"మూగ-మనుషులు!!" - ఆర్.వి.ప్రభు - అచ్చంగా తెలుగు

"మూగ-మనుషులు!!" - ఆర్.వి.ప్రభు

Share This

 " ఆత్రుత వల్లి"" "సెన్సిటివ్ సీనయ్య" భార్యా భర్తలు. చాలా అన్యొన్యం గా  వుంటారు!!...ఎప్పుడూ సినీమాలు, షికార్లు, పార్టీ లకివెళ్లడం!!..."లైఫ్ లో,  వుంటే వీళ్లలాగే వుండాలి" అని చుట్టుప్రక్కల వాళ్లు అనుకునే వాళ్లు!!

అలాంటిది, ఎన్నడూ లేని విధంగా " ఆత్రుత వల్లి"" , మన "సెన్సిటివ్ సీనయ్య" లో కొంచం మార్పు గమనించింది !!....అదీ,ఈమధ్యనే!!...ఎందుకో ముభావం గా వుంటున్నాడు!....దేనిమీదా ద్రుష్టి పెట్టటం లేదు..చిటికీ మాటికీ విసుక్కుంటున్నాడు!!....ఫోన్ లో ఎవరితోనో చాలా సేపు మాట్లాడుతున్నాడు !!...అలా మాట్లాడు తున్నఫ్ఫుడు  , ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నాడు!!

"ఏమండీ!.... ఈ మధ్య మీలో నేను మార్పు గమనిస్తున్నాను!...మునుపటి లాగా నాతో మీరు ఎక్కువ ప్రేమ గా వుండటం లేదు,అన్యమనస్కంగా కూడా వుంటున్నారు.ఒక వేళ మీకు ఆఫీస్ లో పని వత్తిడి ఎక్కువగా వుంటె చెప్పండి, ఓ వారం రోజులు లీవ్ పెట్టి, ఏ  ఊటీ వో ,కొడైకెనాలో వెళ్లివద్దము!!" అంది "" ఆత్రుత వల్లి""!!

"సెన్సిటివ్ సీనయ్య" మౌనం గా వున్నాడు !!

"మిమ్మల్నే!!..పోనీ మా అమ్మగారింటికి వెడదామా?!...హాయిగా మా కొబ్బరి తోట  లో విశ్రాంతి తీసుకోవచ్చు!!" అంది "" ఆత్రుత వల్లి""

ఇలాంటి ఆఫర్స్ ఇంకో రెండు మూడు ఇచ్చింది!

"దయచేసి, నన్ను నా మానాన వదిలెయ్యి!!నీకు పుణ్యముంటుంది!!...ప్లీజ్ !! అన్నాడు "సెన్సిటివ్ సీనయ్య"

అదేమిటండీ!!...పిల్లలు కూడా,.."మమ్మీ!!డాడీ అలావుంటున్నారేమిటీ?!" అని అడుగుతున్నారండీ!!" అంటూ వాపోయింది "" ఆత్రుత వల్లి""!!

అంతలో ఫోన్ మొగింది!!.. "సెన్సిటివ్ సీనయ్య" చాలా హేపీగా, అదుర్దాగా ఫోన్ తీసాడు!!...అతని మొహం లో,  వొక్కసారిగా అనందంకనిపించింది "ఓహ్ !! అలాగా!!ఇదిగో ఇప్పుడే వస్తున్నాను" అంటూ ఫోన్ ని రెండు సార్లు ముద్దుపెట్టుకుని , గబ గబా డ్రెస్ మార్చుకుని, స్ప్రేకొట్టుకుని ,బయటికి వెళ్లిపోయాడు!!

"" ఆత్రుత వల్లి"..నిర్ఘాంతపోయింది!!...ఓహో!! ఇదేదో తేదా విషయమే...మనిషి లో చాలా మార్పు  వచ్చింది...అంతకు ముందు,"నీవ్వే లోకంఅనేవాడు, ఇప్పుడు విసుక్కుంటున్నాడు...ఇదేదో రెండో సెటప్ వ్యవహారం లాగే వుంది!!

రాత్రి, బాగా పొద్దుపోయాక "సెన్సిటివ్ సీనయ్య" ఇంటికి వచ్చాడు,బట్టలు నలిగిపోయి వున్నాయి,మొహం లో అలసట కనిపిస్తోంది!!...ఎవరితోనూ మాట్లాడకుండ, గరాజ్ లోంచి కార్ తీసుకుని, మళ్లీ బయటికి వెళ్ళిపోయాడు!!

"అయిపోయింది,భగవంతుడా ...ఎవరి మోజు లోనో పడి, నన్నూ, నా పిల్లలినీ,అన్న్యాయం చేసేట్టు  వున్నాడు.." అని తెగ బాధ పడిపోతూ,ముక్కు చీదుకుంటూ,తన గది లోకి వెళ్లి తలుపు ధడాలున వేసుకుంది!!

"సెన్సిటివ్ సీనయ్య"." అర్ధ రాత్రి ఇంటికి వచ్చి తన గది లోకి వెళ్లి తన డయరీ ఓపెన్ చేసి రాయడం మొడలు పెట్టాడు.....

"ఈ రోజు, జీవితం లో నేను మరిచి పోలేని రోజు..ఆ వ్యక్తి ని నేను   అభిమానించినంతగా,నేను ఇంకెవరినీ అభిమానించ లేదు !!....ఆ వ్యక్తి స్థానంలో ఇంకెవరినీ ఉఊహించుకోలేను కూడా,....

ఆ వ్యక్తి  ధోనీ,మన కేప్టన్....ఈ రోజు మన ఇండియా,శ్రీలంక తో వోడిపోయింది!!

హే ! భగవాన్!!...తట్టుకోలేక పోతున్నాను!!

No comments:

Post a Comment

Pages