మా బడి (గేయము)

- చెరుకు రామమోహనరావు  

అదిగోనండీ అదియే మాబడి 

చదువుల తల్లికి నిర్మించిన గుడి 

నేర్పును మాకది చక్కని నడవడి 

కాదది బడి మా తల్లి యొడి 

అమ్మా నాన్నల పెట్టక ఆరడి 

చేయక ఎప్పుడు మాటల గారడి

బడికి పోయెదము రోజూ వడివడి

నిలువమెప్పుడూ అడుగులు తడబడి

గురు వచనములకు కట్టుబడి

పాఠము విందుము చేయక సవ్వడి

పోకుండా మేమెప్పటికీ చెడి

కాచేవారలు సురలు సుడీ

(నేను వ్రాసిన ఈ గేయము బాగుంటే మీ పిల్లలకు నేర్పండి .)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top