నవ్వుల నజరానా
- ఆర్.వి.ప్రభు
"కొడితే కొట్టాలిరా సిక్సు  కొట్టాలీ...!!!
భార్యా భాదితులు , ఒక సంఘం గా ఏర్పడి ,...ఒక ఆదివారం నాడు మీటింగు పెట్టుకున్నారు!!
"ఏమయినా సరే , రేపటినుండి మనం లొంగకూడదు,.....ఇంట్లొ ఎ పనులూ  చెయ్యకూడదు ...చూద్దాము ఏమయితే అది అవుతుంది " అని గట్టిగా చెప్పాడు సంఘం ప్రెసిడెంటు "కొంగు చాటు కోటయ్య"!
అందరూ వొప్పుకున్నారు!...."ఒక వారం రోజుల తరువాత, ఇక్కడె కలుద్దాము" అనుకున్నారు అన్దరూ!!
ఒక వారం , గిర్రున తిరిగింది!!
రివ్యూ  మొదలయ్యింది!!
"నేను మొదటి రోజు ఎ పనీ చెయ్యలేదు, రెండో రొజూ ఎ పనీ చెయ్యలేదు!!
మూడో రోజు చచ్చినట్లు వాళ్ల పని వాళ్లు చేసు కున్నారు!!'' అన్నాడు "వృషభ కామారి" భర్త!!
"నెనూ అంతే!!అచ్చు మీ లాగే చేసాను,మొదటి రెండు రొజులూ!!..మూడొ రోజు నుండి వాళ్ల పని వాళ్లు చేసుకున్నారు!!  అన్నాడు "మీన వల్లి" భర్త!!
"నేను మొదటి రెండు రొజులూ పనిచెయ్యలేదు...మూడో రోజు అతి కష్టం మీద కళ్లు తెరిచి చూసెసరికి, ఆసుపత్రి బెడ్ మీద వున్నాను!!....అప్పుడె మా ఆవిడ డాక్టర్ ఆగ్రిని అడుగుతోంది.."ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మా వారిని....రెండు రోజుల నుండి అంట్లూ, బట్టలూ అలాగే వున్నాయి" అని చెప్పాడు "వృశ్చిక సుందరి" భర్త!!
"అబ్బా!! అంత గట్టిగా కొట్టిందా ??" అని అడుగుతుండగా
,"ఎవరు బాబూ ఇక్కడ ప్రెసిడెంటు ?'' అని అడుగుతూ ""వృశ్చిక సుందరి",... "వృషభ కామారి" "మీన వల్లి" ని వెంట బెట్టుకుని వచ్చింది!!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top