మా గోదావరి - అచ్చంగా తెలుగు
 మా గోదావరి
(కవిత)
మణి వడ్లమాని

ఎక్కడో పడమటి కొండలలో పుట్టి చిన్నపాయగా మొదలై
పాపి కొండలు మధ్యనుంచి ఉరుకులు పరుగుల తో
పరిపూర్ణ ధారగా ప్రవహిస్తూ...
అఖండమై విశ్వరూపాన్నిచూపిస్తూ,
తను నడిచినంతమేర ఆ ధరిత్రీ దేవికి
ఆకుపచ్చటి పంటచేల చీరను చుట్టబెట్టుతూ....
ఎప్పుడు చూసినా !గలగలా! కళకళలాడుతూ!

పరవళ్ళు తొక్కుతూఉగ్ర రూపం ప్రదర్శిస్తూ, వరద గోదావరి గా
మంద్రంగా ప్రవహిస్తూ , నవ్వుతూ పలకరించే శాంత గోదావరి లా
ఆటుపోట్లును తట్టుకొంటూ,ఒడిదుడుకులను అధిగమిస్తూ ధీరవనిత లా
కమ్మని ఆత్మీయత ని చూపిస్తూకన్న తల్లి లా సేదదీరుస్తూ
హాయిగా తన వడిలో సేద తీరమని పిల్లతెమ్మెరలని పంపిస్తూ
యెన్ని కష్టాలు,భాధలువచ్చినా కడుపులో దాచుకొనే తల్లి గోదావరి!

మోక్ష సాధక మయిన భక్తి ముక్తి మార్గాన్ని ప్రభోదిస్తూ
తన శక్తినంతా మనకు ధారపోసి త్యాగ శీలి
రిక్తహస్తాలతో తన ప్రస్థానం ఆ సాగరుడి వైపు సాగిస్తూ......
నిండుగోదావరి! తల్లిగోదావరి!మన గోదావరి!!!!!

No comments:

Post a Comment

Pages