(భార్యాభర్తల అనుబంధం గురించి గురూజీ చెప్పిన మరిన్ని విశేషాలు)

 తాము బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కొందరు చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. వ్యాపార లావాదేవీలలో బంధాలు ఏర్పరచుకోవడం అనేది తప్పనిసరి. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, సంబంధాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించడం ఎందుకు ? ఈ బంధం ‘బెషరతైన ప్రేమ’ పునాదిగా కలది. ఇటువంటి వాటిల్లో బంధం దానికదే ఏర్పడుతుంది. ఒకవేళ మీరు వ్యక్తిగత స్థానాల్లో బంధాన్ని నిలబెట్టుకునేందుకై పని చేస్తుంటే, అది అన్నింటికంటే ఘోరమైన సంఘటన. నేను దాన్ని ‘శాపం’ అంటాను.   
సంతోష్ – వానప్రస్థం, సన్యాసం ఒకటేనా? వేర్వేరా ? మేము –  గృహ యజమాని  తన బాధ్యతల్ని అన్నింటినీ పూర్తి చేసుకున్నకా, చురుకైన సంఘ జీవనం నుంచీ విశ్రాంతి కోరి, తన భార్యతో అడవులకు వెళ్తాడు. ఇది వానప్రస్థం. ఇందులో భార్య, భర్తతో పాటే ఉండి అతని అవసరాలు కనిపెట్టుకుని ఉంటుంది. నగరపు ఆర్భాటాల నుంచీ దూరంగా ఉంటారు, అంతే ! బంధుమిత్రుల నుంచీ దూరంగా, ఏకాంతంగా ఉంటారు.వారు మానసికంగా తర్వాతి దశకు సిద్ధపడతారు.
మరొక అంశం ‘సన్యాసం’. భార్యాభర్తలు కాషాయ వస్త్రాలు ధరించి వేరవుతారు. ఎటువంటి రాగం లేక బంధం లేక జీవిత సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్తారు.   
భార్యను నిజంగా ప్రేమించి సాయపడే భర్తలు చాలా అరుదుగా తారసపడతారు. చాలా వరకూ నాకు ఇవన్నీ ‘ ఆనిమల్ హస్బెండరీ ‘ అనిపిస్తాయి.   
నేటి ప్రపంచంలో వ్యక్తిగత సంబంధాలు బహిరంగంగా, బహిరంగ సంబంధాలు వ్యక్తిగతంగా మారుతున్నాయి. దైవానుగ్రహం – పని చేసే చోట ప్రేమలు కలుగుతున్నాయి – చాలా జంటలు పని చేసే చోట్ల ఉద్వేగమైన సంబంధాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇక ఇంట్లో, భర్త ఫేస్ బుక్ పై ఉంటే, భార్య టీవీ రిమోట్ తో చానెళ్ళు మారుస్తూ ఉంటుంది. ఒక రకంగా ఇది హాస్యాస్పదంగా, మరొక రకంగా ఇది తీవ్రంగా పరిగణించదగ్గ అంశంగా అనిపిస్తుంది. తమాషా చూస్తుండండి...   
నేడు .... ఆమె మహారాష్ట్రియన్, అతను తమిళియన్. ఆమె బయో కెమిస్ట్రీ లో, మైక్రో బయాలజీ లో డాక్టరేట్. ఆమె పెద్ద ఫార్మా కంపెనీ కి ప్రెసిడెంట్. వాళ్లకి ముగ్గురు పిల్లలు. అతను బి.టెక్ EEE , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎం.ఎస్ చేసాడు. అతను ఇంట్లో ఉంటాడు. బాగా వంట చేస్తాడు. పిల్లల్ని చూసుకుంటాడు. కుటుంబం కోసం కావలసినవి అన్నీ కొనుగోలు చేస్తాడు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఆమెను ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్తాడు. నిజంగా ఆనందమయ దాంపత్యం. వారు యుఎస్ ఏ లో ఉంటారు. వారిని కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 15 ఏళ్ళ క్రితం – అతను – గురూజీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు మీరు నాకు సాయపడగలరా ? నేను – సరే, ఒక్కసారి నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడి చూస్తాను. వారు కాదంటే, ఒక షరతుపై నేను మీ పెళ్లి చేస్తాను. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నేను వారిద్దరినీ నా వద్దకు పిలిచాను. నేను – మీ ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనుంటే, ఒక షరతుపై నేను చేస్తాను. వాళ్ళు – అలాగే గురూజీ, అదేమిటో చెప్పండి. నేను – మీ ఇద్దరూ ప్రొఫెషనల్స్. సాధారణంగా, చాలా మంది ప్రొఫెషనల్స్ ఒక్కటైతే, వారికి ‘అహం’ అనే బరువును పని చేసే చోట నుంచీ ఇంటికి తెచ్చే అలవాటు ఉంటుందని నేను చూసాను. వారు ఇంట్లో పోట్లాడుకుంటూ ఉంటారు. మీరిద్దరూ ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే, ఒక్కరే భవిత (కెరీర్) కోసం ప్రయత్నించాలి. వేరొకరు వారి లక్ష్యాలను వదులుకోవాలి. అది ఆమైనా. నీవైనా మీలో ఎవరో ఒక్కరే !
వారిద్దరూ అంగీకరించారు. మేము పెళ్లి చేసాము. అంతా దైవానుగ్రహం.   
తల్లిదండ్రులు ఇండియా లో ఉన్నారు. అబ్బాయి పెళ్ళయ్యి, USA లో ఉన్నాడు. అభద్రతా భావం కల తలిదండ్రులు అబ్బాయికి తమవైపు, కోడలివైపు వారిమధ్య జరిగే రాజకీయాలన్నీ నూరిపోస్తుంటారు. అబ్బాయి USA లోని అమ్మాయిని వేదిస్తాడు. అబ్బాయి, తన స్వంత స్నేహితుడైన ఆమె సోదరుడితో మాట్లాడడం మానేస్తాడు. పిచ్చి పిల్ల – అసహాయంగా ఉంది. బాధను భరిస్తోంది. అబ్బాయికి బుర్రా లేదు, మనసూ లేదు. అతని తల్లిదండ్రులకు పరిణితి లేదు. వీరు నా శిష్యులు – సిగ్గుతో తల వంచుకుంటున్నాను. అబ్బాయి తల్లిదండ్రులు అతన్ని అంతగా అదుపులో పెట్టుకోవాలని ఆశిస్తే, వారతనికి పెళ్లి చేసి ఉండకూడదు. అలాగే అబ్బాయి అటువంటి పరిస్థితిని అదుపు చెయ్యగల సమర్ధత లేనివాడైతే అతను పెళ్లి చేసుకోకూడదు. వీరు ఎప్పటికైనా మారతారా? దైవానుగ్రహం – మా ప్రార్ధనలు.   యుఎస్ ఏ అబ్బాయి మరియు అతని తల్లిదండ్రుల గురించిన తాజా సమాచారం... ఫేస్ బుక్ కు ధన్యవాదాలు. అది అద్భుతాలు చేస్తుంది. అబ్బాయి తల్లిదండ్రులు నిన్న మా ఇంటికి పరిగెత్తుకు వచ్చారు. వారు వారి తప్పును గుర్తించినట్లు అనిపించింది, తమ తప్పును సరిచేసుకుంటామని మాట ఇచ్చారు. ఆ అబ్బాయి, అతని భార్య ఇవాళ ఉదయం నాతో మాట్లాడారు. వారు కూడా క్షమాపణలు కోరారు. వారు కూడా తప్పును దిద్దుకుని, పరిస్థితులు తిరిగి మామూలుగా అయ్యేలా సవరించుకుంటామని చెప్పారు. నేను మీలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరంతా వారి స్థితి ఏమిటో వారు మెరుగ్గా అర్ధం చేసుకునేలా చేసారు. మీ సూచనలు, వ్యాఖ్యలు వారు ముందుకు వచ్చి, తమ దృక్పధాన్ని మార్చుకుని, పరిస్థితులు చక్కబెట్టుకునేలా  స్పూర్తిని ఇచ్చాయి. దీనికి సంబంధించిన వారంతా వాస్తవాన్ని ఆచరణలో పెట్టి, మనందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.
అంతా దైవానుగ్రహం... మా ప్రార్ధనలు.   
గురూజీ , నా భార్య H1B వీసా పై USA వెళ్ళింది. దాదాపు 5 ఏళ్ళు అయ్యింది. ఆమె నా సందేశాలకు, ఫోన్ కు స్పందించదు. నాకు నిజంగా ఏం చెయ్యాలో తెలియట్లేదు.
నేను – కొన్ని సందర్భాల్లో భర్తలు అక్కడకు వెళ్లి స్పందించరు. నీ విషయంలో భార్య బదులు ఇవ్వట్లేదు. నేను కొందరు అమ్మలు, నాన్నలు , అంకుల్ – ఆంటీ లు అక్కడకు వెళ్లి తప్పిపోయారని విన్నాను. కాబట్టి, ఇది పెద్ద విషయమేమీ కాదు. లీగల్ గా ఏం చెయ్యాలో చేసి, ఓ పల్లెటూరి పిల్లను పెళ్లి చేసుకో.   
చాలా కాలం క్రితం నేను న్యూ జెర్సీ(USA)  లోని ఒకరింటికి వెళ్ళాను. నేను హాల్ లో కూర్చున్నాను. భర్త బయటకు వచ్చి, నన్ను పలకరించి, ఇప్పుడే స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళడంలో అతను వెనుక వచ్చిన భార్యను చూసుకోక, పొరపాటున ఆమె చేతికి కాస్త తగిలాడు. అప్పుడు నేనొక విచిత్రం చూసాను. భర్త – సారీ హనీ. భార్య – పర్లేదు ప్రియా. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను – మేముండే చోట మా పెళ్ళాలకు మేము తగిలితే, వారి తప్పు లేకున్నా, వారే సారీ చెప్పాలి. ఇక్కడ నువ్వు పొరపాటున తగిలినా, ‘సారీ హనీ’ అనీ, ఆమె పర్లేదనీ అంటోంది. ఎందుకలా ?భార్యాభర్తల మధ్య ఇన్ని మన్ననలా ? భర్త  – ఇష్... (లో గొంతుకతో ..) ఇక్కడ ఆమె విడాకులు అడిగితే, మూడు నెలల లోపున నేను నా ఆస్థులు , సంపాదన లో 50% ఇవ్వాలి.
నేను – కడుపునిండా నవ్వి, “కాబట్టి, అది ‘హనీ’ కాదు, ‘మనీ’ అన్నమాట !” అన్నాను.   
మీ భర్త/ భార్యను గురించి ఇతరులకు ఫిర్యాదు చెయ్యకండి. ఇతరులు అర్ధం చేసుకోలేక ఏదో ఊహించుకుంటారు. భార్యాభర్తల బంధం అత్యంత దగ్గరైనది. పిల్లల్లా ప్రవర్తించకండి. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. ఎటువంటి భేదాలైనా, పడగ్గది లోనే తుడిచివెయ్యాలి. అవి బయటకొస్తే, ఇతరులకు మీ కధ ఓ నవల చదువుతున్నంత వినోదంగా ఉంటుంది. ఇది మీ ప్రవర్తన వెనకున్న అపరిపక్వతను గురించి అమితంగా వెల్లడిస్తుంది.   
రాజ రాష్ట్ర కృతం పాపం రాజ పాపం పురోహితం భర్త స్వీకృతం శ్రీ పాపం శిష్య పాపం గురుం వ్రజేత్ ప్రజలు చేసే పాపాలు రాజుకు చేరతాయి. రాజు చేసే పాపాలు రాజ పురోహితుడిని చేరతాయి. భార్య చేసే పాపాలు భర్తను చేరతాయి.
శిష్యులు చేసే పాపాలు గురువును చేరతాయి.   
ఆమె- గురూజీ, నా కొడుకు ఇప్పుడు నా మాట వినట్లేదు, భార్య మాటే వింటున్నాడు. నేను – అతను పెరుగుతుండగా నువ్వతని మాట విని ఉండాల్సింది. నువ్వతనికి వినడమే నేర్పావు. ఇప్పుడు నువ్వు ముసలిదానివి అవుతున్నావు కనుక, అతడు తన రాజభక్తిని మార్చాడు. నీవెందుకు కలత చెందుతున్నావు ?నీవు నేర్పిందే అతను ఆచరిస్తున్నాడు. ఆమె- కాని, అతను నా మాటే వినాలి గురూజి, భార్య మాట కాదు.
నేను – హ హ హ – అక్కడే నువ్వు పొరపాటు చేసావు. నువ్వు ‘జీవత కాలం చెల్లుబాటు’ అయ్యే హక్కును తీసుకోలేదు.   
చాలా అవినీతిపరుడైన ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య చాలా మంచిది. దైవారాధకురాలు. అతను అడ్డదారిలో సంపాదించిందంతా ఆమె పేదలకు , అవసరార్ధులకు పంచేది. ఆమె వారికి వీలైనంతవరకూ అన్ని విధాలుగానూ సాయపడేది. ఆమె ఎల్లప్పుడూ నాతో అంటూ ఉండేది – ‘గురూజి, పేదవారికి, క్రిందివర్గాల వారికీ సాయపడడంలో నా భర్త నాకు తోడైతే యెంత బాగుండు ?’ నేను – తప్పకుండా, దైవం నీ ప్రార్ధనలు మన్నిస్తారు. అతడికి ఓ పెద్ద ప్రమాదం జరిగింది. నేను ఆసుపత్రికి వెళ్లాను. పెద్ద సర్జరీ అవుతోంది. డాక్టర్లు 10% మాత్రమే బ్రతికే అవకాశం ఉందన్నారు. ఆమె ఏడుస్తూ నన్ను ఇలా అడిగింది – గురూజీ, దయ చేసి ఆయన్న బ్రతికించండి. నేను –నువ్వు ముందే ఆయన్ను రక్షించావు, బాధపడకు, అతను బ్రతుకుతాడు. బహుశా, మారే అవకాశం కూడా ఉంది.
అతను బ్రతికాడు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు భార్యా, భర్తా చాలా పవిత్రంగా జీవిస్తున్నారు. కలిసి ఎన్నో దానధర్మాలు చేస్తున్నారు. ఈ జంటను ఇలా చూడడం నాకు సంతోషంగా ఉంది. అంతా దైవానుగ్రహం, దయ.  
భార్య – గురూజీ, నా భర్తకు నాపై నమ్మకం లేదు. ఒక రోజున అతడు ఆఫీసు నుంచి త్వరగా వచ్చి అరుస్తాడు, మరోకరోజున అతడు ఉదయాన్నే అరుస్తాడు, ప్రతీరోజూ అదొక నరకం గురూజి.
నేను – నమ్మకం లేని బంధం సిం లేని సెల్ ఫోన్ వంటిది. మరి సర్వీస్ లేని సెల్ ఫోన్ తో నువ్వు ఏమి చెయ్యగలవు ? మహా అయితే, గేమ్స్ ఆడుకోగాలవు, అంతేగా !   
భర్త చాలా తెలివైనవాడు. ఈ ప్రపంచంలో అటువంటివాడి తానొక్కడే అని అతను అనుకుంటాడు. భార్య – అతని దృక్పధంలో ఏ మాత్రం మార్పు లేదు గురూజి, నేను అతనికి రెండవ ఫిడేలు కొడుతూ(పొగుడుతూ) ఉండాలని అతను ఆశిస్తాడు.
నేను – నువ్వు దీన్ని స్వీకరించాలి. నీవు సర్దుకుని, అతన్ని పొగడడం నేర్చుకోవాలి, లేక అతన్ని వదిలేసి బయటకు రావాలి. లేకపోతే అతనికి రెండవ ఫిడేలు వాయించే బదులు నువ్వు కూడా జాజ్ వాయించుకోవచ్చు (నిన్ను నువ్వే పోగుడుకోవచ్చు) కదా !   
భర్త – గురూజీ, నా భార్య కాస్త తగ్గి, మెత్తబడే అవకాశం ఏదైనా ఉందా? నేను – ఖచ్చితంగా లేదు, ఆమె మారదు, నీవే తగ్గి ఉండడం మంచిది, ఇదంతా ముందే రాసి ఉంది. భార్య – గురూజి, నా భర్త కాస్త మెత్తబడే అవకాశం ఉందా? నేను – ఉంది, నేనొక ప్రయోగం చేసి దాన్ని తిరగారాసాను. ఇప్పుడు నీ భర్త నీతో చాలా మృదువుగా ఉంటాడు. భర్త భార్యకు ఫోన్ చేసి, తియ్యటి గొంతుతో – “నేను నిన్ను ఆఫీసు నుంచి తీసుకువెళ్లనా ?” అని అడిగాడు. భార్య నాకు ఫోన్ చేసి, ‘గురూజి, మీ ప్రయోగం పని చేసింది, ఆయన మారిపోయారు..’ అంది. ఈ నాటకం ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దామని నేను మనసులో అనుకున్నాను. భర్తకు ముందురాత ... భార్యకు తిరగరాత ... హ హ .  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top