అమ్మ 

సుసర్ల నాగజ్యోతిఉత్తమోత్తమమైన స్త్రీ జన్మ ఇచ్చింది
మెత్తమెత్తని ఒడిలో ఉయ్యాలలూపింది
అమృతాన్నే దించి అధరలకందించింది
తను కరిగిపోతూనే ఆనందమొందింది

మమత పొంగగ పెంచి మంచి బుద్ధులు నేర్పి
మానవత్వపు ఉనికి మరచి పోవద్దంది
అపకారి ఏనాడు ఎదురైన కాని
ఉపకారమే నీ ప్రతి అడుగులో తగునంది

ఏమిచ్చి తీర్చాలి మా అమ్మ ఋణము ?
ఏ ప్రేమ పెట్టాలి తన పాదాల ఫణము ?
ఆ బంగారుతల్లికి ఏమివ్వగలను ?
కన్నీట తడిమెదను తన జ్ఞాపకమును.

****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top