రుద్రదండం-5(జానపద నవల)

-      ఫణి రాజ కార్తీక్

(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతూ,ఆమె పరధ్యానానికి కోపించిన శివుడు శక్తులను ఆపాదించిన రుద్రదండం త్రిశూలంతో విరిచేస్తాడు. ముక్కలైన రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మాంత్రికుడైన మార్తాండ కపాలుడు. ఆ దండంలోని ముక్కలు అనేక చోట్ల జంబూ ద్వీపంలో పడతాయి.   అవి దక్కించుకుని, వాటితో తిరిగి రుద్రదండం తయారు చేసినవాడు దైవసమానుడు అవుతాడు.తన కధను డింభకుడికి చెప్తూ ఉంటాడు మాంత్రికుడు.బీదవాడైన మాంత్రికుడి రాజ్యంలో యువరాణికి అంతుబట్టని జబ్బు చేస్తుంది. అరణ్యంలోని ముని అందించిన శక్తులతో యువరాణి జబ్బును నయం చేస్తాడు మార్తాండ కపాలుడు. అయినా రాజు అర్ధరాజ్యం, యువరాణతో వివాహం చెయ్యక అతడిని బయటకు వెళ్ళగోడతాడు.వికల మనస్సుతో ఒక గుహలోకి వెళ్ళిన అతడికి, శుద్రదేవి విగ్రహం ముందు, ఒక మొండెం, దూరంగా దాని తల కనిపిస్తుంది. ఆ కధంతావిన్న డింభకుడు కపాలుడి గుహ గురించి అడుగుతాడు. దేవతలతో , రాక్షసులతో పోరాడి, ఆ గుహను భూమిలోకి ఎలా దాచాడో చెప్తుంటాడు మాంత్రికుడు   ...)   నేను వెంటనే నా శక్తీ తో స్థావరాన్ని , ఆ భూత ప్రేతాలను జాగ్రత్తగా నిల్పాను .అలా భూమిలోకి చూట్టూ ఉన్న అరణ్యం అంతా కుంచిచుకుంటూ లోయ లాగ  ఏర్పడసాగింది.అలా నువ్వు ఇప్పుడు చూస్తున్న మన స్థావరం, లాగా ఏర్పడింది.మిగిలిన రాక్షసుల జంతు రూపాలను కూడా కాపాడాను. వారు మన స్థావరం రక్షణ భాద్యత చూస్తున్నారు .అలా భూమి లోపలికి పోతూ పోతూ ఆగింది .ముందు నేను ఎలాగో మంత్రం తో గుహలోకి ప్రవేశం ఖాయం చేశాను కదా ,అలా కొనసాగించాను”.అని కపాల మార్తాండుడు తన స్థావరం గురించి చెప్పాడు .ఇన్నాళ్ళు డింబకుడికి  తెలియని విషయాలు ,మార్తాండుడు చెప్పేసరికి ,డింభకుడు తాను ఎరిగిన మాయలు ,మంత్రాలు,అద్బుతమని కొనియాడి తనకు కొంత విద్యలు నేర్పమన్నాడు.”సమయ౦ ఆసన్న మయినప్పుడు నీకు నేర్పుతారా డింభకా” అని మార్తాండుడు ,విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు .ఎంతో కాలం గా తను శారీరకం గా మానసికం గా అలిసిపోయాడు.తన అందమైన విశ్రాంతి మందిరం  రాజశయ్యని పోలి ఉంది .నిజం గా స్రీ ని పోలిన పరుపు ,చూట్టూ తిరిగే మంచం అవసరం అయినప్పుడు ఊయల లా ఊగే మంచం కాడాలు,ఆ పరుపుని చూస్తేనే మార్తండుడికి నిద్ర వస్తుంది .నిషరసాలను ఆస్వాదించి మత్తు లో ఉన్న తూలుతున్న మార్తాండుడికి ఆట పాటలతో ఉల్లాసం గా గడపాలనిపించింది.తను వెంటనే తన మంత్రశక్తి తో ఒక కామ రూప పిశాచిని ప్రత్యక్షం చేసుకున్నాడు .ఆ పిచాచి నృత్యరీతులలో అమోగమైన ప్రతిభ కలది.”ఏమి ప్రభూ! మీకు ఏమి కావాలి .ఆట పాటలతో ఆనందింప చేయనా” అని పిచాచిని పలికినది .తూగుతున్న మార్తాండుడు”అందులకే నిన్ను పిలిచినది.”అని శృంగారబరితం గా పలికాడు.విద్యాధరదేశ రాణి అపూర్వ సౌందర్య వతి ,ఆమె రూపం లోకి మారి నర్తి౦ చనా అని పలికినది.” ఓహో నీకు రూపు మార్చే శక్తీ ఉంది కదా “ అని అయితే అయితే అని కళ్ళు మూసుకున్నాడు..మార్తాండుడు ఊహ లోకి తను మోహించిన రాణి పద్మిని దేవి గుర్తుకు వచ్చింది .తన మోముని అనేక రకాలుగా తలచుకున్నాడు . “ఇది 1000ఏళ్ల నాటి సంగతి ,రాణి పద్మిని దేవి ,తన చెక్కేళ్ళ వైపు పాలధార,పంచదార పడుతూ ఉంటాయి.తను నవ్వితే నెమళ్ళు సిగ్గుపడతాయి.తన వొంపుసొంపులు చూస్తే హంస గింగిరాలు తిరుగుతుంది.నడిచే వీణ లాగా ,వెనక్కి నుండి చూస్తే తుంబురు లాగ ఉంటుంది .ఓహో ,ఆమె సొగసు వర్ణించుటకు ఏ బాష లో వ్యాకరణం లేదు .ఛ౦ దస్సు చాలదు.నా సాధనల విషయం లో పడి ఆమె విష కాటు కి గురి అయినది అనే విషయం మరిచాను .ఆ రూపం నువ్వు తెచ్చుకోగలవా అని నవ్వాడు .ఆమెని మదిలో తలచి నన్ను స్మరించండి ప్రభూ”అని అంది కామ రూప పిశాచి. అలా చేసాడు కపాల మార్తాండుడు,వెంటనే ఆ పిశాచి యువరాణి పద్మినిలాగా మారింది.మార్తండు డి ఆనందానికి హద్దు లేదు .ఆ యువ రాణి పద్మిని రూపంలో ఉన్న పిశాచి తో నృత్యాలు తనివి తీరా చేసాడు.తనకు నచ్చిన యువరాణి పద్మిని తో సమయం గడిపినందుకు తను ఎంత గానో సంతోషించాడు.ఆ పిశాచి సైతం తను కూడా మాంత్రికుడికి దగ్గరగా ప్రవర్తిన్చాసాగి౦ ది.మత్తులో తూలుతున్న మాంత్రికుడు  ఆ పిశాచిని స్వయానా పద్మిని దేవి అని తలచి ఆడి ,పాడి ఆనందపడ్డాడు.”పద్మిని నిన్ను కన్నందుకే నీ తల్లి దండ్రులను ప్రాణాలతో విడిచి పెట్టా,మళ్ళి రాజ్యం వదిలినప్పుడు నీ తండ్రికే మూట గట్టా సింహాసనంకాని ,నీవు నయం చేసిన నన్ను స్వీకరించలేదే? ఏమి అంత నిర్లక్ష్యం ఇష్టపడు వారిని మీ ఆడువారు పట్టించుకోరు కదా ,మీకు ఈ వక్ర బుద్ది బ్రహ్మ దేవుడే పెట్టాడా? -      లేక మీకు మీరే కల్పించుకున్నారా ,సృష్టి రహస్యాన్నైనా చేదించవచ్చు గాని ఆడ వారి మనసులో ఏముంది ఎవరు కనిపెట్టగలరు.నీవు ఎందుకు దూరం అయ్యావు,చెప్పు,”అని తూగుతూ ప్రేలపించాడు మార్తాండుడు.ఇవే ఏవో అని ,నిద్ర లోకి జారాడు మంత్రిక సామ్రాట్.మార్తాండ శయన మందిరం లో ,ఆయన నిద్రకు ఉపక్రమించాగానే కాంతి పరికరాలు శిగ్రముగా ఆగిపోయాయి.గాడ నిద్ర లోకి జారాడు మార్తాండుడు. చీకటి రాజ్యం చేస్తుంది .గుహ చీకట్లో అలముకుంది.అంత నిశ్శబ్దం. - - -      సూర్యోదయం..... -      నిద్రలోంచి మేల్కొన్నాడు మార్తాండుడు.తన మీద పిశాచి పడుకోవటం చూసాడు . ఆ పిశాచి ని విసిరి అవతల వేసాడు .దాంతో ఆ పిశాచి “ ప్రభూ ! నేను నిద్రలోకి పోయి నాకు తెలియకుండానే రూపు మార్చుకున్నాను  క్షమించండి.” అని అడిగింది.మార్తాండుడు లేచి వెళ్లి శూద్ర దేవి కి ప్రణామం  చేసాడు .ఆదేవి  విగ్రహం ముందు “ ఏమి ! నా తప్పిదము,అనేక వందల ఏళ్ళుగా నిన్ను పూజించే చేతులు ఇవి ,నిన్ను ని శోభను చూచుటకు ఉన్న కళ్ళు ఇవి ,నీ వాణి వినుటకు చూచే చెవులు ఇవి ,నీకై పరితపించుటకు ఉన్న మనసు ఇది ,నీకు అంకితమైన శరీరం ఇది ,అయినను,నీ భక్తుని కోరికను తీర్చవా,అన్ని లోకాలా మీద ఆదిపత్యం కాదు నా వ్రతం,నేను సైతం జనులు మ్రొక్కె భగవంతుడు మారటం నాకు కావలిసినది .,ఆ కిటుకు చెప్పి , రుద్ర దండం సాధనకు మార్గం చెప్పావా “ అని పలికాడు. -      అలా ఇంకా కొన్ని దినములు రుద్రదండం ఆచూకి కోసం  ఎదురు చూసాడు .దొరకలేదు “ఏదైనా  సాదించుటకు మార్గం తోచుటలేదే ,ఎలా చేయవలె “అని గర్జించాడు.వెంటనే శుద్ర దేవి విగ్రహం ఎదుట ఉన్న పేటిక లో నుండి ఒక స్వరం వినిపించింది-“మార్తాండ నీవు ఎన్ని ఏళ్ళు నుంచి అడిగినను ,నేను నీకు చెప్పంది ఎందుకంటే,మార్తండా! దైవశక్తి ముందు ఏది నిలబడలేదు,నీవు దేవుడిగా మారటం అనేది ప్రశ౦సనీయం, కాని రుద్రదండం గూర్చి,నా లాంటి క్షుద్ర దేవతలకి కూడా ఏమి తెలియదు .కాని  నా భక్తుడివి కావున నీకు ఒక చిన్న ఉపాయం చెబుతున్న,ఇది మాత్రమే నేను నీకు చేయగలను ,ఇప్పుడు సమయం ఆసన్నమైనది,కావున నీకు చెప్పుటకు నా వాణిని వినిపించితిని ,నేను ఎ నాడో ఈ విషయము చెప్పవచ్చు,కాని ఇపుడు ఈ విషయం జరుగుతుంది కాబట్టి నీకు నేను ఈ ఉపాయం వివరిస్తున్నా.రుద్రదండం సాదించుటకు ఒక కారణ జన్ముడు పుడతాడు.అతడు -      పుడుతూనే తలమీద జటా జూటాలు,నుదురు మీద మూడు విభూది రేఖల లాంటి గుర్తులతో పుడతాడు.అతడిని చూడగానే నుదుటిమీద విభూది రేఖలు అతను అని రుజువు చేస్తాయి.అతను ఏంటో శక్తి మంతుడు,సాక్షాతూ రుద్ర గణం లో నుండి ఉద్భవి౦ చిన వాడు .సరిగ్గా ఈ సమయమున గుగ పుష్కరములు జరుగుతున్నాయి,ఇప్పటి నుండి 24 స౦||లు ,అనగా 2 పుష్కరములు అవతల దినమున ,నీకు అతను తారసపడతాడు.ఇక,నీ యుక్తి  కుయుక్తి ఉపయోగించు,నీ వలే ఒక దైవ శక్తి ఉన్న ఋషి రుద్రదండం గూర్చి తపమోనరిస్తున్నాడు,అతనికి భగవంతుడు ప్రత్యక్షమైతే సఫలం అయ్యేటట్లే, ఇక నీవు ఏమి చేస్తావో,ఆలోచించు” అని వాణి ఆగి పోయింది.” భళా! శుద్రమాతా ధన్యవాదములు”అంటూ జ్వాల లో నుండి వచ్చిన కాంతి తో మార్తాండుడి మొహం ఎర్ర బడింది. -      మార్తండుడి కి వెంటనే ఒక సందేహం వచ్చింది.శుద్ర దేవి నీ మళ్ళి పిలిచాడు.శుద్ర వాణి మళ్ళి వినిపించింది.’ఇంతకి ఆ యువకుడు పుట్టాడా?”అని ,అందుకు శుద్ర వాణి ఈ పుష్కరాల కాలం లో పుడతాడు ,అతను నుదురు మీద సహజం గా ఏర్పడిన విభూది రేఖల లాగా శివుని నామాలు కలిగి ఉంటాడు .అలా ఎవరు ఉండరు ,అతనొక్కడే “అంది.వెంటనే మాంత్రికుడు మరి రుద్రదండం జాడ తెలిసిన మరో దైవసంపన్నుడు ఎవరు “ జాడ కాదు మార్తాండ ,నీవలె రుద్రదండం కోసం అతను పరితపిస్తున్నాడు .నీవు క్షుద్ర విద్యని ఎంచుకున్నావు ,వారు దైవ శక్తిని ఎంచుకున్నాడు”అంతియే .ఇక ఇంతకు మించి ఏమియు చెప్పలేను “ అని వాణి ఆగింది. మార్తాండుడు తన దగ్గర ఉన్న మంత్రదండం తీసుకొని “నిన్ను వదలను లే ,రుద్రదండం సాది౦ చినను నీ విలువ నీకు ఉంది లే “ అని నవ్వాడు .డింభకా! అని పిలిచాడు .” డింభకా ఇక నా కల నేరవేరుటకు ఇక 24స౦||లే ఉన్నది .ఇన్ని స౦||లు ఆగిన వాడిని రెండు పుష్కర కాలాలు ఆగుట సమస్యా?” అని నవ్వాడు .డింభకుడు గురువు గారి ఆనందం చూసి ఎంత గానో సంతోషపడ్డాడు.”భగవంతుడు ఎన్నో వేల సంవచ్చారాలు తపస్సు చేస్తే గాని ప్రత్యక్షమవ్వడు. ఆ మూర్ఖుడు రుద్రదండం కోసం ఏమి చేసిన దేవుడు అతనికి కనపడడు.రుద్రదండం నా సొత్తు,పరమ శివుడు దానిని భూమి మీదకు వదిలి పెట్టినది నా కొరకే,ఇక ఆ పిచ్చి తపస్వి ఎన్ని సంవత్చరాలు గడిచినా అంతే ,కాని రుద్రదండం సాదించిన వారికి అనగా ,నాకు ఎదురు ఉండదు .నన్ను ఎవరు పూజించినా వారికి వెంటనే ప్రత్యక్షం అయ్యి,వరమిస్తాను .నేను ఇప్పడు ఉన్న దేవుడి  లా కాకుండా ,భోళాతనం తో నా కాబోవు భక్తులను అనుగ్రహిస్తాను.అని పరిహసించాడు.వందల ఏళ్ళు గా మార్తాండుడు తన కన్న కలకు ఈ రోజు ఆధారం దొరికింది.అని నివ్వెర పోసాగాడు.ఇది కలో ,వైష్టవ మాయో అని తనను తాను గిల్లి చూసుకున్నాడు .అక్కడ ఉన్న పిశాచాలు ,భూతాలు,ప్రేతాలు,బందించిన ఆత్మలు రుద్రదండం ఆచూకి తో ఆనందపడుతున్న మార్తాండు డుని చూసి జయ ధ్వనులు చేసాయి.అది విన్న మార్తాండుడు మీకు కూడా నా రాజ్యం లో  ,అంటే నేను భగవంతుడిని అయిన తర్వాత ,నా సేవక పదవి లబిస్తుంది .అంటే మీరు కూడా భగవాన్ మార్తాండ కి సేవలు చేసారు కాబట్టి ,నా బక్తులు మిమ్మల్ని మ్రొక్కిన ,వాళ్ళ కార్యాలు అయ్యేటట్లు అనుగ్రహిస్తాను .పదునాలుగు లోకాలను గెలుస్తాను .నాకు భక్తి తో నమస్కరించి లొంగిపోయే వాళ్ళకు అన్ని వరాలు అనుగ్రహిస్తాను . ఇంద్ర లోకానికి ,ఇంద్రుని నా సామంతుడి లాగ నియమిస్తాను. అన్ని లోకాలను నన్ను పూజించమని ,ప్రార్ధ్దించమని ఆజ్ఞాపిస్తాను.మోక్ష అధికారం తీసుకుంటాను .ఎవరినా ఎదిరిస్తే ,వారికే కాదు వారి ఆత్మలను కూడా నాశనం చేసి మళ్ళి వాళ్ళకి జన్మ లేకుండా చేస్తాను .ఇక మీద నా భక్తులకు ఏమి లాబాలు ఉండవు .” అని పరిహసించాడు . డింభకుడు “ప్రభూ! రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ ల చేత నాకు నృత్య ప్రదర్శన ఇప్పించండి.”అని అడిగాడు .” శభాష్ నా డింభకా! రసికత లో గురువు నే మించిన శిష్యుడవి” అని “అలాగే,వారినే కాదు ,నీవు ఎవరిని కోరిన ,వారిని ,నీకు ఎలా కావాలంటే  అలా నీకు సేవలు చేయిస్తాను .నా బంటు వి రా నువ్వు “ అని రుద్రదండం  తన చేతికే  వచ్చేటట్లు భావించాసాగాడు.  ( సశేషం..)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top