జ్ఞాపకాల పొరలలో...
-      పోడూరి శ్రీనివాస్
జ్ఞాపకాల పొరలలో...
మిగిలిపోయిన
మధురభావనవు నీవు.

జీవిత గ్రంధంలో ..
గుర్తుకువచ్చే
మనోహర సన్నివేశం నీవు.

కలహంస నడకల సోయగంలో
మంజుల రవళుల
మంజీరనాదం నీవు.

కుహూ కుహూ కోయిల గీతంలో
పరవశించే మధురమైన
వసంతగీతానివి  నీవు.

మదనమనోహర పూల రధంలో
మరులుగొలిపే
సువాసనల సంపెంగవు నీవు.

మధురభావనల మకరందం
గ్రోలడానికి వచ్చిన భ్రమరాన్ని
అంతరంగ కుహరంలో బందీ చేసిన
అసలు సిసలు జాణవు నీవు !
నా కలల రాణివి నీవు !

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top