శ్రీధరమాధురి 5
  “ పవిత్రమైన గురుపౌర్ణిమ సందర్భంగా, అందరికీ శుభాకాంక్షలు. దేవుడికి నా ప్రార్ధనలు. మహర్షి రాజర్, ఒక నాడు 'గురువు ' అంటే ఎవరో చెప్పారు. అది మీతో పంచకుంటున్నాను. కొన్ని విషయాలు తల్లిదండ్రులతో, కొన్ని మిత్రులతో, కొన్ని బంధువులతో పంచుకోగలం. కానీ, అన్ని విషయాలూ నిస్సంకోచంగా సద్గురువులతోనే పంచుకోగలం. ఒకవేళ నీవేదైనా చెప్పడానికి సంకోచిస్తుంటే, ఆయన నీ గురువు కాదని అర్ధం. గురువుతో అనుబంధం ఆత్మ నుంచి మొలకెత్తేది, స్వచ్చమైనది. అందుకే ఈరోజు ఆనందంగా పండుగ జరుపుకోండి. నా గురువులందరికి, ఈ పవిత్రమైన రోజున నా వందనాలు, సాష్ఠాంగ ప్రణామాలు. “
-          పరమపూజ్య ఆచార్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజి.
   1.  “తెలివు గురు తిరుమేని కాందళ్ తెలివు గురు తిరునామం చెప్పాళ్ తెలివు గురు తిరువరై కేట్టాళ్ తెలివు గురు ఉరు సింధిత్తాళ్ ధానే”
----తిరుమూలార్ .
 నిజమయిన శిష్యుడు ఎలా ఉండాలో తిరుమూలార్  ఇలా చెప్పారు...  
 " దైవానుగ్రహం వల్ల నీకు సద్గురువు లభిస్తే, ఆయనను చూస్తూ ఉండు.
దైవానుగ్రహం వల్ల నీకు సద్గురువు లభిస్తే, ఆయన నామం జపించు.
దైవానుగ్రహం వల్ల నీకు సద్గురువు లభిస్తే, ఆయన మాటలు వింటూ ఉండు.
ఆయన ప్రత్యక్షంగా నీ దగ్గర లేకపోతే, ఆయననే ధ్యానిస్తుండు."
 సద్గురువును చూడడం అంటే - ఆయన్ను చూసినప్పుడు మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఆయన శరీర భాష మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు చెప్తుంది. ఆయన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఆయన ఎల్లప్పుడు నీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి ప్రతి కదలికలో శిష్యుడికొక సందేశం ఉంటుంది. అందుకే ఆయనను చూసి, నేర్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఆయన నామాన్ని జపించడం - ఆయన నామస్మరణం ద్వారా నీ మెదడులో ఎన్నో సద్భావ తరంగాలు జనిస్తాయి. అవి మీలో మీపై కొత్త విశ్వాసాన్ని నింపుతాయి. అది క్రమంగా మనసులో ఎంతో ప్రశాంతతను నింపుతుంది. ఆయన మాటలు వినడం - ఆయన తన మాటల ద్వారా మనకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తారు. ఆయన మన బాగు కోరి, మనం ప్రేమ పూర్వకమైన, ఆనందమయమైన జీవితం గడపాలని కోరుకుంటారు. ఆయన, మనం క్రమంగా ఆధ్యాత్మిక పరిణతి చెందాలని కోరుకుంటారు. ఆ భాషా, ఆ శక్తి, మనలను తేలిగ్గా సంసారసాగరం దాటించేందుకు సహాయపడుతుంది. సద్గురువును ధ్యానించడం ద్వారా, మీరు దైవానుభూతిని పొందుతారు. దక్షిణామూర్తి - జ్ఞానానికి ప్రతిరూపమైన ఈ దైవం, మనల్ని స్వేచ్చా ముక్తి మార్గమైన మోక్షం వైపు నడిపిస్తారు. ఈయన ఈ జీవితపు వాస్తవ స్థితిగతులు తెలిపి, అన్ని విషయాలను నిష్పాక్షిక మనసుతో, పవిత్రంగా ఆలోచించేలా చేసి, నీవి జీవితాన్ని ఆనందమయం చేసుకొనేలా చేస్తారు. సచ్చిదానంద.   2. గురువులతో మా రోజులు ... నేను మా గురువుగారికి శిష్యుడిగా ఉండే రోజుల్లో, మేము వారిని అమితంగా ప్రేమించడం వలన, ఆ ప్రేమ నుంచీ, ఒక విధమైన గౌరవం, మర్యాద, వచ్చాయి. ఆయన ప్రతీ మాటను విధిగా గౌరవించి, పాటించే వాళ్ళం. ఆయన నన్ను తిట్టినా, హత్తుకొన్నా, అది ఆశీర్వాదంగా భవించేవాడ్ని. ఆయన ప్రతి మాటనీ, ప్రతి చర్యనీ, ఒక సందేశంగా భావించేవాళ్ళం. ఇప్పుడు నేనొక గురువు స్థానంలో ఉండి, నా శిష్యులను ఎంతో సున్నిత మనస్కులుగా చూస్తున్నాను. వారి గురించి వాస్తవాన్ని చెప్పినా, వారు తట్టుకోలేక పోతున్నారు. వారెంత బలహీన మనస్కులంటే, వారు ప్రతీ దానికీ, గురువే వారి వద్దకు వచ్చి సముదాయించాలని కోరుకొంటారు. వారి సున్నిత హృదయం గాయపడిందని ఇతర శిష్యులకు చెప్పుకొంటారు గానీ, గురువుకు చెపే ధైర్యం చెయ్యరు. ఇదెంతో సిగ్గు పడాల్సిన సంగతి. మీ సున్నిత మన్సస్తత్వాలను, సునిశిత మనస్తత్వాలుగా మర్చుకోండి. ఒక గురువు ప్రవర్తన అన్నిటికీ అతీతంగా ఉంటుంది.అంత మాత్రాన్న అది అలుసుగా తీసుకోకండి. ఆయన మీ స్థాయికి దిగి రావడం ఆయన ఔదార్యం. అలా దిగి రావడం వలన, ఆయన శిష్యుడికి మరింత చేరువగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆదిశంకరాచార్యులవారిని ఒక మారు, 'కో విషం?' అని ప్రశ్నిస్తే, ఆయన 'అవదీరణ గురుషు ' అన్నరు. అంటే ఏది విషం అన్న ప్రశ్నకు గురువును అవమానించడమే విషం అన్నారు. పిల్లల మనస్తత్వాలు వీడి, స్వసానుభూతి మాని, వాస్తవాన్ని చూడండి. లేకపోతే మీరు గురుకులంలో ఉండేందుకు అనర్హులు. 3. చాలా వరకు మన విజ్ఞానం గురువుల వద్ద నుంచి కాక, పుస్తకాల ద్వారా సంపాదించినదై ఉంటుంది. ఈ విషయాన్ని గురించి చాణక్యుడు చెప్పిన మాటలు.... “పుస్తక ప్రతయయాధితం నాధితం గురు సన్నిధౌ సభామధ్యే నా శోభంతే జార్గర్భాయేవ స్త్రియాః!” కేవలం పుస్తకాల ద్వారా జ్ఞానం సంపాదించిన వారు పదిమందిలో ప్రకాశించలేరు . అక్రమ మార్గంలో గర్భవతి అయిన స్త్రీకి సమజంలో గౌరవం పొందే అర్హత ఉండదు కదా.   4. నేను ఒక కధ విన్నాను - నీ తర్కానికి, గురువుకి మధ్య వ్యత్యాసం... ఒక ధనవంతుడైన అమెరికన్, తన జీవితపు మలి సంధ్యలో జీవితపు సత్యాన్ని తెలుసుకోవాలనుకొన్నాడు. అతను చాలా మంది గురువుల వద్దకు వెళ్ళాడు. అతనికి తృప్తి కలుగ లేదు. అందరూ, వేర్వేరు సలహాలు, పద్ధతులూ చెప్పసాగారు. అవన్నీ ప్రయోజనం లేనివని, అతనికి అర్ధమయ్యింది. చివరకి అత్తన్ని ఒకరు, హిమాలయాల్లో ఉండే ఒక గురువు వద్దకు వెళ్ళమన్నారు. అతను, ఇండియా వచ్చి , ఎన్నో ప్రదేశాలు తిరిగి, చివరకి ఆ గురువును కనిపెట్టాడు. ఆయన చాలా సామాన్యంగా ఉన్నారు. అతను ఆయనతో మాట్లాడే లోపే, 'నీవద్ద అమెరికన్ సిగరెట్లు ఏవైనా ఉన్నాయా ' అని అడిగారు. అతను అవాక్కై, ఒక ప్యాకెట్టు ఇచ్చాడు. ఆ గురువు ఒకటి తీసుకొని కాలచాడు. ఆయన, మరలా, 'నీవు అమెరికా తిరిగి వెళ్ళి, ఒక పెద్ద పెట్టె నిండా సిగరెట్లు తీసుకొని రా. మాకిక్కడ అవి దొరకవు. అలాగే నీ చేతి వాచ్ వదలి వెళ్ళు. నాకు వాచీ లేదు కనుక సమయం తెలియట్లేదు' అన్నారు . అమెరికన్, గురువుతో, 'నేను ఏమైనా నియమాలు పాటించాలా ' అని అడిగాడు. గురువు, 'నీవేంచాయలో నీకు ఇంతకు ముందే చెప్పానుకదా. వెళ్ళు, వెళ్ళి పెట్టె నిండా సిగరెట్లు తీసుకురా, ప్రస్తుతానికి ఇదే నీవు పాటించాల్సింది 'అన్నారు. తర్కం, అంచనాలు వెయ్యడం, ఎత్తులు-జిత్తులు, ఎందుకు అని ఆలోచించడం, ఎదురు ప్రశ్నించడం, గురువుల దగ్గర పని చెయ్యవు. ఇవి అధ్యాపకుల వద్ద పని చేస్తాయేమోగాని, గురువుల దగ్గర కాదు.   5. శిష్యుడు తన గురువు వద్దకు వెళ్ళి, 'గురువర్యా ! ప్రతీ రోజూ, నా కలలో, మంచి చెడుతో పోరడుతూ ఉంటుంది. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకొంటున్నారు? ' అని అడిగాడు. గురువు, 'నీవు దేన్ని పెంచి పోషిస్తే, అదే గెలుస్తుంది ' అని జవాబిచ్చారు.   6. గురువు చెప్పిందల్లా విని నువ్వు తలాడించాలని, వారు కోరుకోరు. నీ మేధస్సును కుదిపి, నిన్ను అప్రమత్తంగా చెయ్యాలని వారు భావిస్తారు. వారు నిన్ను తీసుకువెళ్ళి, నీవు ఈ జీవితపు వాస్తవాలు తెలుసుకొని, వాటిని అంగీకరించి, ఆ అనుభవాల ద్వారా ఒక నిజమైన జీవితం గడిపేలా చేస్తారు. అలా జీవించడామే నిజంగా బ్రతకడం. ఎవరు వారిలా ఉండాలంటే, కొంత తిరగబడే తత్వం తప్పదు. మార్పు అనేది ఎక్కువ అంతర్గతంగా ఉంటుంది. బయటకు కనిపించదు. మీరు మీరులా జీవించేటప్పుడు, అంతర్గతంగా మీలో మార్పు యొక్క అవసరాన్ని గుర్తించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా మలచుకోవలో తెలుసుకుంటారు.మార్పు మీరు గడిపే నిజమైన జీవనశైలిలో మిళితమై ఉంది. మందలో గొర్రెల్లా పోక, అప్రమత్తంగా ఉంటూ, మార్పు మీలో ఒదిగేలా బ్రతకాలి. ఈ విధంగా జీవిస్తున్నప్పుడు, కొందరు మిమ్మల్ని మొండివారుగా, ఎదురు తిరిగే వారిగా చూడొచ్చు. కానీ అదే మందలోనిగొర్రెల ఆలోచనా సరళి. మీకు ఎవరి వద్ద నుంచీ ప్రశంశా పత్రాలు, పొగడ్తలు అక్కరలేదు. ఇది నీ జీవితం. దీన్ని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ దీన్ని గురించి ఆలోచించక్కర్లేదు. అలాంటి వాళ్ళు, మన మధ్యలో తిరిగే గుంట నక్కలు. నీవు అప్రమత్తంగా ఉంటే, అటువంటి వారిని గుర్తించి, వారి సంగతి చూడగలవు. నీ నిజమైన జీవితమే నీకు మార్గదర్శిగా, ఇటువంటి విషయాలు ధైర్యంగా ఎదుర్కొనే సత్తానిస్తుంది. ఎదురు తిరిగైనా, నిజమైన జీవితాన్ని గడపండి.   7. అధ్యాపకుడు ఎక్కువగా బుద్ధివికాసనికే ప్రయత్నిస్తాడు. కాబట్టే అతను, అది తప్పు, ఇది ఒప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు, ఇక్కడ నిలబడకు, అక్కడకి వెళ్ళు, అలా వెళ్ళకు, ఇలా నిన్ను మలచడానికి ఎన్నో రకాల ఆంక్షలు పెడుతూ ఉంటారు. కానీ గురువు నీ హృదయవికాసానికి ప్రయత్నిస్తారు. ఆయని నీ చర్యలు చూసి నవ్వుకుంటారు. నువ్వు, 'నేనిది చెయ్యొచ్చా?' అని అడిగినపుడు, ఆనందంగా చెయ్యి అంటారు. 'ఇది చెయ్యలేను ' అన్నప్పుడు, సరే అది చెయ్యకపోయినా పర్వాలేదు, నీవు సంతోషంగా ఉండు అంటారు. ఆయన నీ అనుభవాలలో జోక్యం చేసుకుని, అడ్డురారు. ఆయన, నీవు ప్రతీ ఆంశాన్నీ తప్పించుకు తిరగడం ద్వారా కాక, అనుభవం ద్వార నేర్చుకొని ఉన్నత స్థితికి పరిణతి చెందాలని కోరుకొంటారు.   8. మతం ఎంతో విశ్వసనీయమయినది. సద్గురువులు నమ్మదగినవారు. వారు నీకు నిజంగా జీవించడం అంటే ఏంటో నేర్పుతారు. వారు కేవలం సూచనలు చేస్తారు. ఆచరణ నీ చేతుల్లో ఉంటుంది. మీరు వారు చెప్పేవన్నీ మహాత్ములకే తప్ప, మానవ మాత్రులకు పాటించడం వీలుకాదని అనుకుని, వదిలేస్తే, మీలో ఎటువంటి పరిణితి కలగదు. ఒక మంచి జీవితం గడపాలనుకునే వ్యక్తీ, నిశ్చింతగా ఉంటూనే, తనదయిన శైలిలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. ప్రతీ వారికీ , మొదటి బాధ్యత తమపై తమకు ఉంటుంది. తాను లేనప్పుడు, మిగిలినవన్నీ ఉండవు. భ్రమల్లో బ్రతకకండి ,దీని వల్ల మీపై వొత్తిడి పెరుగుతుంది. మీరేదన్నా చూడాలనుకున్నా, చెయ్యాలనుకున్నా, దానిని పూర్తిగా చూసి ,చేసి, ముగించేయ్యండి. నిజమయిన జీవితం గడపండి, ప్రామాణిక జీవితం కాదు. మీరొక పదవిలో, కొన్ని ప్రమాణాలు పాటిస్తూ సాధికారంగా ఉండవచ్చు. కాని, జీవితంలో అలా ఉండకూడదు. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. సంపూర్ణమవుతుంది, సంత్రుప్తికరమవుతుంది. అతను చాలా ఉల్లాసంగా ఉంటూ, అందరికీ దావాగ్నిలా సంతోషాన్ని వ్యాపింపచేస్తుంటాడు. అతను అందరికీ, ఆదర్శవంతంగా, ప్రేరణగా నిలుస్తాడు. నిజమయిన జీవితం గడపండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top