Monday, June 23, 2014

thumbnail

సంపాదకీయము

సంపాదకీయము
-- చెరుకు రామ మోహన్ రావు 
  నేను వ్రాసే ఈ సంపాదకీయానికి మూలము సద్గురువులు శివానంద మూర్తి గారి, ఆంధ్ర భూమిలో 10/06/14 న ప్రచురింపబడిన మానవతకు గుర్తింపు అన్న వ్యాసము. 'భ రతము' అభివృద్ధి కాంక్ష. అసలు ఈ పేరు ఏవిధంగా ఏర్పదడినదన్న తర్కము ప్రక్క నుంచితే, ఈ దేశాన్ని ఎన్నివిధాలుగా;ముఖ్యముగా తమ అత్యాశ వల్లగానీ,తమ సామ్రాజ్య దాహము వాళ్ళ గానీ, తాము సృష్టించుకొన్న మతముల వలన గానీ,అన్య దేశస్థులు అణచ ప్రయత్నించినా  తన రతమును వీడలేదు.భారతీయత అంటే ఈ దేశం యొక్క సనాతన స్వరూపం. అది అటలము అచంచలము.ఇందులో ఇహము, పరమూ అని రెండు ఉన్నాయి. ఆ రెండింటికీ విడదీయరాని సంబంధం ఉంటుంది. జీవుడనేవాడు అనేక జన్మలెత్తుతాడు. అదంతా ఇహమే. ఎదో ఒకనాడు పరమును చేరుకుంటాడు. గిన్నెడు నీరయినా మరిగి మరిగి ఆవిరయిపోవలసినదే.ఇది ఎ భారతీయుడు మరువని సత్యము. ఈ భారతీయతలో యాత్రలూ, పూజలూ, వేషం,భాషా, గురువులూ, మఠాలు, పురాణాలు ఇవన్నీ బాహ్య స్వరూపం. దీని వెనుక ఉన్న తత్వం తెలియక పరమతస్థులు ఈ భారతీయతను చిన్నచూపు చూస్తూవుంటారు.ఈ సంస్కృతి యొక్క స్వరూపము,స్వభావము ఆకళింపు చేసుకొనక పైపైన చూసే అన్య మతస్థులకు అదంతా అర్థములేని అజ్ఞానములా  కనపడుతుంది. గత శతాబ్దంలో తురుష్క,ఆంగ్లేయ ప్రభావములోపడి  నూతన వికాసంలో అడుగుపెట్టినామనుకొన్న  దృక్పధము హిందూజాతిలో పుట్టిన వారిలో ఎక్కువగా పెరిగింది. హైందవేతరులకు ఈ హిందూ మతం గర్హనీయంగా కనిపిచుటలో  తప్పూలేదూ, ఆశ్చర్యమూ లేదు అనిపిస్తుంది. అన్యమతస్థుల,ప్రలోభము, ప్రచారమువల్ల,  హిందూ జాతిలోపలే ఈ ధర్మమునకు చెందిన ఆక్షేపణ పెరుగుతూ రావడంవల్ల, కువిమర్శలవల్ల, నిర్హేతుక రచనలవల్ల, గత శతాబ్దంలో నాగరికతలోనూ, ఆ తరువాత రాజకీయాలలోనూ ఈ ధర్మమూ,ఈ సనాతన  సమాజము నిరంతరంగా ఆక్షేపణకు గురియగుతూ వచ్చింది. ఈ కుహనా పండితులు  తమకుతామే గురువులుగా ప్రకటించుకొని  వైదిక  గ్రంథ పరిశీలించిన లేకయే, సాహిత్యంలో, విద్యారంగంలో వేషభాషలలో వివేకములో, వికాసములో, విజ్ఞానములో, నూతన దృక్పధం కలిగినవారుగా చలామణి అయ్యారు. ఈ దేశంలో హిందువులు కానివారు, నాస్తిక వర్గాలవారు అందరూ కలిసి ఓ వింత ధోరణిలో హిందూ వ్యతిరేక రాజకీయ వాతావరణం సృష్టించారు.  హిందూ మతంలో ఉన్నవారు వీరిని ఎదుర్కొని హిందూ ధర్మ పక్షంలో మాట్లాడితే అలాంటివారంతా పరమత సహనం లేని మతవ్ఢ్యౌంలో ఉన్నారని, కాబట్టి వారిని పరిపాలనలోకి రానివ్వకూడదని, వాళ్ళు వస్తే దేశాన్ని ముక్కలుచేసి, ప్రగతిని లేకుండా చేస్తారని ఈ దేశంలో ప్రచారం ఊహించలేనంతగా పెరిగింది. హిందూత్వంలో ఉన్నవారిని రకరకాల అవమానాలకి గురుచేసి ‘‘కాషాయ మూకలు’ 'కాఫిర్లు'ఇత్యాది పేర్లో పెట్టి చాలా అవమానం చేయతము జరిగినది. హిందువులు దీనివల్ల అనేక రంగాలలో తక్కువగా చూడబడ్డారు. ఈ పరిస్థితి చివరకు హిందూమత విరోధమేకాక భారతదేశ విరోధంగా కూడా పరిగణించబడింది. ఈ నేపథ్యంలో రాజకీయంలో లాభం పొందినవారు, ఎటువంటి ఉన్నత భావాలు లేక రాజకీయాలలో అవినీతి, నిరంకుశత్వం హద్దుమీరి ప్రకటించారు. వీరు కేవలం స్వార్ధపరులే కాని న్యాయ పరిపాలన వారి మనస్సులో లేదు.కానీ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించి అధికారం చేపట్టిన ఆనాటి రాజకీయ నాయకులకు మతద్వేషం లేదు.    దేశ సేవయే సర్వస్వమనుకొన్న దేశ భక్తులు  స్వతంత్రం తరువాత రెండు దశాబ్దాలలోపే నిష్క్రమించడం చేత, తరువాత భారత రాజకీయ రంగంలో అధికారంకోసం పోటీ తీవ్రమయి  క్రమంగా అవినీతి పెరిగింది. దాంతోపాటే క్రమంగా హిందూ సాంప్రదాయ విరోధం కూడా ఇంకా అధికమయ్యింది. చివరికి దేశం హిందూ వ్యతిరేక శక్తులకు కూడా తావిచ్చింది.కోట్లాది పౌరులు ఈ విషయం గుర్తించారు. దేశానికి జరుగుతున్న హానిని గుర్తించారు. ఈ గుర్తింపుయొక్క భావప్రకటనమే 2014 ఎన్నికలు. దీని వెనుక ఉన్న సత్యమిదే కాని, బలమైన హిందూ మత ప్రచారం కానేకాదు. అందువల్ల ఈ విజయం హిందూ మత విజయం కాదు. ఓ విధంగా భారతీయతలోని న్యాయ దృష్టి, మానవత్వం ఇవే గుర్తించబడినవి. అంతేకాని ముస్లిములతో సహా వేసిన ఓట్లన్నీ హిందూ మతానుకూలతతో వేసినవి కాదు. ఇందులో అవినీతి తిరస్కారం, సువిశాల భారతీయత యొక్క గుర్తింపు ఈ రెండే ఉన్నాయి. నిజానికి మన దేశానికి కావలసిందదే. ఇదే 'భ' రతము ఇదే భారతము. తత్సత్

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information