చక్కిలిగింతలు

 ఆర్.వి. ప్రభు"టౌను పక్కకెళ్లద్దురో డింగరీ....!!!

 "దానయ్య, దీనయ్య, ముసలయ్య" ముంబాయి వెడదామని 3 టికెట్టులు తీసుకుని రైలు ఎక్కారు. వారితోపాటే "జాన్, జానీ, జనార్ధన్"లు కూడా అదే రైలు ఎక్కారు. కొంతసేపు మాటలు జరిగాక, "ఎన్ని టిక్కెట్టులు కొన్నారు మీరు?" అని ఆడిగారు "జాన్, జానీ, జనార్ధన్"లు. 
"మూడు" అన్నారు "దానయ్య, దీనయ్య,ముసలయ్య" లు. 
"మూడా?? హహహ... మేము ఒక్కటే కొన్నాము" అన్నాడు వాళ్ల గ్రూప్ లీడర్ "జానీ" గాడు. 
"ఏమిటీ!!.. ఒక టిక్కెట్టు మీద ముగ్గురు ఎలా వెళతారు??!!" అడిగాడు మన గ్రూప్ లీడర్ "దానయ్య"!!
 "అదే మరి తెలివంటే...నువ్వే చూస్తావు గా!!" అన్నాడు "జానీ"!!.
 అంతలో టీ.సీ గారు వస్తున్నారు!.. మన "జాన్, జానీ, జనార్ధన్"లు ముగ్గురూ టాయ్లెట్ లోకి వెళ్లి తలుపు వేసేసుకున్నారు, అందులో ఒకడు చేతికి గాజులు తొడుక్కున్నాడు!!!! 
టీ.సీ, బహు తెలివైన వాడు!! అందరి టిక్కెట్లూ చూసిన తరువాత, టయ్లెట్ వద్దకు వెళ్లి డోర్ మీద కొట్టి "టిక్కెట్ ప్లీజ్" అన్నాడు!.. డోరు ఓరగా తెరుచుకుని, ఒక గాజులచెయ్యి బయటికి వచ్చింది, టిక్కెట్ తో!!... "ఒహ్! సారీ!!" అంటూ టీ.సీ గారు చెక్ చేసి వెళ్లిపోయారు!! 
ఇదేదో బాగుందే అనుకుని, తిరుగు ప్రయాణం లో "దానయ్య, దీనయ్య, ముసలయ్య"లు, ముగ్గురికీ కలిపి ఒక టిక్కట్టే కొన్నారు!! వాట్ అ కోఇన్సిడెన్స్!! "జాన్, జానీ, జనార్ధన్"లు, కూడా అదే రైలు ఎక్కారు!! "ఒహ్! మీరా, ఉఊం!! మళ్లీ 3 టికట్టులు కొన్నారా!? అని అడిగారు వాళ్లని , "ఆ మాత్రం తెలివి మాకూ వుందిలేవో !!ఈ సారి నేను ఒక్క టిక్కట్టే కొన్నాను, మీ లాగే!!" అన్నాడు "దానయ్య"!! 
"హెహ్హె!! మేము ఈ సారి టికట్టే కొనలేదు!! అన్నాడు "జానీ" గాడు!!... "మరి టిక్కెట్టు లేకుండా ఎలా??! అన్నాడు "దానయ్య". "అదే మరి, చూడూ!!" అన్నాడు "జానీ".... 
అంతలో "టీ.సీ గారు వస్తున్నారు!.." "జాన్,జానీ,జనార్ధన్"లు, వెంటనే టాయ్లెట్ కి వెళ్ళి, తలుపు వేసుకున్నారు!! 
మన "దానయ్య, దీనయ్య, ముసలయ్య"లు "ఒక చేతికి గాజులు తొడుక్కుని, ఎదురుగా వున్న మరో టాయ్లెట్ లోకి వెళ్లి తలుపు వెసేసుకున్నారు!! టీ.సీ వస్తున్నాడు!!... ఈ లోపు, "జానీ" గాడు ఎదురుగా వున్న టాయ్లెట్ డోర్ మీద కొట్టి "టిక్కెట్ ప్లీస్" అన్నాడు. వయ్యారంగా, ఓరగా తలుపు తెరుచుకుని, ఒక గాజుల చెయ్యి బయటికి వచ్చి టిక్కెట్ ఇచ్చింది!!! "హమ్మయ్య!!" అనుకుని, "జానీ" గాడు తన టాయ్లెట్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు!!!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top