ,రాణి గారికి జయద్వానాలు చేయసాగారు .”మహా రాజు కేశవ పేనుడికి ,మహారాణి  చంద్ర ప్రభకి  జయహో “ అని .కేశవ సేనుడు –“ప్రజలారా! మీ అభిమానానికి ధన్యుడిని,కాశీ లాంటి పరమ పవిత్రమైన నగరం ,నా సువిశాల సామ్రాజ్యం లో ఉన్న ,కాశీకి ప్రత్యేకత కలదు.అది ,శివుడుకి తప్ప ఎవరికీ ఆదీనం లో ఉండదు .కావున ,7క్రోసుల ఈ నగరం ,ఈ అన్ని లోకాలను సృష్టించి ,పాలించి ,పోషించి ,లయంచే ఆ పరమేశ్వరుడి దే . అందుకే ఆలయం లో  , ఆయన్నితప్ప ఎవరిని సృతించారాదు.”అని పలికి రాణి వైపు చూసాడు .భటులు కూడా సామాన్య భక్తుల వలే నిల్చోన్నారు .రాణి మనసులో ఆందోళన ఉంది. ఇలా పరమేశ్వరుడిని ప్రార్ధించి౦ది-“పరమేశ్వరా నేను నిండు చూలాలను,11నెలలైన నీకు నా మీద దయ రాలేదా ,ఇంకను నాకు కాన్పు అయ్యే భాగ్యం లేదా .ఈ పరిణామం ఏమిటయ్యా, నా బిడ్డ నా సొత్తు కాదు ,రాజ్యం మొత్తానికి వారసుడు ,ఎంతో కాలం పిల్లలు లేని మాకు నీ వ్రతం ఆచరించిన పిమ్మట నేను గర్భం ధరించాను ,నా మీద కనికరం చూపు “ అని రాజు ,రాణి ప్రార్ధించారు .అలా ముందుకు దర్శనార్ధం వెళుతున్న భక్తులు ,”కాశీపతి ,గంగాధరా,పార్వతి నాదా,జ్యోతి స్వరూప,అని తీవ్ర తన్మయత్వం తో అరవ సాగారు. కొంత మంది విస్వనాధుని జ్యోతిర్లి౦ గాన్ని దర్శించి పరవశించి ,కన్నీటి తో సివలింగముని సరిగ్గా చూడలేకపోయారు .వారు తమ జన్మ జన్మ పాపాలను ,క్షణం లో విభూది ని  చేసే శంకరుని భక్తి తో మ్రొక్కసాగారు.అలా కొంతమంది వారికి తోచిన విధంగా కీర్తనలు చేశారు.కొంత మంది ఋషులు ఆలయం లో ఉంది ఇలా అన్నారు “జ్ఞానులు  బ్రహ్మమన్నా,భక్తులు  భగవంతుడు అన్నా ,యోగులు పరమాత్మ అన్నా,పామరులు లింగామన్నా ,జనులు దైవమన్నా,ఏ రూపైనా,ఏ పేరైనా,ఏ కాలమైనా,మీ కళ్ళ ముందు ఉన్న “ ఆ జ్యోతిర్లింగ స్వరూపుడిని .శివ కేశవ బేదము లేదు .అంతే ఆ శివ లింగమే .” అని తత్వాన్ని విసదీకరించారు.ఎవరి తన్మయత్వం వారిది ,ఎవరి భక్తి వారిది ,ఎవరి భావన  వారిది ,ఎవరి ఆ లోచన ప్రకారం ఆ కాశీ విశ్వనాధుని దర్సనం చేసుకోసాగారు .రాజు రాణి సైతం “పరమేశా,నిన్నే శరణం”అని కీర్తన ఆలపించారు .సరిగ్గా కాశీనాధుని  గర్భగుడి ముందుకు వచ్చారు.రాజదంపతులు  భక్తి తో తన్మయత్వం తమ కళ్ళ ముందు ఉన్న శివలింగమును చూస్తూ సర్వ దర్శనం కోసం లోపలి పోసాగారు. కాశీ విశ్వనాధుని ఆలయం లోని జ్యోతిర్లింగం లోకి అడుగు పెట్టబోతూ ,రాణి ప్రభ కాలు జారి తూలి వెళ్లి జ్యోతిర్లింగం పైన పడింది .దానితో ఆమె గర్భం సరిగ్గా విశ్వనాధుని లింగం మీద పడింది .అలా పడటం తో ,గర్భం లో కదలిక వచ్చి ,ఆమె కి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి .దర్శనం కోసం ఉన్న భక్తులందరూ ఈ హటాత్పరిణామానికి విస్తుపోయారు .కాని , మహారాజు మాత్రం తమ ప్రార్ధనను శివుడు వెంటనే ఆలకి౦ చినందుకు సంతోషించాడు.”ఇంత కాలం ప్రసవం కాలేదు అనే కదా  నా బాధా,ఇప్పుడు తీర్చావు తండ్రి.”అని తనలో తాను ఆనందించాడు .ఈ లోపల మహా రాణిని ,పుర మహిళలు పక్కకి తీసుకొని వచ్చారు .వారిని తీసుకొని కాశీ విశ్వనాధుని ఆలయం లో౦చి బయటకు పోతుండగా బయట ఒక మహా కాయుడు గా రాక్షసుడు బయట ప్రత్యక్ష మయ్యాడు.ఆ రాక్షసుడికి మొహమంతా కను గ్రుడ్డు లాగా ఉంది .క్రింద అంతా మాములుగా ఉండి,తల మాత్రం కను గ్రుడ్డు లాగా ఉంది.వాడ్ని చూసి అందరు భీతిల్లారు.జనులందరూ ఆ రాక్షసుడిని చూసి భీతి చెందారు.అందరు పారిపోయారు .రాణి ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్ది ,బయట ఆ రాక్షసుడు ఎదురుచూడ సాగాడు. ఆ రాక్షసుడు ఆలయం లోకి  అడుగు పెట్టబోయే  ముందు అతనికి మంటలు కనపడ్డాయి .అయినా సరే ,పాదం మోపగానే విద్యుత్ ప్రవాహం ఒంటికి తగిలి అరవసాగాడు.ఈ సంగటన చూసిన భక్తులు ఆ రాక్షసుడు ఆలయం లోకి రాడులే అని తలచి,రాణి ,కాశీ విశ్వనాధుని మందిరం లోనే పురుడు పోయసాగాడు.రాణి ప్రభాదేవి,ఈ సంగటన చోసీ భితిల్లి ,భారం మొత్తం విస్వనాదుని మీద మ్రోసె భాద్యత అప్పగించి తను సృహ తప్పింది.రాజు ,భటులు ,ప్రజలు ఈ సంగటన చూసి నివ్వెరపోయారు.భటులు బైటకు వెళ్లి, ఆ రాక్షసుడి తో పోరాడసాగారు,వారిని నిలువరించి ,చంపాడు ఆ రాక్షసుడు.అలా కొంతమంది భటులను పొట్టన పెట్టుకున్నాడు రాక్షసుడు.వారు విసిరిన బల్లాలు,ఆయుధాలు వాడిని ఏమి చేయలేకపోయాయి.ఇంక ,రాజే వాడిని ఎదిరిద్దామని బయలు దేరగా,ప్రజలు,మహారాణి పరిస్థితి వివరించి వద్దని వారించారు.రాజు గారు ,మహారాణి పరిస్థితి గూర్చే కాకుండా  ఆ రాక్షసుడిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. మునుపు ఎన్నడు ఎరుగని ఈ దృశ్యం అందరిని స్థంబింపచేసింది .విశ్వనాధుని ఆలయం బయట ,రాక్షసుడు ఉండటం ఏమిటి అని అందరు ఆర్చ్యర్య పడ్డారు.పరిస్థితి చేజారింది రాణి కి కాన్పు అయ్యే సమయం ఆసన్నమైనది. బయట రాక్షసుడు పెట్రేగి పోతున్నాడు .కొంతమంది ఋషులు ,యోగులు ఇది అంతా చూస్తున్నారు.వారి వారి యోగ దృష్టి తో ఇదంతా చూస్తూ అసలు ,ఈ రాక్షసుడు కాశి లోకి ఎలా వచ్చాడు అని ఆలోచించగా “ ఎంతో నిగూడమైన శక్తివంతమైన మంత్రాలను, అద్యయనం చేస్తుండగా ఆ రాక్షసుడు,వేద పాటశాల పైనున్న మహా వృక్షం మీద కూర్చొని విన్నాడు .అవి విష్ట్నుదేవుని అనుగ్రహ మంత్రాలు కావటం చేత ,అవి మననం చేయటం చేత,ఆ రాక్షసుడికి కాశీ ప్రవేశం లభించింది.కాని స్వతహాగా దుష్ట బుద్ది కల  రాక్షసుడు కావటం వల్ల ఆలయం లొకీ అడుగుపెట్ట లేకపోయాడు. రాక్షసుడు భీకరం గా విపరీతంగా నవ్వసాగాడు.వాడి నవ్వు కి చెట్ల పై ఉన్న పక్షులు ఎగిరి పోయాయి.ప్రజలు ఆ ధ్వనికి చెవులు మూసుకున్నారు .కొంతమందికి చెవిలో నుండి రక్తం రా సాగింది .రాణి సృహ తప్పింది.ఏమి చేయాలో పాలుపోలేదు.ఋషులు ఆ రాక్షసుడి గూర్చి ఎరిగిన వారు మహారాజుకి “ వాడి మంత్రపటనం వల్ల వాడికి కాశీ ప్రవేశం లభించింది”అని చెప్పారు .కేశవ సేనుడు కి ఏమి చేయాలో పాలుపోలేదు.అప్పడు కేశవసేనుడు ఋషుల౦ దరిని మంత్ర శక్తి చేత ఎదుర్కొనే శక్తి ఎదన్నా ఉందా అని అర్దించాడు.ఇదంతా చూస్తూ కూర్చున్నాడు ఒక తపస్వి .ఆ తపస్వి రాక్షసుడు వచ్చిన దగ్గర నుండి ఆలయం లో ఒక మూల కూర్చొని శివునికై ధ్యానం చేయసాగాడు.ఆ మునులందరి దగ్గరకు ఆ  తపస్వి వచ్చి “ ఋషులారా! మీరు చెప్పింది నిజమే ,ఆ రాక్షసుడిని నిలువరించి మహారాణికి పుత్రుడికి రక్షణ కల్పించటమే మన కర్తవ్యం .”రాజుగారు” మీరు ఏమైనా చేయగలరా ,మహానుభావా” అని అడిగాడు .”ప్రజలారా! మీరందరూ పంచాక్షరి చేయండి.గట్టిగా ప్రతిద్వనించాలి.”అని అడిగాడు.దానితో అందరు ఋషులు సైతం “ ఓం నమఃశివాయః” అని జపం చేయటం మొదలెట్టారు.ఆలయం లో అందరు ,చేస్తున్న పంచాక్షరి విని రాక్షసుడు విస్తుపోయాడు. వారందరూ భయపడటం మానేసారేమి అని విస్తుపోయాడు. మళ్ళి తను రాక్షస నాదం చేసాడు.ఆ తపస్వి ఇలా చెప్పాడు.-“ రాజా! నా పేరు విష్ట్ను నంది .నేను ఒక విరాగిని.మోక్ష సాధనకై కాశీ లో ఉండి తపస్సు చేయాలనుకుంటున్నా ,నా తపస్సు వల్ల నాకు కొన్ని శక్తులు లభించాయి .వాటిని పరోపకారార్దం మాత్రమే వాడలేను.ఆ రాక్షసుడు నిజానికి వచ్చింది.పుట్టబోవు మీ పుత్రుడుని సంహరించుట కే  “,కేశవసేనుడు-“ఏమి మాట్లాడుతున్నారు,ఆర్యా”అని తెల్ల ముఖం వేసాడు..”అవును ప్రభూ!మీరు 11 నెలలైనా ప్రసవం కాలేదు అని భాదపడుతున్నారు,కాని అది విశ్వనాధుని లీల ,ఆ రాక్షసుడిని చంపగలవారు ఎవరు లేరు.,నిలువరించగలరు అంత మాత్రమే,మనందరం సాధించగలం .మీకు పుట్టబోవు యువరాజు రుద్రగ ణుడు, అతను ఒక కార్యం కై ఉద్భవించే కారణ జన్ముడు.మీ పుత్రుడు మాత్రమే అతన్ని సంహరించగలడు.అది తెలుసుకున్న ఆ రక్కసుడు బిడ్డని చంపుదామని యత్నిస్తున్నాడు.అతనికి ఉన్న శాపవశాత్తూ ఆడువారిని చంపలేడు.అందుకే తెలివిగా ,రాణి గారి ప్రసవం దాక ఆగాడు.ముందే గొడవ చేస్తే మీరు జాగ్రత్త పడతారని తెలిసి ,రాణి గారి ప్రసవం కోసం ఎదురు చూస్తున్నాడు.అందుకే రాణి గారికి నొప్పులు మొదలైన వెంటనే వాడు ప్రత్యక్షమయ్యాడు.అంతవరకు మాత్రమే నేను తెలుసుకున్నాను “ కేశవ సేనుడు –“భగవంతుడా ఏమి చేయాలి “ అని అర్ధించాడు. దాంతో విష్ట్ను నంది “రాజా! ఆ పరమేశ్వరుడు ధర్మ పక్ష పాతి ,అందుకే మీకు రాణి గారి ప్రసవం కాకుండా చూసాడు,ఇప్పుడు ప్రసవ వేదనప్పుడు ఆలయంలో ఉన్నారు .వాడు ఆలయం లోకి రాలేడు. చూశారా ఆ శివుని లీలా వినోదం “ అని సమాధానపరిచాడు. “మరి రాణి గారికి కాన్పు ఎట్లా ఆమె సృహ తప్పింది కదా?”అన్నాడు రాజు.ఆ తపస్వి వచ్చి “జ్యోతిర్లింగాన ఉన్న పుష్పములు తెచ్చాను, ఇవి సామాన్యమైనవి కాదు,ఒక భక్తుని నిజమైన భక్తికి తార్కాణం .ఆ భక్తుడు ఇచ్చిన ఈ పుష్పం ,స్వయం గా పరమేశ్వరుడు స్వీకరించాడు.”అని మళ్ళి వెనక్కి వెళ్లి,జ్యోతిర్లింగానికి అభిషేకించిన జలం లో ఆ పుష్పం ముంచి ,కాసేపు మంత్రించాడు తపస్వి.”ప్రభూ!ఈ పుష్పం రాణి గారి వద్దకు తీసుకువెళ్ళి ఆమెకు తాకించి ,చిలకరించండి, ఆ పుష్పం లో ఉన్న తీర్దం ఆమె మీద పడగానే ఆమె కు సృహ వస్తుంది .”అని అన్నాడు.”అదేదో మీరే చేయండి  మహాత్మా” అని అన్నాడు రాజు .” మీ చిత్తం” అని ఆ పుష్పాన్ని రాణి గారికి తాకించి ,అందులో జలాన్ని ఆమె మీద చిలకరించాడు. రాణి కి సృహ వచ్చింది.అక్కడున్న వారందరూ,ఆ తపస్వికి చేతులెత్తి మ్రోక్కారు.”ఏమైనది ప్రభూ! ఆ రక్కసుడి బారి నుండి మనం బైటపడ్డామా “అని రాణి అడిగింది.” తీవ్రమైన ప్రసవ వేదన ప్రారంభమైనది.ఇక ,ఆలయం లో ఉన్న అందరు మహిళల్ని పిలిచి రాణి గారికి ప్రసవం చేయమని అర్ధించారు.అదృష్టవశాత్తు మంత్రసాని ఒకామె ఆలయం లో ఉంది .ఆలయం లో స్రీలందరూ చుట్టూమూగగా రాణి గారికి ప్రసవం ఆ మంత్రసాని మొదలుపెట్టింది.రాణి గారి వేదన తీవ్రతరమైనది.బయట రాక్షసుడి గర్జనలు వినపడుతున్నాయి.ప్రజలందరూ “ ఓం నమః శివాయః “ అని ప్రార్ధన  గట్టిగా చేస్తున్నారు .రాణి గారికి ఎంతసేపు ప్రసవం కావటం లేదు .కిటుకు తెలిసిన మంత్రసాని “మహా రాజా! మీ రెందుకు బైటకి వెళ్లి ఆ రాక్షసుడి  తో తలపడుతున్నారు” అని రోదించసాగింది.ఇది విన్న మహారాణి “మహారాజా” అని కేక పెట్టి ఒక మనో ప్రకంపనకు గురియినది వెంటనే ప్రసవం అయింది. రాజ కుమారుడు ఉదయించాడు.అందరికి ఆనందానికి అవదుల్లేవు.పుత్రుడి జననం తో మహారాజు “ పరమేశ్వరా! ఈ రాజ్యానికి వారసుడిని ఇచ్చావు,ఇక వాని పోషణ,ఆలనా,పాలన,భాద్యత కూడా నీదే” అని నిట్టూర్పు ఇచ్చాడు.మంత్రసాని వచ్చి “రాజా! మీకు పుత్రుడు ఉదయించాడు,మన రాజ్యానికి వారసుడు,మాకు లభించాడు”అని ఆనందం గా చెప్పింది.”రాజు వెంటనే తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని ఆమెకి భహూకరించి ఆమెకి సోదర భావంతో “సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞుడిని అమ్మా”అని అన్నాడు .ఇదంతా గమనించిన రాక్షసుడి కి పుత్రుడు పుట్టాడని చెలరేగిపోయాడు.ఆలయం బయట ఉన్న చెట్లను పరికించి ,అవి గంగ లో పారేయసాగాడు.మహా వృక్షాలని పెకలించి ,వాటిని ముక్కలు ముక్కలుగా చేసి ఆలయం పైకి వేసాడు.కొన్ని కొమ్మలని విరిచి ఆలయం ద్వారం గుండా లోపలి పడేటట్లు గురిచూసి విసిరాడు .అది మహా రాజు కి తగలబోగా అడ్డువచ్చిన ఇద్దరికీ తగిలి మూర్చిల్లారు.రాక్షసుడి తల అంటే కనుగ్రుడ్డు మొత్తం కోపం గా ఎరుపెక్కింది.అందరు ఏమి చేయాలో పాలుపోలేకపోయారు.అందరు దారి చూపు మహాదేవ అని ప్రార్ధించారు.మహారాణి మళ్ళి సృహ తప్పింది . అందరికి రాకుమారుడి జననం వల్ల ఆనందం పొంగి’పొర్లింది.కాని ,ఆ రాక్షసుడి బారి వలన భాద కలిగింది.ఆ రాక్షసుడి దెబ్బకు కాశీ మొత్తం నిర్మానుష్యమైనది.అవి గంగ పుష్కరాలు కావటం చేత స్నానానికి వచ్చిన భక్తులు సైతం భితిల్లి  పారిపోయారు.అయితే ఆలయం లో ప్రసవం తరువాత చేయవలసిన అన్ని పనులు దొరికిన అందుబాటులో ఉన్న వాటి తో చేసారు ప్రజలు.కాని అందరికి ఒక చోద్యం ఏమిటంటే .” రాకుమారుడు ఒక ఏడుపు కూడా ఏడవలేదు.అతనికి పుట్టుకతోనే జటాజూటాలు కలవు.పుట్టిన పసికందుకు జటాజూటాలా? అని ఆచ్యర్యపడ్డారు అందరూ.అంతే కాక నుదురు మీద విభూది వలే రేఖలు గీతాలు ప్రస్పుటం గా కనిపిస్తున్నాయి .నిజం గా ఈ బాలుడు శివ వరప్రసాది? అని ఆనుకొనసాగారు. ఆనందం లో  ఉన్న రాజు గారి సైతం పుట్టిన తన కుమారుడుని  ఆలింగనం చేసుకుందామని వెళ్లి ,అక్కడి శిశువు ని చూసి నిచ్చేష్టుడైనాడు.ఆ బాలుడు ఏడవనేలేదు,పైగా జటాజూటాలు,నుదురు పైన విభూది రేఖలు ఉన్నాయి.జూటాలు,విభూది రేఖలు చూసి ,రాజుగారు ఎంతో ఆనందించిన ఉలుకు పలుకు లేని బిడ్డని చూసి,” పరమేశ్వరా! ఏమి ఈ పరీక్ష తండ్రి “ అని అర్ధించాడు.ఒక వైపు రాక్షసుడు సంహారం గూర్చి,యోచిస్తున్నారు.అంతయూ ,కర్మ అని ప్రజలు అనుకోసాగారు.రాణి గారి పరిస్థితి,ప్రజల స్థితి చూసి ,రాక్షసుడిని ఆపదలచి ,రాజుగారు ,ఆలయ ప్రవేశ ద్వారం వరకూ వచ్చి –“ రాక్షసుడా! నీకు ఏమి కావాలి ,ఆపు నీ మారణ కాండ” అని అన్నాడు .రాక్షసుడు క్రింద మాట్లాడిన రాజును చూసి “హో హో హో  రాజా !నాకు నీ బిడ్డ కావాలి అని అన్నాడు .అంతే కాక ,నీ బిడ్డను ఇస్తే ,నేను ఎవరిని ఏమి చేయను, చూస్కో రాజ్య వారసుడా,రాజ్య ప్రజలా,పుత్రుడా? “ అని వికటాట్టహాసం చేశాడు.రాజు గారు శిశువు  దగ్గరికి వచ్చి “ఈ ఒక్క బిడ్డ కన్నా ,నా రాజ్యం లో  ఉన్న ఎంతో మంది బిడ్డల్ని కాపాడటమే నా బాధ్యత”బిడ్డను తీసుకెళ్లపోయాడు.ధ్యానంలో నుండి మేల్కొన్న విష్ణునంది వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి –“ మహారాజా! ఏమిటి ఈ శిశువు ని ఏమి చేస్తున్నారు” అని అన్నాడు.మహారాజు నిరాశావాదం తో “ జీవం లేని ఈ శిశువు కోసం ,ఇన్ని జీవితాలు బలిచేయలా అని అన్నాడు .”మహారాజా!ఈ బిడ్డకి జీవం లేకపోవటం ఏమిటి ,ఇతడు కారణ జన్ముడు ,కర్మ ఫలితం తో  పుట్టే వారు ఏడుస్తారు ,సాదించుటకు పుట్టిన వారు పుట్టుక తోనే వారి భాద్యతను ఆలోచిస్తారు” అని ఆ శిశువు ని తన చేతుల్లోకి తీసుకొని బిడ్డ చెవి దగ్గర ఏవో కొన్ని నిగూడ మంత్రాలు చెప్పి ,ఆ శిశువు యొక్క నుదురు మీద ,ముక్కు మీద ,వీపు మీద ఏదో శక్తి ఆ పాదించినట్లు కొన్ని క్షణాలు పట్టాడు  విష్ణు నంది దాంతో ఆ శిశువు “ కెవ్వు కెవ్వు మన్ని ఏడ్చాడు. అందరు తన్మయత్వం తో “ఓం నమః శివాయః”అని బిగ్గరగా పటించారు.శిశువు దగ్గర విష్ణు నంది రుద్రుని మంత్రం చెప్పాడు .బిడ్డ ఏడుపు చూసి అందరు ,రాజు గారు పరమానందబరితులయ్యారు.రాజు గారు బిడ్డను ముద్దాడారు.అందరు మహా దేవుని కి జయద్వానాలు చేయసాగారు.రాక్షసుడు,మరింత పెట్రేగి తన శక్తులతో చేతుల నుండి నిప్పులు రాజేసాడు.రాజు గారు విష్ణు నంది వైపు చూసి “ఎలా “ అని అర్ధించాడు.బయపడకండి ప్రభూ! ఆ రాక్షసుడిని నిలువరించే మార్గం ఉంది “అని అనే సరికి ఏమిటది”అని రాజు గారు సైనికులు ,ఉపాయం చెప్పమని ఎంతో ఆతురుతగా అడిగే సరికి  విష్ణునంది చెప్పసాగాడు. (సశేషం...)

No comments:

Post a Comment

Pages