గేయం : జయము జయము తెలుగుతల్లి!
రచన : భారతి కాట్రగడ్డ
జయము జయము తెలుగుతల్లి!
జయము నీకు కల్పవల్లి!
ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు!
;జయము;
భాషలెన్ని వున్నా-భవిత నీవె మాకు
పిల్లల మనసుల్లో-ఎల్లప్పుడు నీవేలే
పొంగిపొరలె మాప్రేమలె -నీమెడలో హారాలు
జీవమున్న తల్లివే-ఓయమ్మ నీవు
:జయము:
విలువైన సంస్కృతి-మాకు నీవు పంచినావు
పసిడి పంటల్లో-పసుపు తోటల్లో
చిన్నారుల నవ్వుల్లో-పెద్దవారి సూక్తుల్లో
జీవమున్న తల్లివే- ఓయమ్మ నీవు
:జయము:
పరుల భాషకి వందనాలు- మాతల్లివి నీవేలే
అఙ్ఞానం తొలగించి-విఙ్ఞానం అందించి
తరతరాల- కళ్లముందు నిలిపినావు
జీవమున్న తల్లివే- ఓయమ్మ నీవు.
:జయము:

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top