మీ నవ్వుల కోసం -ఆర్.వి.ప్రభు - అచ్చంగా తెలుగు

మీ నవ్వుల కోసం -ఆర్.వి.ప్రభు

Share This

....విన .."రా మా ఆయన " ప్రవచనం!!!..."మన చరిత్ర ... వ భాగము!!"

..దేముడు మొదట ఒక గాడిదని స్రుష్టించి ..."నువ్వు గాడిదవి..వుదయం నుంచి సాయంత్రం దాకా బరువులు మోస్తూ బ్రితకాలి. నీ ఆహారం గడ్డి, నీకు అసలు బుధ్ధి వుండదు....నీ జీవిత కాలం 50 సం.లు " వెంఠనే గాడిద "స్వామీ !! 50 సం.లు గాడిద బ్రతుకు బతకాలంటే కష్టం !!! కాబట్టి దయచేసి నాకు 20 సం.లు కేటాయించండి ..చాలు" అని ప్రార్ధించింది !! దేముడు సరె అన్నాడు!! తరువాత దేముడు ,ఒక కుక్క ని స్రుష్టించి ...."నువ్వు కుక్కవి!!...మనిషి కి తోడుగా వుంటూ , ఎంగిలి మెతుకులు తింటూ, కాపాలా కాస్తూ, నువ్వు 25 సం.లు బతుకు తావు" అన్నాడు! "స్వామీ!!..మీరు చెప్పినట్టు కుక్క బతుకు 25 సం.లు బతకాలంటే కష్టం...నాకు 10 సం.లు ఆయుషు ఇవ్వండి చాలు" అంది!! దేముడు సరె అన్నాడు!! తరువాత దేముడు ,ఒక కోతి ని స్రుష్టించి ..."నువ్వు కోతివి. చపలచిత్తం ఎక్కువగా వుంటుంది, స్థిరంగా ఒక చోట కూర్చోలేవు ...గెంతులు వేస్తూనే వుంటావు , నువ్వు 25 సం.లు జీవిస్తావు" అన్నాడు!! "స్వామీ!!..25 సం.లు చాలా ఎక్కువ, నాకు 10 సం.లు చాలు...దయచూడండి!!" అంది కోతి!! దేముడు సరె అన్నాడు!! ఫైనల్ గా దేముడు "మనిషిని" స్రుష్టించాడు!! "ఓ!! మానవా!!ఎవరికీ ఇవ్వని బుధ్ధి నీకు ఇస్తున్నాను...నువ్వు ఈ భూమి మీద నడిచే ఏకైక జీవి వి!!..నీకు తెలివితేటలు అమోఘం గా వుంటాయి!!...నీకు 20 సం.లు ఆయుష్షు ఇస్తున్నాను !!అన్నాడు. "దేముడా...ఓ మంచి దేముడా !! ఆగు, ఆగాగు !! అన్ని స్పెషల్ క్వలిటీస్ తో నన్ను స్రుష్టించి, మరీ అంత తక్కువ ఆయ్ష్షు ఇస్తే ఎలా!!....ఒక పని చెయ్యండి స్వామీ!! ...గాడిద తిరస్కరించిన  "30"సం.లు, కుక్క తిరస్కరించిన 15 సం.లు, అలాగే కోతి వద్దన్న 10 సం.ల ఆయుష్షు కూడా నాకే కేటాయించండి...మీకు పుణ్యముంటుంది!!" అని   వేడుకున్నాడు!!! దేముడు, ఇంకా వేరే ఇతర పనులుండటం వలన "తధాస్తు"!! అన్నాడు!! ఆనాటి నుండి ఈనాటి వరకు ...మనిషి , తనకు ఇచ్చిన "20 సం.లు" ..మనిషి గా ఏ చీకూ చింతలు లేకుండా బతుకు తున్నాడు ....తరువాత పెళ్లి చేసుకుని సంసారాన్ని మోస్తూ బాధ్యతలు అనే బరువు ని తన మీద వెసుకుని, "గాడిద" లాగా, తన 40 వ యేట దాకా బతుకుతున్నాడు ...అటు పిమ్మట  "కుక్క"లాగా తన ఆస్థి నీ, కుటుంబాన్నీ  కాపాలాకాస్తూ, పిల్లలకి పెట్టి ,మిగిలనది తింటూ ఇంకో 15 సం.లు బతుకు తున్నాడు ...చివరికి మలి వయస్సు లో, తన మనవల్ని , మనుమరాండ్రళ్ళనీ  ఆడించడానికి, "కోతి" చేస్టలు చేస్తూ ,వాళ్లని నవిస్తూ ఆడిస్తూ బతుకు తున్నాడు!! సో! ఇదీ "మన చరిత్ర" !!

*********************************************************************************************************************************************************************

"రావణ కుమార్" కి పెళ్లి కావడం లేదు!!...ఎంతమంది అమ్మాయలని చూపించినా, "నో" నచ్చలేదు" అంటోంది!! "రావణ కుమార్" తన ఫ్రెండ్స్ కి చెప్పుకుని , తెగ బాధపడ్డాడు!!...ఇక నా జీవితం లోఅ నాకు పెళ్ళి కాదు!" అని వాపోయాడు!! చివరికి "రావణ కుమార్" కి వాళ్ల ఫ్రెండ్ ఒక అద్భుతమయిన సలహా ఇచ్చాడు "వురేయ్!!...ఈ సారి నువ్వు , అచ్చం మీ అమ్మ లాగే కనిపించే అమ్మాయిని తీసుకుని వెళ్లు , తప్పక నచ్చి తీరుతుంది!" అని. అలాగే చేసాడు మన "రావణ కుమార్"!! సాయంత్రం మళ్లా ఏడుపు ముఖం తో వచ్చాడు!! "ఏం ? ఏమయిండీ ? సక్సెస్సా!! అని అడిగాడు "రావణ కుమార్" ఫ్రేండ్! "మా అమ్మా ఓకే అందిరా....కానీ మా నాన్న "దేభ్యం మొహం "లా వుంది, అని రెజెక్ట్ చేసాడురా!!' అని గాఠి గా ఏడ్చెసాడు!!

No comments:

Post a Comment

Pages