కాకరకాయ సాంబార్ - అచ్చంగా తెలుగు

కాకరకాయ సాంబార్

Share This
కాకరకాయ సాంబార్ - పెయ్యేటి శ్రీదేవి
          హాయ్!  బాగున్నారా?  కాకరకాయ సాంబార్ ఎలా చెయ్యాలో చెబుతా.  కాకరకాయలతో సాంబారేమిటనుకోకండి.  చేసి చూడండి.  కొంతమంది కాకరకాయలు పై చెక్కు తీసి, ఉప్పునీళ్ళలో ఉడకబెట్టి, తరవాత దాని మొహాన్నింత బెల్లమో, పంచదారో పోసి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి, దానికి స్వతహాగా వున్న చేదు రుచిని చంపేసి ఏవో చేసేస్తారు.  దాన్ని కాకరకాయ అనరు.  కీకరకాయ అంటారేమో.
సరే, కాకరకాయ సాంబార్ కి కావల్సిన పదార్థాలు:
చిన్నగ్లాసు కందిపప్పు, కాకరకాయ 1, ఒక స్పూను MTR సాంబారు పొడి, ఇంగువ, కరివేపాకు, పోపు దినుసులు, పసుపు, చింతపండు, ఉప్పు.
తయారు చేసే విధానం:
          చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి.  కాకరకాయ చక్రాల్లా తరుగుకోవాలి.  స్టౌ వెలిగించి కుక్కరులో పప్పు ఉడికించుకోవాలి.  మూకుడులో నూనె వేసి కాకరకాయముక్కలు బాగా ఎర్రగా వేయించాలి.  వేగాక చింతపండు పులుసు పోసి, ఉప్పు, పసుపు వేసి, అందులో ఉడికిన పప్పు వేసి ఉడికించాలి.  ఆఖర్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, రెండు పచ్చిమిర్చి పోపులో వేయించి, కొంచెం ఎర్రకారం వేసి పులుసులో కలపాలి.  కావాలంటే కొత్తిమీర కూడా వెయ్యచ్చు.
**************************

No comments:

Post a Comment

Pages