రాజ్యాంగ ఉపోద్ఘాతము (preamble of our constitution) - అచ్చంగా తెలుగు

రాజ్యాంగ ఉపోద్ఘాతము (preamble of our constitution)

Share This

రాజ్యాంగ ఉపోద్ఘాతము (preamble of our constitution)

- చెరుకు రామమోహనరావు

ఆపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి  గరీయసి      (వాల్మీకి రామాయణము)

  రాములవారు లకను గూర్చి ప్రశంసిస్తున్న లక్ష్మణునితో ఈ విధంగా అంటున్నాడు:" కనకమయమైన ఈ లంక నా మనసును ఆకట్టుకోలేదు. నాకు నా అయోధ్య చాలు. మాత మాతృభూమి ఎన్నన్నా లేక ఎన్నున్నా స్వర్గాముకన్నా మిన్న."   ఇది ఆది కవియైన వాల్మీకి ఆదికావ్యమైన రామాయణములో రామునినోట వినిపించిన శ్లోకము.' ఇంత గొప్ప మాట చెప్పుటకు ఎంత సంస్కారము కావలెనో అంత సంస్కారము సంపాదించుటకు సంస్కృతి ఎంత వికసించ వలసి యుండునో , సంస్కృతి అంత వికసించవలెనంటే ఎంతకాలము నుండి ప్రజల మనుగడ ఈ పుణ్యభూమిలో సాగుచున్నదో ఊహించుట విజ్ఞులకు కూడా సాధ్యము కాదేమో!   అట్టి ఈ సంస్కృతిని, సంస్కృతమును కాలదన్ని లౌకిక వాదము లేక ధర్మ నిరపేక్షత యన్న పేరుతో ఈ దేశ పౌరులను చీకటిలోనుంచి, ఎంత వెలుగు రాబోతూ వుందో చూడండి అని చెప్పుట ఆత్మా వంచనకాదా!   ఇక అసలు విషయానికి వస్తాము.   ఈ రచనకు మూలము ప్రో|| చక్రవర్తి గారి, ఈ విషయము పై వ్రాసిన యాంగ్ల పుస్తకము దాని తేలుగు సేత సుబ్బు నందవరిక్ గారిది.   జాతీయ ఘోషణాపత్రము(manifesto) అంటే ఒక లక్ష్యము దిశగా స్వపరిపాలనాను గూర్చిన ఒక వ్యూహాత్మకమైన కార్యాచరణ ప్రణాళిక భాసిస్తుంది.ఇటువంటి ఒక క్రియాశీల రచనలో సామాన్యముగా ఈ క్రింద పొందు పరచిన అంశాలు ప్రధానముగా సమన్వయ పూర్వకముగా కనిపించుతాయి.ఈ అంశాలు ఆయా రాజ్యాంగ కర్తలకు వారిని నియమించేవారలకు ఉండవలెను.అట్లు లేకుంటే అది మన రాజ్యాంగమేనేమో!   1.ఒక సనాతన సంస్కృతి యొక్క పరిణామ క్రమమును గూర్చి దాని లక్ష్యాన్ని గూర్చిన అవగాహన   2.దాని మత ధార్మిక, ఆర్ధిక చరిత్ర ఈ భారత దేశము సనాతనమని ఈ ధర్మమూ సనాతనమని మనకు తెలుసు. సామాన్యులమైన మనకే తెలిసినపుడు మాన్యులైన రాజ్యాంగ రచయితలకు తెలియదా లేక వారిని వ్రాయమని నిర్దేశించిన నాటి మహా నాయకులకు తెలియదా.ఒక క్రియాశీలమైన ఇటువంటి రచనలో 1) సంస్కృతి పరిణామమును గూర్చి కానీ 2) సాంఘీక ,3)ధార్మిక, 4)ఆర్ధిక , 5)పారమార్థిక తత్వమును గానీ వ్యక్త పరుప నవసరము లేదా!   అధిక సంఖ్యాకులను త్రోసి రాజని అల్పసంఖ్యాకుల సంక్షేమానికే అంకితమైన రాజకీయ నేత్రుత్వము ఏ జాతిని ఉద్ధరించ బూనినదో ఆత్మ పరిశీలన ఒక పర్యాయమయినా చేసుకొంటే అర్థమౌతుంది.సాధారణంగా రాజ్యాంగాలనుపరిచయముచేసే ఉపోద్ఘాతాలు తమ మూలములకు జని తమ ఔన్నత్యమును గ్రహించి అది తమ ప్రజావాహినికి ప్రపంచమునకు ఎరుకపరచుతారు.   ఇటీవల తన అభిప్రాయమును వ్యక్తీకరించిన ఒక అనుభవజ్ఞుడైన పాశ్చాత్య పండితుడు ఈ విషయ మూల రచయితతో ఈవిధముగా అన్నాడట:"ఈ హిందూదేశ రాజ్యాంగ ఉపోద్ఘాతము నాకు మూలరహితముగానూ,నిర్హృదయముగానూ తోచుచున్నది.ఇందులో చారిత్రికమైనదీ, ఆధ్యాత్మికమైనది, సాంప్రదాయికమైనది,పూజ్యమైనది,ఆరాధింప దగినది అయిన యేవిషయానికి తావు వున్నట్లు కనిపించుటలేదు.దానిలో ఎక్కడగాని గతించిన ఎన్నో యుగాల వైభవాలను గురించి సగర్వంగా కృతజ్ఞతా పూర్వకముగా ప్రస్తావించిన ఒక్క వాక్యమైనా నాకు కనబడ లేదు.నిజమైన రాజ్యాంగ కర్తలు, భర్తలు (మహా మహా నాయకులు),ఇటువంటి ఉపోద్ఘాతములలో తమ పౌరులకు ఉత్తమమైన ,దృఢమైన,ఉత్తేజకరమైన ,దేశభక్తి ప్రపూరితమైన సందేశాలను పొందుపరచి తమ ప్ర్జజావాహినిని కార్యోన్ముఖులను చేస్తారు.అంతగా చరిత్రలేని యేయితరదేశముల పీఠికలను పరిశీలించినా మన కర్తాభర్తల నిస్తేజతను గ్రహింపవచ్చును."   ఒక పుటలో నాలుగవ వంతుకు మన రాజ్యాంగ పరిచయ భూమిక (IP1950,1976) వుంటే చైనావారిది రెండు పుటలుంటుంది.(ఇది1982 లో విడుదలైనది). వారు సంయత్ సెన్, మావో,లెనిన్. మార్క్స్, మొదలయిన మార్గాదర్శకులను తలచుకొంటే మనది 'సార్వభౌమ, సోషలిస్టు, లౌకికవాద మన్న నైరూప్య సిద్ధాంతములతో మొదలవుతుంది. వారు అందులో భౌతిక, రాజకీయ, ఆధ్యాత్మిక నాగరికతల సమన్వయమును గూర్చి ప్రస్తావించినారు. మన పీఠికలో ఆధ్యాత్మికతకు తావేలేదు.అసలు శ్రీలంక పీఠిక కు 'స్వస్తి' అన్న సంస్కృత నామమును ఉపయోగించినారు. వారి పూర్వీకుల త్యాగములు,బుద్ధ ధర్మము, బుద్ధ శాసనము(article 9) మొదలగు అంశములను నొక్కి  వక్కాణించినారు . మరి మన వారసత్వము వారికన్నా ప్రాచీనమైనది కాదా. మరి ప్రపంచములోనే సంస్కృతమునకు,సంస్కృతికి మూలము మనదేశముకాదా. 'స్వస్తి ప్రజాభ్యాం..., స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః... , స్వస్తిర్మానుషేభ్యః..... ' అన్న ఈ స్వస్తి వచనాన్ని (అత్యంత శుభకరమైన వాక్కు) తృణీకరించినామే మరి మనకన్నా కృతఘ్నులను వేరేదేశములోనైనా చూడగలమా! నేపాళ దేశమునకు రాజ భాష సంస్కృతము . వారి దేశీయ నినాదము ( national slogan ) ' జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి.' ఇది ఎంత సహజముగా నున్నది. వారికి వారాంతపు శెలవు శనివారము. మనకు వారము ఆది వారము తో మొదలై శని వారము తో అంతమౌతుంది. అప్రాచ్యులవలె సోమ వారముతో మొదలై ఆదివారము తో అంతము కాదు.ఆవు వారి జాతీయ జంతువు. ఇది మనకు శిగ్గుచేటు కాదా! మన దేశ నినాదమైన 'సత్యమేవ జయతే' ఎంతవరకు సహజత్వమునకు దగ్గరగా వున్నది.కారణ మేమిటంటే ముండకోపనిషత్తులోని ఈ వాక్యము, కల్గిన శ్లోకము 'బ్రహ్మ సత్యము  జగత్తు మిథ్య' అన్న శంకరులవారి వివేక చూడామణికి ఆలంబన. ఆ ఉపనిషద్ శ్లోకము  ఈ విధముగా వున్నది.   सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥६॥ సత్యమేవ జయతే నానృతం  సత్యేన పంథా వితతో దేవయానః ఎనాక్రమన్తృఋషయో హ్యప్తకామా  యత్ర తత్ సత్యస్య పరమం నిధానం సత్యమే జయించుతుంది అనృతము కాదు.సత్యము ద్వారా దైవసన్నిధి సాధ్యము.ఇది సత్యనిధిని చేరుటకు ఋషులు అనుసరించిన మార్గము.సత్యనిధి ఆ పరమాత్ముడే కదా! అంటే మనవారు ఎంతో లౌకికతను  ప్రదర్శించి ఈ 'సత్యము' అన్న మాటనువాడి తాము అత్యంత లౌకిక వాదులమని చెప్పుకొన్నారు.   పాశ్చాత్యదేశములు ఐర్లండు మొదలైనవి  తమ భూమికలలో  క్రీస్తునకు తమ విధేయత ప్రకటించుకొన్నవి.ఈజిప్టు, గ్రీసు మొదలగు ప్రాచీన దేశాములేకాక కెనడా నార్వే, జపాను, కొరియా , ఫ్రాన్సు తమ వారసత్వాన్ని స్పృశించకుండా తమ ఉపోద్ఘాతము మొదలు పెట్టలేదు. 'భవిష్యత్తు' కు 'గతము' పెట్టుబడి అన్నది మనరాజ్యాంగ కర్తలకు అనిపించలేదేమో!   అసలు ఈ రాజ్యంగావతరణకు ముందు దేశ స్తితిగతి ఎటుల ఉండినదో ఒకసారి చూద్దాము. పరాయిదేశస్థుల పరిపాలనలో మ్రగ్గే కాలములోకూడా మన స్థూల దేశీయ ఉత్పత్తి (Gross Domestic Product) ఏవిధముగా ఉండేదో గమనించండి. 17వ శతాబ్దము వరకు తన ఆధిక్యతను నిలుపుకొన్న ఈ భూమి అటుపిమ్మట ఏవిధంగా నీరుకారి పోయిందో ఈ పట్టిక చూడండి. ఇది మన ఆర్ధికశాస్త్రవేత్తలు తాయారు చేసినదికాదు. ఎందుకంటే పెరటిచెట్టు మందుకు పనికిరాదుకదా! ఇది 2007 లో Organaisation for Economic Cooperation and Development,Paris,వారు World Economy 263-4(పుట సంఖ్య) లో ప్రచురించిన గణాంకముల నిచ్చుట జరిగినది.మిగతా ఒకటి రెండు పట్టికలు కూడా ఇందులోనివే.

దేశము                       0 క్రీ.శ.         1000 క్రీ.శ.      1500 క్రీ.శ.      1700 క్రీ. శ.     1820 క్రీ.శ.     1998 క్రీ.శ.

1. భారతదేశము          32.9              28.9              24.5              24.4               16.00           5.00

2. చైనా                       26.2              22.7              25                 22.3                32.9            11.5

3. యుఎస్ ఎ                                                         0.3                0.1                  1.8              21.9

4. ప.ఐ.మొత్తము      10.8                8.7                 17.9              22.5                23.6            20.6

(పశ్చిమ ఐరిపా)

13 వ శతాబ్దమునుండి దృఢముగా మొదలయిన ముస్లీము పాలనలో కూడా మన ఆర్ధిక వ్యవస్థ బాగానే వుండినది. వాళ్లకు రాజ్యము ధనము మతము మాత్రమె కావలసినవి.అందువల్ల ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నము చేసే ప్రయత్నము చేయలేదు.ఆంగ్లేయులు దేశములోఅడుగుపెట్టిన పిదపనే మనకు ఆర్ధిక అనర్థములన్నీ దాపురించినవి.   ఈ విషయమున శ్రీఅరవిందులవారి  సాధికార పరిశీలన మనకు మన దేశ ఔన్నత్యమును గూర్చి తెలుపుటలో ఎంతయో సహకరించుతుంది. అందులో ఈ భావము నాకు స్పురించినది.' భారత దేశము సంఘీక నిర్మాణ శీలమగు దేశము.గ్రామ సమాజములు గ్రామీణ ప్రజాతంత్రము అన్నవి సహజ సాధారణములు.గ్రామములు పంచాయతీల పాలనలో ఉండేవి.విద్య ఆర్ధిక విషయములను తానే సమర్తవంతముగా నిర్వహించుకోనగలిగేది. ఇంత నాగారికతలోకూడా ఆధ్యాత్మికతను అణగద్రొక్కలేదు.'   పై వాస్తవమును దృష్టిలో ఉంచుకొని పరిశీలించినచో మనము ఈ క్రింది విధముగా నాటి పరిస్థితులను పరిగణించ వచ్చును. ' భారత భూమి తన సిద్ధాంతాల కనుగుణంగా ఉన్నత ప్రమాణములను అనుసరించుచూ, తన ఆదర్శాలకు అనుగుణంగా సాగినంతకాలము అద్భుతమైన ఫలితాలను సాధించింది. పారమార్తికమే కాకుండా ప్రాపంచిక జీవన విధానమున కూడా మిగతా దేశాలకన్న మిన్నగానే ఈ దేశము ఉంటూ వచ్చినది.ఇంత చక్కటి నేపథ్యాన్ని కాలదన్ని కసాయి వాడిని గొర్రె నమ్మినట్లు తెల్లదొరలకు బానిసలమై మన సంస్కృతికి నల్ల ముసుగు కప్పినాము.మన పతనమునకు అదే నాంది. పరహితము పరార్థము అన్నవి మన పాలిటి పలుకలేని పెర్లయిపోయినవి.' అందుకే చిన్న దేశమైన సింగపూరు యొక్క 'స్థూల తలసరి జాతీయాదాయము'(percapita income) $54700 వుండగా మనదేశము చైనా ఇండొనీషియా కన్న అట్టడుగున $3560 తో సరిపుచ్చుకోవలసి వస్తూంది.   మరి ఈ దేశము ప్రగతి పథములో ఒడుదుడుకులు లేకుండా పయనించుటకు ఈ క్రింది వచనములు ఎంతవరకు ఉపయోగ పడునన్నది గమనించండి:   1. విద్య అంటే 'పర విద్య' యే . వృత్తివిద్యాదులన్నీ'అవిద్య'లే .ఈ రెండూ సత్వగుణ సంపన్నులైన బ్రాహ్మల చేతిలో ఉండేవి. సాత్వికత, సమ్యమనము, సమాజ శ్రేయస్సును (అందుకే వారిని పురోహితులన్నారు)  దృష్టిలో వుంచుకొని నిస్వార్తముగా ఈ సమాజమును తీర్చి దిద్దినారు.అందుకే వేల సంవత్సరాలు మన సమాజ సంస్కృతి ఆర్ధిక వ్యవస్థ కాలానికి ఎదురొడ్డి ప్రపంచములో సర్వశ్రేష్ఠ స్థితిలో నిలువగలిగినది. వారు రాజులను చేసినారు కానీ రాజులు కావాలనుకోలేదు.   2. పూర్వము విద్య ముగిసిన వెంటనే అది ఉపాధి హేతువుగా మారిపోయేది. ఉద్యోగాలకోరకై వెతులాడే అవసరము వారికుండేధి కాదు. సంతృప్తికి సమాజశ్రేయస్సుకు అవినాభావ సంబంధము కలదని వారు గ్రహించినారు.నేడు వృత్తులను విడనాడి ఉద్యోగాల పేరుతో వీదులబడి ఉరకలేత్తుతున్నాము. శూద్ర శబ్దము నిమ్నతను సూచించదు.వారే ప్రగతికి మూలాధారము. మ్రుచ్చకతికమును వ్రాసిన మహారాజు పేరు శూద్రకుడు. వేదములో 'పద్భ్యాగం శూద్రో అజాయత' అన్నారు. వారిని పాదములతో పోల్చినది వేదము. ఎవరైనా పెద్దలకు మ్రోక్కవలేనంటే పాదములకే కదా మ్రొక్కేది. దేశము అన్న పురుషుడు నడవ వలెనంటే పాదములే కదా పనికి వచ్చేది. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ.శివ,వైష్ణవ సాయుజ్యము పొందిన భక్తులలో బ్రాహ్మణేతరులే ఎక్కువ, బ్రహ్మత్వము పొందిన మహనీయులను వదిలేస్తే.అరమరికలు లేవు, విభేదాలు లేవు, ఎవరిపని వారిది.ఐక్యత వారందరి వారధి.   3. భారత దేశము మత ధార్మిక దేశము . ఎవరెంత పెకలించినా కొమ్మలను నరుకగలిగినారేగానీ వేర్లను పెకలించలేక పోయినారు.ఈ దేశమనే చెట్టుకు ఆధ్యాత్మికమే కూకటి వేర్లు. ఈ చేట్టుకుపాడు సలిపి,  అందరినీ పురుకొలిపి,  వారి మనసులను కలిపితే ఈ దేశ ఉన్నతికి ఆకాశమే హద్దు.   4. బ్రహ్మచర్యము మన సంస్కృతికి మూలము. నీతి నియమాలకు నిర్దుష్ట నిర్వచనము కలిగిన భూమి ఇది.అది అప్రాచ్యులకు లేదు.   5. మనకు కేంద్రము భగవత్ సాయుజ్యము. కావున భూగోళములో మనము చేసే ప్రతి సత్కార్యము, దేవునికి చేరువ చేస్తుంది. పాశ్చాత్యులు కేంద్రము నుండి దూరమై క్రొత్త క్రొత్త పరిధులను ఎంచుకొంటారు. మరి కేంద్రమునకు దూరమైతే దైహిక పరిణతి తప్పించి దైవిక పరిథి పెరుగదు గాక పెరుగదు   6. కాలానికి ఎదురొడ్డిన సంస్కృతిని కాలరాచి పరాయివారి పాదాలు పట్టుకోవలసిన పని మనకవసరము లేదన్నది గుర్తించ  గలిగినరోజు నుండి మన ప్రగతి నల్లేరు మీద బండే . 'ఉత్తిష్ఠ భారత' అన్న చాణక్య వచనము సర్వేసర్వడా గ్రాహ్యము.   7. పాశ్చాత్యులది ఆకర్షణ సిద్ధాంతము . మనది వికర్షణ సిద్ధాంతము.వానప్రస్తములో అన్నీ విడిచి అడవులకేగి దైవచింతనతో గడపమనికదా వేద వాక్కు.మరి ఏది సమంజసము అన్నది విజ్ఞుల వివేచనకు వదలుట మంచిది కదా.   8. సమాజ స్వరూపములో మార్పు సహజము. అది సహజమై, స్వయంసృష్టి దాయకమై వుండాలి. అనుకరణ అనర్థహేతువే కదా.   9. పాలకుల నైతిక ప్రవర్తన దేశ ప్రగతికి మూల హేతువు. భవితకు రామ సేతువు.   10. 19 వ శతాబ్దమునుండి పాశ్చాత్య అనుకరణ. అనుసరణలతో ఉక్కిరిబిక్కిరై ఉక్కపోతతో ఈ దేశము సతమతమౌతూవుంది.ప్రాణవాయువు మనవద్దనుంచుకొని పక్కవాని కార్బనికామ్ల వాయుయును (బొగ్గుపులుసు వాయువు, carbon di oxide) అడుక్కొంటున్నాము. యువత గమనించితే భవిత బాగుంటుంది. వెలుగును కలిగి కూడా కళ్ళుమూసుకొని పనిచెయ తలచే వాడిని పరమేశ్వరుడు కూడా రక్షించలేడు.   11.భారతీయ విద్యకు లక్ష్యం వ్యక్తి మనస్సును సత్యదర్శిని చేయుటయే.ఇది సాధించుటకు భారతీయ తత్వము పై ఏకాగ్రత కావలెను.   12. గుడ్డిగా విదేశీ ఆకర్షణలు అందిపుచ్చుకొనుట, అనుకరించుట , అనుసరించుట స్వేచ్ఛ అనిపించుకోదు. అసలు అనుకరణ అంటే దాస్యమే కదా! విదేశీ అనుకరణ తో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేము. ఆత్మను అందుకోగలిగితే మనసు అధీనములోనికోస్తుంది. మనసు అధీనములోవుంటే మనము సాధించలేనిది ఏదీ లేదు. పంటను వదిలి పొట్టును పట్టుకొంటే ప్రయోజనము లేదు కదా !   14. మన సంస్కృతి అర్షధర్మానికి అనుబంధం. అది గ్రహించితే అభివృద్ధిని అందుకోన్నట్లే.ప్రతి కార్యమునకు ముందు ప్రార్థన చివర శాంతి పాఠము కలిగిన ఈ సంస్కృతికి ఆది కనుగొనుట అసాధ్యము.ఈ ధర్మపథం మన ధన్య పథం. అది అయ్యిందంటే హతం మనమైపోతాము గతం.   15. ఈ ధర్మము నందు ప్రవక్తలు అసంఖ్యాకులు. ఒకే ప్రవక్తకు ఒకే మత పుస్తకమునకు కట్టుబడినది కాదు ఈ దేశము.అనాదిగానే అత్యంత అధునాతనమైన నాగరికత కలదేశము.బౌద్ధము జైనము సిఖ్ఖు మతాలు మూలముతో అక్కడక్కడ విభేదించినవి మాత్రమె. ' ఏకం సత్ విప్రాః బహుదా వదంతి' అన్న ఉపనిషద్వాక్యము ఎంత అనంతమైన అర్థాన్నిస్తుందో మనసు పెట్టి ఆరా తీయండి. చరిత్రలో మహమ్మదీయుల మరియు పాశ్చాత్యుల సామ్రాజ్య, ధన, రక్త పిపాస అనిర్వచనీయము.   ఈ సందర్భములో ఫిబ్రవరి 4, 2013 న వ్లాదిమిర్ పుతిన్  డ్యూమా(రష్యన్ పార్లమెంటు) లో అన్న ఈ నాలుగు మాటలు చదవండి . "రష్యా నివాసులను రష్యన్స్ అంటారు.ఏ మైనారిటి ,ఎక్కడ నుండి వచ్చినా, రష్యాలో వుండి తిండి తినాలంటే రష్యన్ భాష మాట్లాడ వలసినదే,రష్యన్ 'లా' ను గౌరవించవలసినదే. దానిని త్రోసిరాజని తమ 'లా' ఉండాలనుకొంటే అది వుండే దేశానికి వెళ్ళవచ్చు.రష్యాకు మైనారిటీస్ అవసరము లేదు , మైనారిటీస్ కు రష్యా కావాలి. కావున వారెంత అరచినా వారికి ప్రత్యెక ప్రతిపత్తి ఇచ్చు ప్రసక్తి లేదు.ఒక విశిష్ట దేశముగా కొనసాగుటకు అమెరికా,ఇంగ్లండు ఫ్రాన్సు,హాలెండు లలో జరిగిన ఆత్మహత్యలను మనము మననము చేసుకొనుట మంచిది. ఈ దేశ ఆచార వ్యవహారములు పరమత అల్ప సంఖ్యాకుల సంకుచిత ఆచారములతో  సమతుల్యములు కావు. ఈ శాసన సభ ఏవిధమైన శాసనములు చేయుటకైనా ముందు అల్పసంఖ్యాకులు రష్యన్స్ కాదని మదినెంచవలెను. " డ్యూమా సభ్యులు , పుతిన్ గారి ఈ మాటలకు పులకితులై లేచి నిలిచి గౌరవ పురస్సరముగా 5 నిముసములు తమ కరతాళ ధ్వనులతో ప్రశంసించినారు.   మన దౌర్భాగ్యము ఏమిటంటే ' మహనీయులైన మన అలనాటి నాయకులు ఈ ఇల పై 'Secularism' అన్న ముసుగు లో, సనాతన ధర్మావలంబులమై, అధిక సముదాయమై యుండి కూడా , అల్ప సంఖ్యాకులవలె అఘోరింపబడు చున్నాము.   యువతకు నిజముగానే దేశ భక్తి, ధర్మమూ పై శ్రద్ధ, ద్రష్టలైన మన ఋషులపై గౌరవము వుంటే తాము గమనించి ఈ వ్యవస్థను మార్చుటయేగాక  తదుపరి తరములకు కనువిప్పు కలిగించ వలసిన అవసరము ఎంతోవుంది.

ఒక అప్రాచ్యుడు(ప్రాచ్యుడు కానివాడు , occident) ఒక దేశాన్ని ఎట్లు నాశనము చేయాలన్నది ఎట్లు చెప్పినాడో అతని మాటలలోనే గమనించండి.

IF YOU WANT TO WEAKEN A NATION, CONFUSE ITS IDENTITY, DISTORT ITSHERITAGE, BELITTLE ITS ACHIEVEMENTS, HIGHLIGHT ITS FAILURES, DIVIDE ITINTO AS MANY FRAGMENTS AS POSSIBLE, TARNISH ITS ANCIENT SCRIPTURES,AND REWRITE ITS HISTORY . కావున ఇప్పటికైనా మనము, ముఖ్యముగా మన యువత కళ్ళు తెరచి మొదట మన రాజ్యాంగ ఉపోద్ఘాతము పై దృష్టి సారించితే రానురాను బంగారు భవితకు బాట వేసుకోవచ్చునేమో! తత్సత్ ||

No comments:

Post a Comment

Pages