పెంపకం ( పేరెంటింగ్ ) : పైడిపాటి పద్మావతి విక్రం - కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. - అచ్చంగా తెలుగు

పెంపకం ( పేరెంటింగ్ ) : పైడిపాటి పద్మావతి విక్రం - కౌన్సిలింగ్ సైకాలజిస్ట్.

Share This
మనం పుట్టినప్పటినుంచి రక రకాల పాత్రలు  పోషిస్తున్నాము ,పోషిస్తాము. కూతురు/కొడుకు, అక్క/అన్నయ్య చెల్లి/తమ్ముడు,భార్య/భర్త కోడలు/అల్లుడు మొదలైనవి, ఆ తరవాత అమ్మ, నాన్న... లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా.
ఐతే ఇదివరకటి తరాల పెంపకం (పేరెంటింగ్ ) ప్రస్తుత పెంపకానికి అన్నివిషయాలలో చాల వ్యత్యాసం కనిపిస్తోంది.
కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా, పెంపకంలో వ్యత్యసాలకి కూడా అనేక కారణాలు.
  • ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం
  • తల్లిదండ్రులిరువురూ ఉద్యోగాలూ చేయడం.
  • ఒక్కళ్ళు, ఇద్దరూ సంతానం.
  • పిల్లల పట్ల అతి భయము/అతి శ్రద్ధ/ అతి జాగ్రత్త.
  • పిల్లల భవిష్యత్తు పట్ల అంతులేని ఆందోళన.
  • వాళ్ళు కోల్పోయిన జీవితం పిల్లల లో చూసుకోవాలి అని అనుకోవడం.
  • పక్కవాళ్ళ పిల్లలతో పోల్చుకోవడం.
  • తల్లిదండ్రులు పిల్లల ఎదురుగుండా వాదించుకోవడం.
  • ఒక్కళ్లు మందలిస్తోంటే ఇంకొకరు సమర్దించడం.
  • అన్నిట్టికన్నా ముఖ్యముగా తల్లిదండ్రుల మాటలకి చేతలకి లంకె కుదరకపోవడం.
  • ఇలా చెప్పుకుంటూ పొతే హద్దూ, సరిహద్దూ రెండూ ఉండవు
సరే కారణాలు అందరికీ తెలిసినవే, మరి తెలియనిది ఏమిటి, అది  తెలిస్తే సమస్యే లేదుగా.
ప్రతి మనిషీ ప్రతి దశలో కూడా నా అంతటి వాడు లేడనే అనుకుంటారు. అందుకే  మనం చాలాసార్లు పండితపుత్ర పరమశుంఠ అని, మంచి లక్షణాలు రమ్మన్నా రావు కానీ చెడ్డవి మాత్రం ముందుగా వస్తాయని, నా రంగు, రూపం, రుచి, వాసన(పోలికలు ) ఏమీ రాలేదనీ, ఇలా ఎవరికివాళ్ళు అనుకుంటూ వుంటారు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే   మంచి లక్షణాలు నావి అని, చెడ్డ లక్షణాలన్నీపక్క వాళ్ళ వని ప్రతిఒక్కరూ అలాగే అనుకుంటారు.
అలా కాకుండ పిల్లలు మన క్షిరొక్ష్ కాపీలని ఒరిజినల్  లో ఎలా వుంటే, ఏది వుంటే అదే వస్తుంది అన్న కనీస జ్ఞానం   కనుక వుంటే ఈరోజు  పిల్లల పెంపకం ఒక సమస్యలా కాక వరంలా ఉండేది. ఈ వరాన్ని మిమ్మల్ని మీరు  తీర్చి దిద్దుకునే ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలకి మీరే మార్గదర్శకులు అవవచ్చు.
ఆందుకే ఆన్నారు “common sense(ఇంగితజ్ఞానం ) is not so common”  అని. మరి ఈ అరుదుగా దొరికే  ఈ “ఇంగితజ్ఞానం “కావాలంటే ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, అది కావాలంటే ఏమి చేయాలి,?  ప్రతిదానిని డబ్బుతో కొలవడం, కొనడం అలవాటు పడిన మనకి డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి అని ముందుగా గ్రహించడమే  ఇంగితజ్ఞానం.
పిల్లల్నికనేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన  ఒకేసారి 26 ఎముకలు విరిగితే ఎంత నొప్పి వస్తుందో అలా ఉంటుందిట. కాని పెంచేటప్పుడు మొత్తం ఎముకలు  ( మన శరీరం లో 206 ఎముకలు  ఉంటాయి) అన్నీ విరిగితే ఎలా వుంటుందో ( అన్నివేళలా కాదు కానీ చాలా సార్లు ) అలా ఉంటుందిట.
కాబట్టి, జీవితపు అత్యంత క్లిష్టమైన సవాళ్లలో పెంపకం ఒకటైనా, అదే సమయంలో మనం మనపట్ల ఉన్నఅవగాహనా లోపం వల్ల దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాము.
ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉద్యానవనాన్నిఎంత శ్రద్ధగా పెంచుతామో అలాగే పిల్లల పెంపకం కూడా.  ముఖ్యంగా మొక్కలు, పిల్లలూ చిన్నగా ఉన్నప్పుడే చాలా శ్రద్ధ అవసరం. ఎందుకంటే మొక్క గా వంగనిది మానుగా వంగదు కదా !
ఆరోగ్యకరమైన సమాజం కావలంటే ముందు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమనగానే మన ఎత్తు, బరువు, సౌష్టవం మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంటే మన ఆలోచన విధానం ( attitude) అంతకన్నా ముఖ్యం.
ఫాదర్ ఆఫ్ సైకాలజీ  సిగ్ముండ్ ఫ్రూఎడ్ ఏమంటారంటే - మన యెక్క వ్యక్తిత్వం గర్భస్థ శిశువుగా వున్నప్పటినించే మొదలై ,మనకీ 10 ఏళ్ళు వచ్చేవరకూ ,మనకు జరిగిన అనుభవాలే మన భావి జీవితం. కాని దురదృష్టవశాత్తూ పిల్లలమీద శ్రద్ధ 10 ఏళ్ళ తర్వాతి నుంచే  కేంద్రీకరించడం వల్ల చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు అవుతోంది. కావాలంటే మీరే గమనించండి ఒక వ్యక్తీ గురించి, ఒక వ్యక్తిత్వం గురించి, ఒక సమాజంగురించి చెప్పాలంటే ఈ రోజుకీ రాముడే ఉదాహరణ, ఎందుకంటే రాముడి బాల్యం అంత అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు, గురువు విశ్వామిత్రుడు.
కాదంటారా చెప్పండి !

No comments:

Post a Comment

Pages