పైరు పండే పంట ఎన్నడైనా తనకోసం ఉంచుకోదు
ప్రకృతి ఇచ్చిందంతా తీసుకోదు..
పాడుచెసే బుద్ధి మనిషి కెందుకో?
తరువులు పూసిన పూవులు తమకై దాచుకోవు,
కాసిన కాయలు తామే తీసుకోవు.
విరులు ఎంత అందంగా
విరిసి మనకిచ్చి మురిసాయో
 మేఘాలు తమ లోని నీటిని  తామే ఉంచుకోవు,
పశు పక్ష్యాదులకు ఉన్న పరోపకారం మనకి లేదెందుకో!!.
సిరులూ సౌభాగ్యాలు దాచితే ఎదగరట ..
పెరగాలంటే పంచడం  నేర్చుకొవాలని..
తరువు ఎంత పూచి-
విరగ గాచినా గాని,
ఒక్క పండైనా తనకోసం ఉంచుకోదే,
పరుల కొరకు పంచు సుగుణమ్ము నేర్వదే..
ప్రకృతి దాచిన సంపదనంతా,
గజయంత్రాలతో తవ్వి తీసే మనిషి మేధ..
మన కోసం సృష్టినంతా దోచేస్తున్నావే..
గాలీ నీరూ,ఎండా మనకై అన్నీ ఇస్తుంటే,
  తీసుకుని ,వాడుకుని, తిరిగి ఎమీ ఇవ్వకపోగా
స్వార్ధం తో ఉన్నది పాడు చేస్తూ-
ప్రకృతికి ద్రోహం చేస్తున్నాం .
ఇది భావి తరాలకీ చెడుపు చేసేదే!
నీవేం చేసావు ప్రకృతికని ప్రశ్నిస్తే ఏం చెబ్తావ్?
తరతరాల సంపదలనీ కొల్ల గొట్టి..

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top