Friday, August 22, 2014

thumbnail

ఉలి ‘ చెక్కని ‘ శిల్పం

 ఉలి ‘ చెక్కని ‘  శిల్పం

 - డా.నీరజ అమరవాది.

కల్లా కపటం తెలియని   బాల్యం ‘

నవ్వుతూ ,  తుళ్లుతూ  , ఎగురుతూ

తోటివారితో ‘ ఆటలు ‘ .

 

ఆడపిల్లవి ‘ ఆ ‘  ఇకపకలేంటి

హెచ్చుస్వరంతో ‘ బామ్మ’  హెచ్చరింపు.

‘ చింతపిక్కలు , గచ్చకాయలు ‘ ఆడుకోవచ్చుగా  !

‘ అమ్మమ్మ , తాతయ్యల ‘ బుజ్జగింపు .

 

ఆడపిల్లవి ‘ పెద్ద పెద్ద చదువులెందుకు   ?

ఉద్యోగాల పేరుతో ‘ ఊర్లు ‘  తిరగటమెందుకు  ?

అమ్మ ‘ ప్రేమపూర్వక లాలింపు ’.

 

సినిమాలు , షికార్లు అంటూ  ,

స్నేహితులతో తిరిగి ‘ పరువుతీయకు  

అన్నయ్య ‘ అధికారస్వరం  ’ .

 

“ ఏ ఈడుకు ఆ ఈడు ముచ్చటన్నట్లు  

బుద్ధిగా తలవంచుకొని

చెప్పిన వాడితో   మూడుముళ్లు  వేయించుకో

నాన్న బాధ్యతతో కూడిన ‘ హితవచనాలు ‘ .

 

ఇక్కడ నాకు నచ్చినట్లు నీ ‘ కట్టు బొట్టు ‘   ఉండాలి

కొత్తగా వచ్చిన భర్త ‘ హోదాలో  ‘   బోధన .

 

ఆడబడుచును ‘ అక్కగా  ‘ ,

మరిదిని ‘ తమ్ముడుగా  ‘ ,

“  ఏ లోటూరాకుండా చూసుకోవాలి  

అత్తమామల ‘ మనసైన మాట ’.

 

ఇంటివారితోపాటు ‘ ఇరుగు పొరుగువారి 

కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి

చుట్టుపక్కలవారి ‘ ఉచిత సలహా  ’ .

 

అమ్మా !  నీకేం  ‘ తెలియదు  

మేము చెప్పినట్టు విను

“ పాతబడిన పోకడలతో మాకు తలవంపులు తేకు 

పిల్లల ‘ అసహన ’  వచనాలు  .

 

అటు పెద్దల  బుద్ధులు ’  , ఇటు పిన్నల ‘ సుద్దులు 

అందరి అభిప్రాయాలకి  , అజమాయిషీలకి లొంగి

నా  ‘ ఇష్టాలను ’  పట్టించుకోవాలని తెలియక

ఎవరికి కావలసినవి వారికి అందిస్తూ

మరబొమ్మగా  ,  స్పందన లేని ‘ మనిషిలా  ’  మలచబడ్డాను  .

 

ఏ విభాగంలోను నాకు ఎవరూ ‘ పోటీ ‘  లేరు.

‘ అవార్డులకు   కొదువలేదు

ఉత్తమ ఇల్లాలు --  బంధువుల   కితాబు  

మా అమ్మ చాలా ‘ మంచిది ’  పిల్లల మెచ్చుకోలు

  “ శిలను  ‘ మనిషిగా  ’  మార్చిన రామజన్మ భూమిలో  

మనిషిని ‘ శిలగా  ’  మార్చగల

రామభక్తులెందరో  !

     *****


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information