సరదాగా కాసేపు - అచ్చంగా తెలుగు

సరదాగా కాసేపు

Share This

సరదాగా కాసేపు 

 - ఆర్. వి. ప్రభు

"కాల్ -భైరవా!!..URGENT!!

"చుల్బుల్ కుమార్" భార్య ఒక కుక్కని పెంచుతోంది !!.

..కానీ చుల్బుల్" గాడికి దాన్ని ఎలా గాయిన వదిలించుకోవాలని అనిపించి,కుక్కని దూరమ్ గా వదిలి ఇంటికి  వచ్చాడు!

కానీ కుక్క "చుల్బుల్" కంటె మున్దేవచ్చి ఇంట్లో వుంది!!

"హోరి దేముడా!..అనుకుని, కుక్క ని మళ్లా తీసుకుని , ఈ సారి ఇంకా దూరమ్ గా వదిలి వచ్చాడు !!

"చుల్బుల్" గాడు ఇంటికి వచ్చేసరికి ,....మళ్లీ అదే తంతు....కుక్క తోక ఆడించుకుంటూ  ,ఎదురు వచ్చింది !!

దీని పని ఇలా కాదు అని అనుకుని , ఈ సారి కుక్కని ఎక్కడెక్కడో ,  తిప్పి తిప్పి ,ఒక గంట తరువాత ఎవరికీ తెలియనన్త దూరమ్ గా వదిలి పెట్టాడు !!

ఒక గంట గడిచింది,రెండు గంటలు ....అలా ఒక 4 గంటలు గడిచి పోయాయి!!

"చుల్బుల్" గాడు , తన భార్యకి ఫోన్ చేసాడు !!

"ఇదిగో!!డార్లింగ్!!ఆ, అదే,..మన కుక్క కానీ ఇంటికి వచ్చిందా ??!!" అని అడిగాడు

"ఆ(!! ...బుజ్జి ముండ వచ్చిందండి పాపం!...బాగా అలసి పోయినట్టుంది, దాన్ని మన ఏసీ గదిలో ఉంచాను " అంది భార్య "బుల్బుల్"!!

"సరే!సరే!!....ఆ బుజ్జి ముండని ఒక సారి గదిలోంచి బయటకు తీసుకుని రా !!" అన్నాడు "చుల్బుల్"

"పోనీ లెద్దురూ!!దాన్ని ఇంకా బాధ పెట్టొద్దు, అయినా మీరిప్పుడు ఎక్కడ వున్నారు !!" అంది "బుల్బుల్"!

"అదే అర్ధం కావటం లేదు నాకూ !!....ఒక సారి ఆ బుజ్జి ముండని పంపు, నేను దారి తప్పిపోయాను అని  అనిపిస్తోంది ....నా ఖర్మ !!" అన్నాడు "చుల్బుల్" గాడు !!

__________________________________________________________________________________________________________________

"బ్రహ్మం", "పర బ్రహ్మం" ఇద్దరూ స్నేహితులు!!
రొజూ, బార్ కి వెళ్లి తాగేవారు!....ఒక రోజు...
"ఒరేయ్ "పరబ్రహ్మమ్"!!...మా ఆవిడ రొజూ ఇంటికి వెళ్ళగానే గొడవ మొదలు పెడుతుంది రా!!...ఇంత లెట్ గా వచ్చారెమిటీ అని!!" అన్నాడు "బ్రహ్మం"!
"నేను ఒక ఉపాయం చెబుతాను....నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళగానే , మీ ఆవిడకి కాసేపు తల పట్టు, లేదా కాళ్ళు పిసుకు , పాపం అలసి పోయి వుంటారు కదా, వెంటనె కూల్ అయి పోతారు!" అని సలహా ఇచ్చాడు "పర బ్రహ్మం" !
"బ్రహ్మం" ఇంటికిచెరుకున్నాడు !!...చడీ చప్పుడు చెయ్యకుండా , గది లోకి వెళ్లాడు , నెమ్మదిగా బెడ్ మీదకి చేరుకొని, తన భార్య తల పట్ట సాగెడు!.....కాసేపు ఉన్నాక, కాళ్లు కూడా పట్టడం  మొదలు పెట్టాడు !!...
అంతలో, మన "బ్రహ్మం" కి దాహం వేసింది !!...మెల్లగా ,చప్పుడు చెయ్యకుండా , మంచం దిగి
కిచెన్ లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చాడు !!
అతి మెల్లగా , పిల్లి లా మళ్లీ తన గది లోకి అడుగు పెట్టగానే , ఎదురుగా వున్న  దృశ్యం చూసి,గాభరా పడి పోయాడు !!!
ఎదురుగా తన భార్య నించుని వుంది !!???!!!!
"హేహేహే!!....నువ్వెందుకు లేచావ్? " అన్నాడు
"లేవడ మెమిటీ, నేను మా మహిళామండలి మీటింగ్ నుండి ఇప్పుడే వచ్చాను!!" అంది భార్య "పెంకీ ఘటం "!
"హెమిటీ!? ఇప్పుడే వచ్చావా ?..మరి మంచం మీద ఎవరూ??!!" అని అరిచాడు "బ్రహ్మం"!!
"ష్!!! గట్టిగా అరవకండి!!...మా అమ్మ నిద్ర  లేచిపోతుంది.....పాపం, మీరు లెట్ గ  వస్తారు, నేను మహిళామండలి మీటింగు కి వెళ్ల్లాలి...అమ్మ కి భయం ఈ ఇంట్లొ ఒక్కర్తీ ఉండాలంటే ....అందుకే నేను వచ్చేదాకా, నా గది లో పడుకో మన్నాను" ! అంది "పెంకి ఘటం"!
"అంటే ....నేను ఇప్పటి దాకా చేసిన సేవలు...!!??...హతోస్మి, అసలే నకూ  అత్తగారికీ పడదు !!...ఖర్మ ...ఖర్మ !!" అనుకున్నాడు "బ్రహ్మం"!!
అత్తగారు నవ్వుకుంటోంది !! ...అంతా వింటోంది .....కళ్ళు మూసుకునె!!
"ఏమండీ....మా అమ్మ  చూడండీ...నిద్దరలో కూడా నవ్వు తోంది....ఎంత బాగుందో!!" అంటోంది "పెంకి ఘటం"
తెల్లవారింది!!!
"బ్రహ్మం " రాత్రి జరిగినది తలుచుకుని, కుంగి పోతున్నాడు !!
వంటింట్లోంచి , అత్తాగారు...."బ్రహ్మ కడిగిన పాదమూ ....." అని  పాడుకుంటూ, టిఫిన్ చేస్తున్నారు !!
"పాడింది చాలు, మీ అమ్మని ,పాట మార్చుకోమను!" అన్నాడు భార్య తో "బ్రహ్మం"!
అల్లుడి మాట తు.చ పాటించింది అత్తాగారు!!
"బ్రహ్మ మొక్కటే ...పరబ్రహ్మమొక్కటే ...." అంటూ పాట మార్చేసింది!!
_________________________________________________________________________________________________________________________

తెల్ల వారింది!!...పక్షులు అరుస్తున్నాయి!!
మిగతా జంతువుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి!!
ఒక పెద్ద పులి,తన పిల్ల పులి తో ఆడుకుంటోంది .
"అమ్మా !! నిన్నా నువ్వు .."మనం చాలా గ్రేట్" అని అన్నావు ...అంటె ఏమిటమ్మా!??" అని అడిగింది , పిల్ల పులి!
"అవును! మనం చాలా గ్రేట్!!...
మన గోళ్ళు ఎంత వాడిగా వున్నాయో చూశావా!!..ఇవి శత్రువుల గుండెలు చీల్చగలవు!!
మన కోరలు చూడు !!...వీటితో ఎ జంతువూ మెడ పట్టుకున్నా, చచ్చిపోవలసిందే!!!
నా కండలు  చూడు, నేను ఎంత దూరమయినా పరుగు పెట్టగలను!!
మిగిలిన జంతువూ లన్నీ, మనమంటే గజ గాజా వణుకు తాయి!!

మన కి ఎదురుగా రావడానికి ,భయపడతాయి!!

ఇంకా గ్రేట్ విషయం ఏమిటంటే ...హహహ్హా....మీ నాన్న "అడివికి రాజు"!!" అంది పెద్ద పులి!
"అవునా !!అమ్మా !!...అమ్మా!!...నాకు ఒక్క సారి నాన్నని చూడాలని ఉండమ్మా!!...ప్లీస్ !" అంది పులి పిల్ల!
"ఆయనా ఇంకో చొట వుంటారు!!" అంది పెద్ద పులి !
"అయ్యినా అమ్మా!!నాదొక చిన్న డౌటు !!" అంది పులిపిల్ల !
"అడుగు చిట్టీ !" అంది పెద్ద పులి!
"మనకి  నువ్వు చెప్పిన అన్ని గ్రేట్ క్వలిటీస్ వుండీ,మనమంటే ,మిగతా జంతువులకి అంత భయం వున్నప్పుడు ,మరి అవి మన ఎదుటే ఇంతలా అరుస్తొంటె,ఏమీ చీయలేక పోతున్నామే ....అంతే కాదు , అసలు మనం ..
.ఈ "గదిలో" ఏమి చెస్తున్నట్టూ!??" అంది పులి పిల్ల!!
పెద్దపులి , కాసేపు మువునం గా వుంది పోయింది !!...ఒక నిట్టుర్పు విడిచింది!!
మొహం పక్కకు  తిప్పుకుని...
"అదే!!...చిన్నా...దీనిని "జంతుప్రదర్శన శాల " అంటారు ...నేను ఒక రోజు నిద్దర పోతున్నప్పుడు, చాటుగా వచ్చి , నాకు మత్తు" ఇంజెక్షను ఇచ్చి ఇక్కడికి తీసుకుని వచ్చారు.....అప్పుడూ , నువ్వు ఇంకా నా కడుపు లోనే వున్నావు!!" అంది పెద్ద పులి!
"మరి నాన్న!??" అడిగింది పులి పిల్ల!
"ఆయన ఇంకో గది లో ఎక్కడొ వుంటారు!!" అంది పెద్ద పులి !
"నాకు ఎలాగయినా నువ్వు నాన్నను చూపించాల్సిన్దె !!అసలు నెనెప్పుడూ చూడలెదు ఆయన్ని!!" అంటూ మారాము చేసింది,పిల్ల పులి!
ఆ రోజు ఆదివారం!!
ఇంతలో....."మమ్మీ!అదేమిటీ....పిల్లా ...అంత పెద్దదిగా వున్దెమిటీ??!" అని ఒక పిల్లాడు అడుగుతున్నాడు !
"హహహ్హా...నా బుజ్జి గాడికి అన్నీ సందేహాలే !!...అది పులి బుజ్జి కన్నా, అడివి లో వుంటుంది.!" అని చేబోతోంది, వాళ్ళ అమ్మ !!
బోను లో వున్న పెద్ద పులి కళ్ళు ,మెరిశాయి!!
"చిట్టీ!!...ఇలా రా!!...మీ నాన్నని చూపిస్తాను !" అని అరిచింది
పిల్ల పులి , పరుగు పరుగున వచ్చింది!!.."ఎక్కడా!!...ఏరీ!!" అంటూ!
"అదిగో అటు చూడు !!...అఆ బాబు వాళ్ల నాన్న వేసుకున్న బనీను  మీద వుండే "బొమ్మ" చూసావా!??" అంటూ అడిగింది పెద్ద పులి!!
"ఆ( ..ఆ((..పెద్ద పెద్ద జులపాలు,నిండు విగ్రహం..హబ్బా...ఎంత హీరో లాగా వున్నారో!!" అంటూ సంభర పడిపోయింది ,పిల్ల పులి!
"హహ...అదే మరి నేను చెప్పానా...అంతే కాదు , ఈ మనుషులు మన పేరు కూడా  వాడుకుంటారు..."వీడు పులి రా!" అని కొన్దరూ "వీడు కొదమ సింహం" రా అని మరి కొన్దరూ !"అంది పెద్ద పులి!
"వోహో!!...మరి ఆ పక్కన , నీ లాంటి చర్మం వున్న కోటు వేసుకుంది...అదేమిటీ??" అడిగింది పిల్ల పులి!
"హూ(!!...అది- అది...మీ పెద్దమ్మ ది అయి వుంటుంది !! చాటుగా మాటువేసి ,ఈ మనుషులు మీ పెద్దమ్మ ని చంపి,ఆవిడ చర్మాన్ని ఇలా వాడు కుంటున్నారు!!...ఇదేముందీ...కొంతమంది, బడా బడా గాళ్లు,మనల్ని గోడల మీదా, నెల మీదా కూడా పరుచు కుంటున్నారు !!" అంటూ చెప్పుకొచ్చింది, పెద్ద పులి!!
పాపం ,పిల్ల పులి కి , ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు!!
మళ్లీ, తన తల్లి తోక తో, ఆడుకోవటం మొదలు పెట్టింది!!

No comments:

Post a Comment

Pages