Wednesday, October 22, 2014

thumbnail

“ఆడపిల్ల -ఈడపిల్ల కాదేమో”

ఆడపిల్ల -ఈడపిల్ల కాదేమో
                                                                      - సిరి  లాబాల (సరిత )

“సృష్టికి”  మూలం  నీవని చెప్పి
కారుణ్య మూర్తివి నీవని  బిరుదిచ్చి
సహనాన్ని  పరీక్షిస్తారు కాబోలు ……….
“అమ్మానాన్నల”  గారాలపట్టి ఐన ఆ “చిట్టితల్లి”
  అమ్మ  చేతిగోరుముద్దలు  తింటూ
అప్యాయతానురగాలతో  పెరిగి
“అత్తింట”  అడుగు  పెట్టిన  నేరానికి
ఆడపడచుల  ఆగడాలతో
అత్తమామల  ఆరళ్ళతో
ఆయనగారి  అధికారంతో
అనుమానాల  అపహాస్యాల  అపనిందలతో
అందంగా  కట్టుకున్న
“కలలసౌధం”  కుప్పకూలి కల్లోలం  మొదలై
బార్యా భర్తల   బంధం బగ్గున  మండే
“అగ్నిగుండమే”  అవుతుంది.
కారణం …………….
 బహుశా! ఆడపిల్ల ఈడపిల్ల   కాదాని కాబోలు
కంటి పాపలా  కన్నారింట  పెరిగిన  “కారుణ్య మూర్తులు”
కన్నీటిని  దాచుకుందుకు   దిండునే  హత్తుకొని
వెక్కి  వెక్కి  ఏడ్చిన  సంఘటనలు ఎదుర్కొనేది “పడతులేగా” ?
కడుపు  పండేందుకు  కారణం  తను  కాదని  తెలిసి
“గోడ్రాలివి”  నీవని  నిందలేసి  వదిలేసినా
నోరు  మెదపలేనిది   “లలనామణులేగా”
“తాళి  కట్టిన వాడు”  తప్ప  “తాగి”  వచ్చి
తనువంతా  హూనం  చేసినా
తన  కర్మ  అని  సరి  పెట్టుకునేది   “తరుణీమణులేగా”
ఇంటిల్లిపాదికి  సపర్యలు చేస్తూ
ఇంటెడు చాకిరీ చేసినా  చాలక
ఉద్యోగాలు  చేసి  అలసి  సొలసి
ఇంటికి  వచ్చి  కాసిన్ని  టీ  నీళ్ళకోసం
నిస్సత్తువుగా  నిస్సహాయంగా ఎదురు  చూసేది కూడా    “స్త్రీ మూర్తేగా”
ఉద్యోగం  చేయమని  ప్రోత్సహించేది
కాసులకోసమే  కానీ
తనకు  స్వేచ్ఛనిచ్చి  కాదని
తెలుసుకోలేనిది   “పిచ్చిమాతల్లులేగా”
వరకట్నపు  వేదింపులతో   విసిగి  వేసరి
పసుపు  తాడు  వేసుకున్న  నేరానికి
ఉరి తాడుకి  వేలాడేది   “పడతులేగా”
కొసరి  కొసరి  అడిగిన  కానుకలను  ఇవ్వలేని
కన్నతండ్రి  నిస్సహాయతకు  బదులుగా
కన్నీళ్ళతో “అమ్మానాన్నల” గుండెమంటలు ఆర్పలేక
“కిరోసిన్  మంటలకు”  ఆహుతైన  “అబలలు”  ఎందరో?

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information