Thursday, May 22, 2014

thumbnail

అలవాట్లు అనబడే మానసిక బలహీనతల్ని ఎదుర్కొనేదెలా ? : బి.వి.సత్య నాగేష్

ముహూర్త సమయం అయింది. అక్షితలు వెయ్యడానికి వెళ్దామా ? ఓ పని అయిపోతుంది రారాదూ ! అంటూ నా భార్య ప్రక్కన కూర్చున్న ఓ మహిళ అడిగింది. తర్వాత పెళ్ళి వేదిక వైపుకు బయలుదేరాం.

వధూవరులను ఆశీర్వదించడం అనే కార్యక్రమం పూర్తి చేసాం.

'భోజనాలు చేస్తే ఓ పని అయిపోతుంది కదా!' ఆ సదరు మహిళ.

సరే అంటూ భోజనాలు చేసే జనంతో కలిసిపోయాం.

"ఈమె నీకంత పరిచయమా" అని నా భార్యను నేనడిగాను. ఆమె ఎవరు అనే విషయాన్ని గుర్తుచేసింది నా భార్య అసలు విషయమేమిటంటే.............

ఆరు నెలల క్రితం ఒక పెళ్ళికి మేము హాజరయ్యాం. పెళ్ళి అయిన తర్వాత ఇంటికి తిరుగు ముఖం పట్టేం. బయలుదేరుతున్న సమయంలో ఆ సదరు మహిళ "మీరెటువైపు వెళ్తున్నారు?" అని అడిగింది. "విద్యాగర" అని సమాధానం చెప్పాం. "నన్ను విద్యానగర్ దాకా తీసుకెళ్తారా" అని అడిగింది. సరే అన్నాం. దారి పొడుగునా ఏవో కబుర్లు చెప్పింది. "మీరు పెళ్ళికూతురు తరపునా?" అని అడిగింది. 'ఔను’అన్నాం. "నేను పెళ్ళికొడుకు వైపు నుంచి వచ్చేను" అంది.

నా భార్య వివరాల్లోకి వెళ్ళలేదు. ఆ తరువాత కొన్నిసార్లు ఆ సదరు మహిళ పెళ్ళి సీజన్ ళొ పెద్ద మ్యారేజ్ హాల్స్ లో మాకు కనిపించింది. విషయమేమిటంటే.... ఈమెకొక బలహీనత అనబడే అలవాటుంది. మంచి పట్టుచీర కట్టుకుని, 'వన్ గ్రాం గోల్డు ' నగలు పెట్టుకుని ఖరీదైన కళ్యాణవేదికలున్న చోటుకు వస్తూ ఉంటుంది. పిలుపులేక పోయినా వస్తుందనే విషయం సంభాషణల ద్వారా క్రమేణా అర్థమైంది. చేదు ఉద్దేశాలు ఏమీ ఉండవు కాని పెళ్ళి వారిచ్చే చిరుకానుకలు తీసుకుని, పెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతుంది. ఆమేను చూస్తే కోపం వస్తుంది... జాలి కూడా కలుగుతుంది అంటుంది నా భార్య. పెళ్ళికి వచ్చే ఈ సదరు మహిళకు ఇదొక వింతైన మానసిక బలహీనత లాంటి అలవాటు.

ధనుషు కు గంపెడు సమస్యలున్నాయి. రోజూ సాయంత్రమయ్యేటప్పటికి కళాప్రదర్శనలు జరిగే ఆడిటోరియం కు చేరిపోతాడు. సినీ ఆర్టిస్టు నని పరిచయం చేసుకుంటాడు. 'ఏ సినిమాలో నటించేరు?" అని అడిగితే "అబ్బో! ఎన్నెన్ని చెప్పమంటారు.... చాలా సినిమాల్లో వేసాను. అవకాశాలు చాలా ఉన్నాయి. కాని సమయం దొరకలేదు" అంటూ ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడు. రోజూ ఆడిటోరియం కు వెళ్ళటం, వీలయినన్ని విజిటింగ్ కార్డులు ఇయ్యటం అనేది అతని బలహీనత. కార్డులు ఖరీదైనవి కాదు. ఒక్కొక్కసారి పెన్నుతో రాసిన కార్డులు, చిన్న పేపర్లను ఇస్తూ ఉంటాదు. "మీ కార్డు నా దగ్గరుంది" అని చెప్పనా.....

"ఏం పోయింది .... ఇంకొకటి ఉంచండి" అంటూ ఇస్తూ ఉంటాడు. ఇదొక రకమైన బలహీనత. అతనికి ఎన్నో ఆర్థిక, మానసిక, కుటుంబ సమస్యలున్నాయి.

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మానిసికమైన అలవట్లుంటాయి. సిగరెట్, త్రాగుడు, డ్రగ్స్, గుట్కాలాంటి అలవాట్లు కొన్నయితే, వాయిదాలు వేయటం, భయంతో బ్రతకటం, తనమీద తన జాలిపడటం, లక్ష్యాలు లేకుండా, ఆత్మపరిశీలన చేసుకోకుండా ఏదో రకంగా రోజులు గడపటం లాంటివి కూడా మానసిక అలవాట్లే.

మనిషికి పుట్టుకతో ఎటువంటి అలవాట్లు ఉండవు. తన ఆలోఛనను మనిషి ఉద్వేగంతో అలవాటుగా మార్చుకుంటాడు. ఏదైనా ఒక పనిని పదే పదే చేయటం ద్వారా గాని, ఊహించటం ద్వారా గాని మనిషి కొన్ని మానసివ ముద్రలను ఏర్పరచుకుంటాడు. ఈ మనసిక ముద్రలను పదే పదే తరచుగా గుర్తు చేసుకోవటం ద్వారా అలవాటుగా మార్చుకుంటాడు. అలవాట్లు కొన్నాళ్ళకు అసంకల్పిత చర్యలుగా మారిపోతాయి. ఈ ప్రక్రియ ఒక వలయాకారంలో జరుగుతూ ఉంటుంది. సున్నం బట్టి, నూనె గానుగ లో ఎద్దు తిరిగే తీరులో ఉంటుంది. జీవితం "గానుగెద్దు" జీవనశైలిని ప్రతిబింబింప జేస్తుంది. అక్కడే తిరుగుతూ బయట ప్రపంచానికి దూరం గా ఉంటుది. శక్తియుక్తులు తెలుసుకోలేక అక్కడే 'బాలో కప్ప ' జీవితం లా మారిపోతుంది.

ఈ అలవాట్లు అనే వలయం నుంచి బయట పడాలంటే వాటిని ఎదుర్కొనాలి. గానుగ ఎద్దు 'లింక్' ను తెంపుకుని బయటకు వస్తే ప్రపంచాన్ని చూడొచ్చు. అలాగే ఈ బలహీనతలనే అలవాట్లున్న వారు బయట పడాలంటే వారి 'అలవాటు ' ను ఒక 'సమస్య ' గా గుర్తించి దానిని ఎదుర్కొనాలి. 'నేనేం చెయ్యగలను?" అంటూ నిరాశతో ఉండకూడదు. అదెలా అనే విషయాన్ని చూద్దాం. దీనికొక చిట్కా ఉంది. దీనిని ‘FACE' అంటారు.

F = FIGHT  = యుద్ధము / ఎదురు తిరగడం

ఆ = Against = వ్యతిరేకత

ఛ్ = Cultivated = అలవరచుకున్న

ఏ = Experience = (అనుభవం)

సమయ్సను ఉద్వేగభావంతో నిరంతరం ఎదుర్కొనాలి. అలవాటు అనేది మనం పెంపొందించుకున్న మానసిక ముద్ర మాత్రమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే అలవాట్లు పుట్టుకతో రావు. ఈ చర్యతో చేపట్టాల్సిన అంశాలేంటో చూద్దాం.

1. సమస్య పై మానసిక యుద్ధం ప్రకటించాలి.

2. ఇంతవరకు జరిగిన ధన నష్టం, కాలనష్టం, పరువు నష్టం గురించి అంచనా వేసుకుని ఉద్వేగంతో ఉండాలి / కృంగి పోకూడదు.

3. మీ అలవాట్లు గురించి తెలుసుకున్న వారికి మీ అలవాటు నుంచి బయటపడటానికి ప్రయత్నం మొదలు పెట్టినట్లు ప్రకటితం చెయ్యాలి.

4. Qఉఇత్ డయ్ అనే ఒక రోజుకు తేదీని నిర్ణయించ్కోవాలి. మీ స్రేయోభిలాషులకు ఆ తేదీని తెలియజేయాలి.

5. మీ ఆత్మీయులు మీకు మానసిక బలాన్ని ఇచ్చే విధంగా వారికి మనవి చేసుకోవాలి.

6. ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటుకు లొంగిపోకుండా ఉండటానికి మీ చక్కని భవిష్యత్తు, మారిన వ్యక్తిగా నిన్ను నువ్వు సానుకూలంగా ఊహించుకోవాలి. దీనినే "సానుకూల దృశ్యం' (Positive Visualization) అంటారు. దీనివల్ల ఎంతోప్రేరణ, ఆత్మస్థైర్యం కలుగుతుంది.

7. తీరిక సమయం లేని పటిష్ఠమైన దినచర్యను ఏర్పరచుకోవాలి.

8. అలవాటుకు దూరమవుతున్నప్పుడు, నిన్ను నువ్వు అభినందించుకుంటూ సానుకూలంగా, సంతోషంగా స్పందించటం అలవర్చుకోవాలి.

రిహాబిలిటేషన్ సెంటర్ లో కొన్ని పద్ధతులతో నిపుణుల పర్యవేషణలో అలవాట్లను దూరం చేస్తారు.

పైన పేర్కొన్న సదరు మహిళ, ధనుష్ లాంటి వారివి శారీరకంగా ముడిపడిన మానసిక అలవాట్లకు కాదు కనుక వీరు 'మరాలి ' అని భీష్మించుకుని పైన పేరుకొన్న ఎనిమిది అంశాలను పాటిస్తే బలహీనతలనబడే అలవాట్లనుంచి సునాయాశంగా బయటపడి గౌరవప్రదంగా ప్రవర్తించి సంతోషం గా ఉండవచ్చు.


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information