చిన్ని శిశువు
(చిత్రం : పొన్నాడ మూర్తి గారి సౌజన్యంతో )
- పెయ్యేటి రంగారావు

నిదురలో నవ్వేవు-నిదురలో ఏడ్చేవు
ఎవరు కనిపించేరమ్మ-ఓ చిన్ని శిశువా?
మనసుతో మాటాడి బదులీయమ్మా||
ఎదలోని కోర్కెలను తీర్చు-ఏడుకొండలవాడు
శ్రీదేవి హృదయేశుడా వేంకటేశుడా?
ముత్తెముల నగవులతో ఎత్తుకొన్నాడా?
కామితములిత్తునని హత్తుకున్నాడా?
రక్కసుని కడతేర్ప రాతి స్థంభము నుండి
ఉగ్ర రూపము దాల్చి ఏతెంచు నరసింహుడా?
భయమేల అని యనుచు లాలించినాడా?
అష్టశ్రిళను ఇచ్చి ముద్దాడినాడా?
అన్ని విద్దెలతల్లి ఆ సరస్వతీ దేవి
సకల సౌభాగ్యరాశి క్షీరాభ్దిపుత్రిక
అన్ని విద్యల నేర్పి, సకల సంపదలిచ్చి
ఆశీస్సులందించి నవ్వులొలికేరా?
మహిషుడను రక్కసుని మర్దింపగా నెంచి
కాళికామాత తాండవం చేసెనా?
వేయినాలకల తోడ వేల దీవెనలిచ్చి
బెదరిపోవకె నీకు అమ్మ నేనన్నదా?

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top