రుద్రదండం (జానపద నవల) - ఫణి రాజ కార్తీక్ - అచ్చంగా తెలుగు

రుద్రదండం (జానపద నవల) - ఫణి రాజ కార్తీక్

Share This

(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతూ,ఆమె పరధ్యానానికి కోపించిన శివుడు శక్తులను ఆపాదించిన రుద్రదండం త్రిశూలంతో విరిచేస్తాడు. ముక్కలైన రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మాంత్రికుడైన మార్తాండ కపాలుడు. ఆ దండంలోని ముక్కలు అనేక చోట్ల జంబూ ద్వీపంలో పడతాయి.   అవి దక్కించుకుని, వాటితో తిరిగి రుద్రదండం తయారు చేసినవాడు దైవసమానుడు అవుతాడు.తన కధను డింభకుడికి చెప్తూ ఉంటాడు మాంత్రికుడు.బీదవాడైన మాంత్రికుడి రాజ్యంలో యువరాణికి అంతుబట్టని జబ్బు చేస్తుంది. అరణ్యంలో మూలికా,ఫల సేకరణకు వెళ్తాడు మార్తాండుడు. అప్పుడొక ఆర్తనాదం వినిపిస్తుంది...)

అక్కడ ఒక అంధముని దాహం దాహం, ఆకలి అని రోదిస్తున్నాడు. నేను వెళ్లి ఆ మునిని చూసి, అతనికి పళ్ళు మరియు మంచినీరు ఇచ్చాను. దాంతో ఆ ముని “నీకేమన్నా వరం కావాలంటే కోరుకో, నీ సేవలకి తృప్తి చెందాను అన్నాడు. నేను “నీకు అంత శక్తీ ఉంటే నీవే నీకు కావలిసినవి సమకుర్చుకోవచ్చు కదా” అన్నాను. అప్పుడు అంధముని ఇలా చెప్పసాగాడు. “నాయనా! నాకు నా శక్తిని నేను ఉపయోగించుకునే భాగ్యంలేదు. విద్యలు ఉన్న గర్వంతో విర్రవీగిన నాకు, ఈ శాపం ఇచ్చారు. అని ఆవేదన వెలిబుచ్చాడు.

అయితే నేను నాకు నిలువెత్తు, బంగారం, ధనం అడిగాను. నీవు ఇంటికి వెళ్ళేపాటికి నీ ఇంట్లో ఉ౦టాయి అన్నాడు. నేను ఇంటికి వెళ్లి చూసే సరికి బంగారం, ధనం ఉన్నాయి. నా ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు రాత్రి నాకు నిదుర పట్టలేదు. ధనం ఉన్న నాకు, అది చాలదేమో అని తోచింది. అధికారం మీద ఆశ పుట్టింది. మూర్ఖులే కదా దొరికిన దానితో సంతృప్తిపడేది అనుకున్నాను. మరుసటి రోజు తెల్లవారగానే ఆ ముని ఉన్న దగ్గరకి వెళ్ళాను. ఆ అంధముని అక్కడే ఉన్నాడు. నేను ఇచ్చిన ఫలములను తింటున్నాడు. నేను ఇంకను కొన్ని తీసుకువెళ్ళి సమర్పించి నమస్కరించబోయాను. అతను నన్ను వారించి, ”నాయనా! ఇచ్చిన వాటితో సంతృప్తిపడు“ అన్నాడు. నేను ఆయనను మరొక్క వరము ఇవ్వవలసిందిగా కోరాను. అతను ససేమిరా కుదరదు అన్నాడు. నేను ఎంతో బ్రతిమాలగా ”నిన్న నేను పండ్లు ఇవ్వకపోతే మీరు మరణి౦చేవారు” అని గుర్తు చేసాను. ఆ అంధముని పరోపకారార్దం మరొకటి కోరుకో అనిచెప్పి “ఇంక ఇదియే చివరిది నా మనసు గ్రహించి ఇంక నన్ను నీవు కలువ రాదు“ అని షరతులు పెట్టాడు. కాని నా మనసులో అధికార దాహం బుసలు కొట్టసాగింది. సరే, ఒకే దెబ్బకు రెండుపిట్టలు అని తలచి “మా యువరాణి పద్మిని దేవికి జబ్బు చేసింది, అది తగ్గించే శక్తి నాకివ్వు“ అని అడిగాను. ఆ అంధముని “తధాస్తు” అని నన్ను మాయం  చేసాడు. నేను మా రాజ్యం పొలిమేరలో ప్రత్యక్షమయ్యాను.

నా ఆలోచనలు మొత్తం రాజ్యం మీదే ఉన్నాయి. రాణి, ఆ అందాల రాశి నా సొత్తు అని ఆనంద పడసాగాను. పద్మిని దేవిని చూచుటకే మిగుల రాకుమారులు అత్యుత్సాహం  ప్రదర్శిస్తారు. అలాంటిది ఆ పద్మినినే నా దేవిగా మార్చుకుంటున్నాను అని సంబరపడ్డాను. అంతఃపురం దగ్గరకి వెళ్లి రాజభటులను ప్రశ్నించాను. వారు “ఇక , యువరాణి లేనట్టే“ అని అన్నారు. నేనొక మూలికా వైద్యుడనని చెప్పి “నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను. ఆ భటులు నన్ను పరిహసించారు. కాని అటుగా వెళ్తున్న రాజోద్యోగులు నన్ను చూసి ఏ పుట్టలో ఏ పాముందో అనుకొని  నన్ను లోపలికి తీసుకెళ్ళారు. అక్కడ రాజు, రాణి, సైన్యాధిపతి, రాజ పరివారము శోక సంద్రంలో మునిగి ఉన్నారు. వారి వద్దకు పోయి “నేను పద్మిని దేవికి వైద్యం చేయగలను అని చెప్పాను”. వారు కొంచం నిరాశావదనంతో  ప్రయత్ని౦చు అన్నారు. కాని సేనాధిపతి మాత్రం అనుమానంగా నన్ను చూసాడు. ”ఎంతో మంది వైద్యులు, ఋషుల వల్ల కానిది నీవల్ల ఎలా అవుతుంది” అని అనెను. ”అయ్యా! ఆలస్యం అయ్యే కొద్ది ప్రమాదం“ అనేసరికి, “నన్ను యువరాణిని వదిలిపొమ్మని“ అన్నాను. వారందరు బయటకి పోయి తలుపులు వేశారు. బయట ఎంతో బలగం ఉంది  అని నన్ను హెచ్చరి౦చారు. నేను పద్మిని దేవిని చూసి తను మృత్యుఒడిలో  ఉందని గ్రహించాను.

నేను వెంటనే ఆ అంధముని ఇచ్చిన వరమును ప్రయోగించాను. ఆ క్షణమే ఏవో రంగురంగుల ఛాయలు గల పాములు వచ్చి, రాణి దేహంలోకి వెళ్లి ఏవో పీల్చసాగాయి. అలా కొన్ని ఘడియల తరువాత ఆ పాములు మాయం అయ్యాయి. రాణి దేహం ఇప్పుడు జీవకళతో ఉట్టిపడి౦ది. యువరాణి కళ్ళు తెరచి “అమ్మా, నాన్న“ అంది. నేను వెళ్లి తలుపుకొట్టి, వాళ్ళని లోపలికి రమ్మన్నాను. వాళ్ళందరు రాణిని చూసి ఆనందోత్సాహానికి గురి అయ్యారు. వారు ఎంతో ఆనందపడ్డారు. నేను కాసేపు ఆగి, ”మహారాజా! మీరు చాటింపు వేసిన వరమును మరిచినారా?” అని అడిగాను. అక్కడ వారు, రాజపరివారం వారు “చూస్తూ చూస్తూ రాణిని నీకెలా ఇస్తారు? ఆలోచించి, అర్ధరాజ్యం పాలించే భాగ్యుడవా నువ్వు?” అని వెక్కిరించారు. నేను, అది సబబు కాదు అని అన్నాను. కావాలంటే, కావలిసినంత ధనము, రాజ్యంలో హోదా ఇస్తామని ఆశపెట్టారు. రాజ్యకాంక్ష మారు, యువరాణి అందం ముందు అవి నాకు గడ్డిపరకవలె తోచాయి. నాకు ముందుగా ఇచ్చిన చాటింపు ప్రకారమే కావాలి అని గద్దించాను. అంతట సేనాధిపతి వచ్చి, ”రాజా! నేను ఇతని మాయని చూసాను, ఏవో సర్పాల చేత తంత్రం చేసాడు, ఇలాంటి వారు ప్రమాదకారులు“ అని నా గూర్చి చెప్పసాగాడు. యువరాణికి “శ్రీమన్నారాయణ రక్షాకవచం” ధరింపజేసారు. అది, ఏ శక్తీ ఏమీ చేయలేని కవచం అని, అది ఋషులు ఇచ్చారు  అని అనుకున్నారు .

శ్రీమన్నారాయణ కవచం తొడిగిన తరువాత ఏ శక్తులు పీడించ లేవు. అలాగే, ఏదైనా పీడిస్తున్నపుడు అది తొడగకూడదు. కాని, నాకు ఏ మంత్రతంత్రాలు తెలియదు. వారు నన్ను మాంత్రికుడు అనుకున్నారు. వారిని ఏమైనా చేస్తానేమో అని అంతఃపురం చుట్టూ పురోహితులు, మంత్రద్రష్టల చేత మంత్రకవచాలు రూపొందించారు. నన్ను బంధించారు. స్వతహాగా బలిష్టుడిని కావటం వల్ల కొంత మందిని ఎదిరించాను. కాని ఎక్కువ సేపు ప్రతిఘటించలేకపోయాను. న్యాయం చెప్పవలసిందిగా రాజు గారిని మరొకమారు కోరాను. అయినా న్యాయం తెలుసుగనుకనే నీకు ధనం, హోదా ఇస్తామన్నాం. కాని నీవు దురాశ పడ్డావు, అని వెక్కిరించారు. రాణి గారు సైతం వెక్కిరించారు. నన్ను కొట్టి అవమానించారు. నన్ను బందిఖానాలో  వేయమని సేనాధిపతి ఆజ్ఞాపించాడు. కాని రాణిని కాపాడానన్న భావనతో నన్ను అంతఃపురం బయట త్రోసేసారు. రక్తసిక్తమైన నామొహం, నా మదిలో అవమానభారంతో రాజ్యం దాటి నడుచుకుంటూ పోయాను. అలా నడుస్తూ నడుస్తూ అరణ్యం మధ్యకి చేరాను.

అక్కడ ఒక గుహ, అందులో ఒక బిలం ఉందని ప్రతీతి. అక్కడ దెయ్యాలు, భూతాలు ఉంటాయని ఎవరు పోరు. ఆ విషయం రాజ్యంలో అందరికి తెలుసు. ఆ గుహలోకి రాగానే పావురాలు అరిచాయి. గబ్బిలాలు ఎగురుతున్నాయి. బూజు పట్టి ఉంది. బహుశా కొన్ని వందల ఏళ్ళుగా జన సంచారం లేదు. అలా ఒక 10 నిముషాలు నడచిన తరువాత, కాంతిలో ఒక బిలం కనపడింది. అందులోకి ప్రవేశించీ  ప్రవేశించగానే రెండు అస్తిపంజరాలు నన్ను అడ్డుకున్నాయి. భటులు అనుకొని వాటిని ఛిద్రం చేశాను. ఎదురుగా 100 అడుగుల శుద్ర దేవి విగ్రహం ఉంది. అక్కడ నుంచి చిన్నగా మంత్ర స్వరం వినిపించింది. ఏదైతే అది అని తెగించి ముందుకు నడిచా, అక్కడ ఆశ్చర్యం. మొండెం తల వేరువేరుగా ఉన్నాయి. తల మంత్రం చేస్తోంది. మొ౦డెం కూర్చొని ఉంది. గగుర్పాటుతో వెనక్కి నడిచా, ఒక పిశాచి నన్ను పట్టుకున్నట్లు కంపించిపోయా, ఎదురుగా సేనాధిపతి, ఎక్కడ లేని కోపంతో ముష్టి దెబ్బలు కురిపించా. ఆ సేనాధిపతికి నాకు పెద్ద యుద్దమే జరిగింది. చివరి వరకు తేలలేదు. అప్పుడు ఆ తల చేస్తున్న మంత్రం విని, దానిని మనసులో స్మరించాను. అప్పుడు ఆ సేనాని బలం తగ్గసాగింది. నా చేతులతో దాన్ని పట్టుకున్నాను. వెంటనే, అది తెల్లని పిశాచిగా మారింది. ఆశ్చర్యం కన్నా భయం వేసింది. కాని, పట్టు వదలలేదు. మంత్రం చేయటం ఆపలేదు. కొన్ని ఘడియల తర్వాత ఆ దెయ్యం పిశాచి అందమైన యక్షిణిగా మారింది. వదులు మార్తాండా అని కరుణతో అడిగింది. నీవు ఎవరి మీదైతే అమిత కోపంగా పగగా ఉంటావో వారి రూపులో నేను కనపడతాను. నేను ఆమెను నా చెర నుండి విడుదల చేసాను. ఏదైనా అడుగు నీ ప్రశ్నకు సమాధానం చెప్తా అంది. నేను ఆ తల మరియు మొండెం గూర్చి అడిగాను. ఆ యక్షిణి ఇలా చెప్పసాగింది..

No comments:

Post a Comment

Pages