వాంగీబాత్

 

పెయ్యేటి శ్రీదేవి

కావల్సిన పదార్థాలుగ్లాసు బియ్యం నీలం వంకాయలు రౌండువి - 6 ఉల్లిపాయలు - 2 జీడిపప్పు పలుకులు పల్లీలు ధనియాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు ఎండుకొబ్బరిపొడి చిన్న దాసించెక్క పసుపు, ఉప్పు, కొత్తిమీరతయారు చేసే విధానం
          ముందుగా అన్నం వండాలి.  అన్నం పళ్ళెంలో వెయ్యాలి.  మూకుట్లో నూనె వేసి నిలువుగా, పెద్దగా తరిగిన వంకాయముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు నూనెలో దోరగా వేయించి, అన్నంలో వెయ్యాలి.  అందులో పసుపు, ఉప్పు, కొత్తిమీర, వేయించిన పల్లీలు వెయ్యాలి.  పైన చెప్పిన పోపు దినుసుల్ని వేయించి, మిక్సిలో కొంచెం బరకగా వుండేలా పొడి చేసి అన్నంలో కలపాలి.  పైన కొంచెం నెయ్యి వెయ్యాలి.  అంతే, వాంగీబాత్ రెడీ.  ఇందులోకి ఉల్లి రైతా బాగుంటుంది.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top