చదవండి .... అమరావతి కధలు - అచ్చంగా తెలుగు

చదవండి .... అమరావతి కధలు

Share This
చదవండి .... అమరావతి కధలు 

భావరాజు పద్మిని 




అమరావతి... గుంటూరు జిల్లాలో చిన్న ఊరు. కృష్ణ నది. నదీ తీరాన పంచారామాల్లో ఒకటయిన అమరేశ్వరాలయం. ఆలయం చుట్టూ వ్యాపించిన పున్నాగ పూల చెట్లు, ఆలయ ప్రాంగణం అంతా పూలతో అలంకరిస్తాయి. కార్తిక మాసంలో నది నిండా కొత్త నీరు, గాలిలో పున్నాగ పూల పరిమళం, రేవు దాటి నిశ్శబ్దంగా కూర్చుంటే, ఏదో మౌన సందేశాన్ని వినిపించే ప్రకృతి. కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు.ఆ ప్రశాంతత అనుభవిస్తే గానీ మాటల్లో చెప్పలేనిది. ఆ ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎన్ని సార్లు వెళ్లినా, ప్రతి సారి ఏదో కొత్త స్వాంతన ఆ గాలిలో. అదే ప్రశాంతత 'శంకరమంచి సత్యం' గారిని ప్రేరేపించి ఉంటుంది 'అమరావతి కధలు' రాయడానికి. ఆయన రెండున్నర ఏళ్ళు అక్కడి ప్రకృతిలో మమేకమయిపోయి, గాలిలో తెమలా, ఇసుకలో రేణువులా, కృష్ణలో అలలా, మనుషుల్లో మనసులా తాదాత్మ్యం చెంది, చరిత్ర పుటలపై చెక్కిన అమర శిల్పాలు. అమరావతి క్షేత్ర పాలకుడిలా, యోగిలా చరిస్తూ, ఆ నేల తల్లి పై కురిసిన వాన చినుకు మీద, తడిసీ తడవని ఇసుక రేణువు మీదా, అక్కడి మట్టిలోని దైవికత మీదా --సున్నితమయిన భావోద్వేగాలు,వెన్నెలలు-ఎండలు, వానలు- వరదలు, వ్యవస్తలు- వృత్తులు , పండగలు- పబ్బాలు, కల్మషం లేని ప్రేమలు, భిన్న మనస్తత్వాలు రంగరించి,హృద్యంగా అందించిన అమర కధలు.దాదాపు వంద కధల్లో తెలుగు జీవన విశ్వ రూపం కనిపిస్తుంది. మూడు ముక్కల్లో నూరేళ్ళ జీవితాన్ని మనకు చూపిస్తారు. ప్రతి కధలో మనల్ని ఆ పాత్రల్లో ఇమిడ్చి, అలా కృష్ణ ఒడ్డుకు, వాన చినుకులకు, ఆలయ ప్రశాంతతకు, భావోద్వేగాలకు గురి చేస్తారు. ఆ గాలి, మట్టి, నీరు, అన్నిటిని ఆస్వాదించి, మధించి కధలుగా అందించారు. మిత్రులారా, మనం ఎంతో అదృష్టవంతులం. అంతర్జాలం ఒక వరమయితే, అభిరుచి ఉన్న తెలుగు వాళ్ళు మన తెలుగు సాహిత్యాన్ని బ్రతికించడానికి పడే ప్రయాస మరొక వరం. కొన్ని అమరావతి కధలు క్రింది లింక్ లో చదువుకోండి. సహజత్వం, నిరాడంబరత్వం నిండిన ఆ కధల్లో మిమ్మల్ని మీరు మరచిపోండి. http://www.greatertelugu.com/telugu-books/Pustakalu/Amaravati-kathalu/Rendu-gangalu.pdf www.greatertelugu.com http://www.scribd.com/doc/12454095/Amaravati-Kathalu భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages