టమోటా బాత్ (మరింత రుచిగా) : పెయ్యేటి శ్రీదేవి - అచ్చంగా తెలుగు

టమోటా బాత్ (మరింత రుచిగా) : పెయ్యేటి శ్రీదేవి

Share This

కావలసిన పదార్థాలు
ఒక గ్లాసు ఉప్మారవ్వ పండిన టమోటాలు 3 ఉల్లిపాయ 1 అల్లం పచ్చిమిర్చి, లేక ఒక స్పూను కారం 2 స్పూన్లు నెయ్యి కరివేపాకు కొత్తిమీర MTR సాంబారు పొడి నాలుగు బీన్సు (చిన్న ముక్కలు), లేక పచ్చి బటానీలు జీడిపప్పు, శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు తయారు చేయు విధానము బాణలిలో నూనె వేసి పోపుగింజలు వేగాక కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేగాక నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా మరిగాక, తగినంత ఉప్పు వేసి, MTR సాంబారు పొడి 3 స్పూనులు వేసి, తరవాత బొంబాయి రవ్వ మెల్లగా పోస్తూ కలియపెట్టాలి. మూత పెట్టి కాసేపయాక, నెయ్యి, కొత్తిమీర జల్లి కలియపెట్టాలి. ఇలా చేసి చూడండి. చాలా రుచిగా వుంటుంది. ముఖ్య గమనిక టమోటాబాత్ కి MTR సాంబారుపొడి, పోపులో జీలకర్ర వేస్తేనే రుచిగా వుంటుంది. నూనె పల్లీనూనె ఐతేనే రుచిగా వుంటింది. నూనె కూడా సరిపడా వెయ్యాలి. లేకపోతే ఉప్మా ఉండలు కడ్తుంది. ప్లేటులో పెట్టేటప్పుడు పులుసు గరిటతో నొక్కి వేస్తే ఇడ్లీ షేపు వస్తుంది. ఈ టమోటాబాత్ ఓట్సుతో కూడా చెయ్యచ్చు. ఇందులోకి బాదం చట్నీ చాలా బాగుంటుంది. లేకపోతే చట్నీ లేకపోయినా పరవాలేదు. బాదం చట్నీ కొబ్బరిపొడి, బాదం గింజలు, కొంచెం పుట్నాలపప్పు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఉప్పు, కొత్తిమీర, కొంచెం చింతపండు - ఇవన్నీ కలిపి ముందర మిక్సీలో వేసి, తరవాత నీళ్ళు పోసి తిప్పాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పోపు పెట్టాలి. ఈ చట్నీ పుట్నాలపప్పు చట్నీ కన్న చాలా రుచిగా వుంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ చట్నీ దోసెల లోకి, ఇడ్లీల లోకి కూడా బాగుంటుంది. పంపినవారు: శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి,హైదరాబాద్.

No comments:

Post a Comment

Pages